Jump to content

Durga gudi Flyover Vijayawada completed


Recommended Posts

58 minutes ago, Chandasasanudu said:

This is cbn failure...he should have made sure to finish before elections...kesineni nani and cbn put great efforts...but again theesuku velli aadi notlo pettaru

Last year was complete failure due to lack of funds , ika daaniki chesedem ledu

People around that flyover know who built that ani manam anandapadatame

Link to comment
Share on other sites

దిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. విజయవాడ కనుకదుర్గ ఆలయం వద్ద ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించినట్లు కేశినేని నాని చెప్పారు. ‘‘2014లో భాజపా అధికారంలోకి వచ్చాక ఒక గొప్ప ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమితిచ్చారు. చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉండటం కలిసొచ్చింది. దీని నిర్మాణం విషయంలో గడ్కరీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అప్పుడు వైకాపా నేతలు సాధ్యం కాదన్నారు. కానీ సాధ్యం చేసి చూపించాం. దీంతో 20ఏళ్ల విజయవాడ ప్రజల కల నెరవేరింది. విజయవాడకు ఒక మణిహారంగా ఉండబోతోంది’’అని ఎంపీ నాని తెలిపారు.
 

ఇక రాష్ట్ర ప్రభుత్వం పాలనపై కేశినేని నాని మాట్లాడుతూ‘‘ఎప్పుడైతే జగన్ సీఎం అయ్యారో.. అప్పుడే రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లింది. విధ్వంసంతోనే జగన్ పాలన మొదలైంది. ప్రజా వేదిక కూల్చివేతే అందుకు నిదర్శనం. జగన్ ఇచ్చిన హామీల విషయంలో విఫలమయ్యారు. ప్రత్యేక హోదా అన్నారు. అది ఇప్పటికీ తేలేదు. చేతులెత్తేశారు. జగన్ ఒక విఫల సీఎం. ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. జగన్ సీఎం అయ్యాక కోర్టు ఆరవై సార్లు మొట్టికాయలు వేసింది. న్యాయ వ్యవస్థపై మాయని మచ్చ వేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలోకి వచ్చాక రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, గుండాయిజం పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారింది’’అని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...