Jump to content

Question Hour removed from parliament session


Royal Nandamuri

Recommended Posts

భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నాలుగు  ముఖ్య బిందువుల మీద ఆధారపడి ఉంటుంది. 

#Deliberating
#Legislating
#Executing
#Scrutinising

Deliberating:-  ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం. ముఖ్యంగా విద్య, వైద్యం, రవాణా, ఉపాధి వంటివి అందరికీ అందుబాటులోకి తేవడం, తద్వారా మానవ వనరుల అభివృద్ధి, వగైరా వగైరా..

Legislating:- సిద్ధం చేసిన ప్రణాళికలను అమలు చేయడానికి అవసరమైన చట్టాలను రూపొందించడం. ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దడం వంటివి కూడా.

Executing:- ప్రభుత్వ ఆధ్వర్యంలో పార్లమెంటరీ legislatures ద్వారా రూపొందించబడిన చట్టాలకు మార్గదర్శకాలు రూపొందించడం, వాటిని సక్రమంగా అమలు చేయడం. 

Scrutinising:- ప్రజల అవసరాలను అనుసరించి రూపొందించిన చట్టాలకు అనుగుణంగా ప్రజలకు ప్రభుత్వం ప్రయోజనాలను చేకూర్చిందా లేదా లేకపోతే ఏవైనా తప్పులు, పొరపాట్లు జరిగాయా వంటి వాటిని పరిశీలించడం. 

పైన చెప్పబడిన నాలుగు కూడా చాల ముఖ్యమైన అంశాలు. వాటికి సంబంధించిన వాటిలో నాల్గవది చాల ముఖ్యమైన అంశం దాని కోసమే మన చట్టసభలలో ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రవేశ పెట్టారు 1952లో.  

ప్రశ్నోత్తరాలను రెండు రకాలుగా విభజించారు. 1. Question hour 2. Zero hour. 

Question hour:- సభ్యులు తమ నియోజకవర్గం లేదా ఏదైనా ప్రజలకు ఉన్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నలను లిఖితపూర్వకంగా సంబందీత సభ సెక్రటరీకి అందజేయాలి. దానికి సంబంధించిన మంత్రి సభలో మౌఖికంగా లేదా సభ పటలం ద్వారా లేదా లేఖ ద్వారా సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది. 

Zero hour:- ఇందులో సభలో సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు లేదా ఉన్న విపత్కర పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. దానికి సంబంధిత మంత్రి వెంటనే సమాధానాలు చెప్పాలి. సంతృప్తి చెందని ఎడల ప్రశ్నించిన సభ్యుడు లేదా మరే ఇతర సభ్యుడు అయినా రెండు వరకు సప్లిమెంటరీ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది.  

ఇవన్ని సభ యొక్క రికార్డులలో నిక్షిప్తం అయి ఉంటాయి. దాని వలన ప్రభుత్వ వైఫల్యాలు లేదా సాధించిన విజయాలు తెలుస్తాయి ఎప్పటికీ. కాబట్టి ఇప్పుడు ఉన్న చాలామంది రాజకీయ నాయకులు వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరీముఖ్యంగా మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతుంది. ప్రస్తుతం మీడియా ఎలాగూ మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బదులుగా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు పార్లమెంటులో కూడా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు రాకుండా ఉండేందుకు, ముఖ్యంగా కోవిడ్, నిరుద్యోగ సమస్య, చైనా దురాక్రమణలు, దిగజారిపోయిన జీడిపి, ఆర్థిక పతనం వంటి అంశాలు, రాబోయే పార్లమెంటు సమావేశాలలో ప్రశ్నోత్తరాలను సస్పెండ్ చేసింది. 

మరి గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదా అంటే జరిగింది. ఒక్క 1961 మినహా ఎమర్జెన్సీ సమయంలో 1975,76,77 సంవత్సరాలలో జరిగింది. దానర్థం ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నట్లే కదా? అప్పుడు మీడియా ప్రభుత్వం ప్రజలకు చెప్పదలచుకున్నది మాత్రమే చెప్పేది. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం తాము ప్రజలకు చెప్పదలచుకున్నది మాత్రమే చెబుతానంటుంది. దానర్థం అప్రకటిత ఎమర్జెన్సీలో మనం ఉన్నట్లే కదా!

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...