Jump to content

అచ్ఛితా  - సివిల్స్


Recommended Posts

 

రాయలసీమ లో 80 ల్లో స్టార్ట్ ఐన వర్గ కక్షలు ఈ మధ్య వరకూ ఉన్నాయి చాలా పల్లెల్లో... అలాంటి పల్లెల్లో ఒకటి అనంతపురం జిల్లా, తాడిమత్రి మండలం, వెలంకూరు గ్రామం...  

ఒక పది-పన్నెండేళ్ల క్రితం వీళ్ళ నాన్న ను తాడిపత్రి లో టౌన్ లో నే చంపేశారు... అందరూ చూస్తుండగానే... కొన్ని రోజులకు వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది ఆ కక్షల్లో నే... అప్పట్లో వీళ్ళు టీడీపీ వర్గం లో ఉండేవాళ్ళు...  ఆ గొడవల్లో చాలా పోగొట్టుకున్నారు... ఇంకా చాలా మంది కోలుకోలేదు కూడా... ఇలాంటి బంధువులు చాలా పల్లెల్లో ఉన్నారు... 

టీడీపీ వాళ్ళు హైదరాబాద్ లో NTR model school అని ఒకటి నడుపుతారు... ఇలా వర్గకక్షల్లో ఆప్తులను కోల్పోయిన పిల్లల్లో కొంతమంది కి సిఫారసు తో అక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది... 

అలా చదువుకున్నారు ఈ అమ్మాయీ, తన అన్న... అన్నా బాగా చదువుకుని settle అయ్యాడు... ఇప్పుడు ఈ అమ్మాయి... 

ఫలానా కుటుంబాల లో పుడితేనే జ్ఞానం వస్తుంది అనేం లేదు... born talent అనేది ఒక మిథ్య... అవకాశాలు అంటూ ఉంటె, బాగా కష్టపడితే ఎవరికైనా ఫలితాలు వస్తాయి.... 

సిస్టం మీద complaint చెయ్యడం ఎంత ముఖ్యమో... ఎలా అయినా ఉన్న సిస్టం లో తోసుకుని పైకి రావడం కూడా ముఖ్యమే... పైకి వచ్చాక ఎన్నైనా అనొచ్చు... అనే వెసులుబాటు, మార్పు తీసుకువచ్చే అవకాశం రెండూ ఉంటాయి...

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...