Jump to content

రాజధానిపై వచ్చేనెల 21వరకు స్టేటస్‌ కో


rajanani

Recommended Posts

అమరావతి: రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.  వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై  గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవాళ్టితో ముగిశాయి. దీంతో సెప్టెంబరు 21 వరకు స్టేటస్‌ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కౌంటరు దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11వరకు గడువు ఇచ్చింది. అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు గడువు ఇస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ సెప్టెంబరు 21కి వాయిదా వేసింది.


విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్‌ కో అమల్లో ఉన్నప్పుడు అతిథిగృహం నిర్మాణానికి శంకుస్థాపన ఏంటని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా ఒక భాగమేనని వాదనలు వినిపించారు. దీనిపై సెప్టెంబరు 10వ తేదీ లోపు కౌంటరు దాఖలు చేయాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.  రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మొత్తం 70 పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

Link to comment
Share on other sites

4 minutes ago, Uravakonda said:

Eenadu, Andhra Jyothi congress ki support cheyadam ledhu ani Vaartha paper pettaru. Adhi saripodhani own ga donga pathrika pettaru. 

 

Same alane, new rajyangham and new courts pettandi meeku teerpu ichukunela. ivanni kaadhu gani, idhi mee post aa leka Reddy gari typing aaa? Mee Vanni vaayana sethullone untayi gada. Just questioning. 

Idhi elaa nachindho. Average gaa koodaa ledhu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...