Jump to content

Recommended Posts

తెలుగుదేశం పార్టీ హయాంలో అడ్వకేట్ జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఆంధ్రప్రదేశ్ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన కృష్ణా జిల్లాలో తన భార్య పేరుపై, బావమరిది పేరుపై భూములు కొనుగోలు చేశారని గుర్తించామని ఏసీబీ ప్రకటించింది. అమరావతిలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తూ..ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది . ఆ సిట్ వివిధ రకాలుగా విచారణ జరిపి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. కేసులు పెట్టాలని ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా మొదట.. దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది.
 

దమ్మాలపాటి శ్రీనివాస్ గతంలో ఏజీగా పని చేశారు. ఇప్పుడు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలవుతున్న కీలకమైన కేసుల్ని వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో…, ఆయనపై కేసుల అస్త్రం ప్రయోగించడం చర్చనీయాంశం అవుతోంది. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకూ ఆయన భూములు కొనుగోలు చేశారని.. ఆ భూములన్నీ… సీఆర్డీఏ పరిధి… కోర్ క్యాపిటల్ ఏరియా పరిధిలో ఉన్నాయని ఏసీబీ చెబుతోంది. 2015-16లోనూ దమ్మాలపాటి శ్రీనివాస్ భూములు కొనుగోలు చేశారని తమ దర్యాప్తుల్లో తేలిందని ఏసీబీ చెబుతోంది.

నిజానికి భూముల కొనుగోళ్ల విషయంలో కేసులు నమోదు చేయడానికి ఏసీబీకి ఎలాంటి అధికార పరిధి ఉందో న్యాయనిపుణులకు కూడా అర్థం కావడం లేదు. దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఆయన భూములు కొనుగోలు చేయడం కూడా నేరం కాదు. ఒక వేళ ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట కొనుగోలు చేశారని చెప్పుకోవడానికి ఆయన టీడీపీ నేత కూడా కాదు. ఓ న్యాయవాది మాత్రమే. ఆస్తులు కొనుగోలు చేయడం తప్పు ఎలా అవుతుందో..ఇప్పటికి చాలా మందికి అర్థం కాని విషయం. ఏసీబీ కేసుల విషయంలో.. అమరావతి భూముల విషయంలో మరిన్ని కీలకమైన అంశాలు బయటకు రావాల్సి ఉంది. సిట్ వేసి..సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన ఏపీ సర్కార్ .. ఇప్పుడు హడావుడిగా ఏసీబీ ద్వారా కేసులు నమోదు చేయించడం.. చర్చనీయాంశం అవుతోంది.

Share this post


Link to post
Share on other sites

విజయవాడ: అమరావతి భూముల్లో అక్రమాల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యక్తిగత అజెండాను అమలు చేయడం మొదలుపెట్టిందా? పాత కక్షలన్నీ తీర్చుకునేందుకు ఏసీబీ విచారణకు తెరతీసిందా? మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై ఏసీబీ కేసు నమోదు చేసిన తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోంది. మాజీ అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తిపై ఇలా పర్సనల్‌గా గురిపెట్టడం న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అమరావతి భూములపై విచారణ అంటూ జగన్ పర్సనల్ ఏజెండాను అమలు చేస్తున్నారని కూడా దమ్మాలపాటి శ్రీనివాస్‌పై నమోదు చేసిన కేసుతో తేలిపోయిందని అంటున్నారు.

 

అమరావతి భూములపై విచారణకు ఆదేశించడానికి ముందే, సిట్ ఏర్పాటుకు దమ్మాలపాటి టార్గెట్ అయిపోయారు. అధికార యంత్రాంగం ఆయన వ్యక్తిగత వివరాల కోసం కూపీ లాగడం మొదలు పెట్టింది. అసలు ఏ మాత్రం సంబంధం లేని ఇంటిలిజెన్స్ శాఖ సీన్ లోకి ఎంటర్ అయ్యింది. దమ్మాలపాటి ఐటీ రిటర్న్స్ కావాలని, ఏకంగా గత పదేళ్లలో ఆయన దాఖలు చేసిన రిటర్న్స్ తమకి ఇవ్వాలని ఇంటిలిజెన్స్ ... ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాసింది. ఆదాయపు పన్ను శాఖ అదేం కురదరదని తేల్చేసింది. అయితే అసలు అమరావతి భూముల విషయంలో సిట్ వేయక ముందే ఇంటిలిజెన్స్ ఇలా ఓ ప్రైవేటు వ్యక్తి ఐటీ రిటర్న్స్ అడగడంలోనే అసలు మతలబు కనిపిస్తోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, దమ్మాలపాటిని కేసులో ఇరికించాలని ముందుగానే అనుకొని ఆధారాలు సేకరించారని ఇక్కడే తేలిపోతోంది అంటున్నారు న్యాయ నిపుణులు.

 

దమ్మాలపాటిపై జగన్ గురి ఈనాటిది కాదు. అక్రమాస్తుల కేసులో లాయర్‌గా దమ్మాలపాటి కీలకంగా వ్యవహరించారు. జగన్‌కి వ్యతిరేకంగా వాదించారు. జగన్ క్విడ్ ప్రోకో ఎలా చేశారు? తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలు వ్యవహారాలు ఎలా నడిపారు? కంపెనీలకు ఫేవర్లు చేసి, వాటి నుంచి ప్రయోజనాలను సొంతానికి ఎలా వాడుకున్నారో కోర్టుకు వివరించింది దమ్మాలపాటే.. ఆ ఫలితంగానే సీబీఐ 14 ఛార్జిషీట్లు వేసింది. ఈడీ కేసులూ నమోదు అయ్యాయి. అదే కక్షతో దమ్మాలపాటిపై నేరుగా జగన్ గురి పెట్టారు అని అంటున్నారు.

 

ప్రైవేటు వ్యక్తిగా ఉన్న దమ్మాలపాటి ఐటీ రిటర్న్స్ అడగడం మొదలు... రహస్య విచారణ అంటూ ఇంటిలిజెన్స్ రంగంలోకి దిగడం - ఏదో రకంగా దమ్మాలపాటిని ఏసీబీ కేసులో ఇరికించాడాన్ని బట్టీ అమరావతి పేరుతో జగన్ రాజకీయ వేట కొనసాగిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయ్ ఇప్పుడు. మాజీ అడ్వొకేట్ జనరల్ విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు న్యాయ వర్గాల్నే నివ్వెరపరుస్తున్నట్టు కనిపిస్తోంది. 

 

అమరావతి భూముల విషయంలో ఏసీబీ విచారణ పేరుతో ప్రభుత్వం రాజకీయ వ్యూహానికి తెర తీసినట్టుగా కనిపిస్తోంది. పాత కక్షలు అన్నీ సాధించేందుకు, వ్యక్తులను టార్గెట్ చేసేందుకు విచారణను వాడుకుంటున్నట్టు దమ్మాలపాటి వ్యవహారంతో తేలిపోతోంది అంటున్నారు న్యాయనిపుణులు. సిట్ విచారణకు ఆదేశించడానికి ముందే ఐటీ రిటర్న్స్ కోసం ఇంటిలిజెన్స్ శాఖ కోరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దమ్మాలపాటి జగన్ కేసుల్లో వాదించింనందుకే ఈ కక్ష సాధింపు అనే మాట వినిపిస్తోంది. ఆ కక్షతోనే జగన్ ఇప్పుడు మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటిగా గురి పెట్టారు అంటున్నారు. ఇంటిలిజెన్స్ రాసిన లేఖే దానికి రుజువు అంటున్నారు

Share this post


Link to post
Share on other sites

హై కోర్ట్ స్టే ఇచ్చింది

అమరావతి : అమరావతి భూముల వ్యవహారంలో హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా.. ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.

కాగా.. దమ్మాలపాటి తరపున ముకుల్‌ రోహత్గీ, శ్యాందివాన్‌ వాదనలు వినిపించారు. శ్రీనివాస్‌ను ఇరికించేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే అభియోగాలు మోపారని ఆధారాలతో సహా పిటిషనర్‌ తరపు న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. రాజధాని భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ దమ్మాలపాటిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితమే.

Edited by rajanani

Share this post


Link to post
Share on other sites
19 minutes ago, Chandasasanudu said:

I am curious to see how jagan life will be in next 10 years

daridram entante full ga bjp backing him, valluntha varaku emi cheyyalem.

inka janaallo realizatoin ravali. janaalu, maaku free ga savatsaraniki oka 60k vasthunnay ani, sagam mandhi, raastram etu thagaladuthunna atae unnaru..... kulam ani, matham ani.... free ani

kali yugam.... avakaasavaadha janaalu, evadidhi kaalithae kaani vaadiki telidhu, kaalae raaka inthae nidra pothoone, patichukokunda natisthoonae untaru...

Edited by AndhraBullodu

Share this post


Link to post
Share on other sites
1 hour ago, AndhraBullodu said:

daridram entante full ga bjp backing him, valluntha varaku emi cheyyalem.

inka janaallo realizatoin ravali. janaalu, maaku free ga savatsaraniki oka 60k vasthunnay ani, sagam mandhi, raastram etu thagaladuthunna atae unnaru..... kulam ani, matham ani.... free ani

kali yugam.... avakaasavaadha janaalu, evadidhi kaalithae kaani vaadiki telidhu, kaalae raaka inthae nidra pothoone, patichukokunda natisthoonae untaru...

Evariki 60K vachhedi per year ki???

Share this post


Link to post
Share on other sites
5 hours ago, TDP_2019 said:

Evariki 60K vachhedi per year ki???

40k ala easy gane vasthunnay anta. amma vodi, dwakra etc. etc. ani, chitoor lo frnd valla palle toorulo annadu 40k vachiniy chaala mandhiki year ki ani. inkekkado choosa yearly free batch ki 60k raaka vasthundhi, anni padhakaalu kalipi ani

Share this post


Link to post
Share on other sites

My neighbor Bc family

24,000 per year chenetha scheme

15,000 amma vodi 

18,750 for 45 years or more

Dwcra mafi 15,000 per year (vaalla group ki 6 lakh mafi ayyindhi)

 

Share this post


Link to post
Share on other sites
20 minutes ago, ravindras said:

My neighbor Bc family

24,000 per year chenetha scheme

15,000 amma vodi 

18,750 for 45 years or more

Dwcra mafi 15,000 per year (vaalla group ki 6 lakh mafi ayyindhi)

 

Not one year, every year ivvali.... entha mandi bc lu eliminate ayyaru from  scheme also important....

Share this post


Link to post
Share on other sites

One thing tdp can do is to create awareness among drinkers and their families regarding quality of liquor and its price.

How lifespan of people decreases if they drink ap liquor brands.

Example : Mee mogullu ee brands thaagithe 5 years lo pothaaru

Tdp needs to explain breakup of liquor price. Price given to liquor makers,  government taxes.

Example : quarter liquor thayaariki 2 rupees ayithe neeku 150 ki ammuthundhi.

Either tdp can start campaign on it own or it can take help of NGOs.  Campaign should be done aggressively by distributing pamphlets to each house, giving adds in tv media, print media, frequently conducting debates in tv media,  creating pages in social media and its server should be in western countries run by their citizens of ap origin.

It serves two purposes.

1. It saves health of ap drinkers. It protects drinkers families from financial distress.

2. It dent ap government revenues.

 

Share this post


Link to post
Share on other sites
1 hour ago, ravindras said:

My neighbor Bc family

24,000 per year chenetha scheme

15,000 amma vodi 

18,750 for 45 years or more

Dwcra mafi 15,000 per year (vaalla group ki 6 lakh mafi ayyindhi)

 

Asalu Dwakra loans ekkada maafi chesadu Jaffa??? 

I don't think you will get all these schemes for same person/family. Okati vasthe inkoti raadu ane clause untadi.

Share this post


Link to post
Share on other sites
2 hours ago, AndhraBullodu said:

40k ala easy gane vasthunnay anta. amma vodi, dwakra etc. etc. ani, chitoor lo frnd valla palle toorulo annadu 40k vachiniy chaala mandhiki year ki ani. inkekkado choosa yearly free batch ki 60k raaka vasthundhi, anni padhakaalu kalipi ani

Dwakra ladies 87 lks ki 18,750 isthunna ani cheppi, 6,7500 cr monna release chesaru. 87 lks ki 18,750 isthe total entha kaavali??? Veedi ichhina amount prakaram panchithe rough ga 8000 vasthundhi

 

Share this post


Link to post
Share on other sites
1 hour ago, TDP_2019 said:

Dwakra ladies 87 lks ki 18,750 isthunna ani cheppi, 6,7500 cr monna release chesaru. 87 lks ki 18,750 isthe total entha kaavali??? Veedi ichhina amount prakaram panchithe rough ga 8000 vasthundhi

 

Vaadu April 11 ki vunna outstanding amount mafi chesaadu. 4 instalments lo vesthaa annaadu. Konni dwcra groups just before elections loan theesukunnaaru, vaallaki motham mafi ayyindhi. Konni groups kattaalsina amount thakkuva vundhi, vaallaku thakkuva mafi ayyindhi.

Edited by ravindras

Share this post


Link to post
Share on other sites

ఈ ప్రశాంత్ భూషణ్ గాడ్ని సుప్రీం కోర్టు మింగటం లో తప్పు లేదు

Share this post


Link to post
Share on other sites
4 hours ago, ravindras said:

Vaadu April 11 ki vunna outstanding amount mafi chesaadu. 4 instalments lo vesthaa annaadu. Konni dwcra groups just before elections loan theesukunnaaru, vaallaki motham mafi ayyindhi. Konni groups kattaalsina amount thakkuva vundhi, vaallaku thakkuva mafi ayyindhi.

Ade time ki kattesina vaallaki bokka. Kattani vaallaki benefit.

Andariki 18,750 ichhi unte 14-15K crores paina ayyedi. Sagam paina eggottadu. 

Ippudu kooda veedu ichhe dabbulu appulaki kadatharu ani emundi, kharchu pettukuntaru. 

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×