Jump to content

National Education Policy

Recommended Posts

Mother tongue as the medium of instruction until grade 5. Good policy, hope it will be implemented properly. 
 
జాతీయ నూతన విద్యా విధానం - 2020
📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒
జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2020, జులై 29 ఆమోదించింది. ఈ నూతన విద్యా విధానంలో విద్యార్థుల సమగ్ర వికాసానికే పెద్దపీట వేశారు. అదే సమయంలో భారమూ తగ్గించే ప్రయత్నం చేశారు. మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా మార్పులకు శ్రీకారం చుట్టారు.

జాతీయ విద్యా విధానాన్ని తొలుత 1968లో, తర్వాత 1986లో రూపొందించారు. దానికి 1992లో పరిమితంగా సవరణలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 1986 విధానమే 34 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. దాని స్థానంలో కొత్త విధానం రూపొందించడానికి మోదీ ప్రభుత్వం 2016 మే 27న టీఎస్‌ఆర్‌ సుబ్రహ్మణ్యం కమిటీ, 2019 మే 31న కె.కస్తూరిరంగన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కస్తూరిరంగన్‌ కమిటీ నివేదికను ఇప్పుడు ఆమోదించింది.

జాతీయ నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం... ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు. కొత్త విధానంలో విద్యను సరళతరంగా మార్చారు. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులను చదువుకొనే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం భారంగా మారిన పాఠ్యాంశాలను తగ్గించి, విద్యార్థులు తమలో అంతర్గతంగా దాగిన నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు అవసరమైన సమయాన్ని కేటాయించుకొనే అవకాశం ఇవ్వబోతున్నారు. పాఠశాల విద్య పూర్తిచేసుకొని బయటికెళ్లేనాటికి కనీసం ఒక వృత్తి విద్యా నైపుణ్యమైనా విద్యార్థి సాధించేలా మార్పులు చేస్తున్నారు. అయిదో తరగతి వరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని నిబంధన విధించారు. వీలైతే 8వ తరగతి వరకు కానీ, అంతకు మించిన తరగతుల వరకు కానీ మాతృభాషలోనే విద్యాబోధన చేయడం ఉత్తమమని ఈ కొత్త విధానంలో రాష్ట్రాలకు నిర్దేశించారు. ఇకమీదట మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యాశాఖగా మార్చడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ప్రత్యేకతలు...
* రెండేళ్ల తర్వాత డిగ్రీ మానేసినవారికి డిప్లొమా
* 4 ఏళ్ల డిగ్రీ కోర్సు చేస్తే నేరుగా పీహెచ్‌డీలోకి ప్రవేశం
* విద్యార్థులపై భారం తగ్గించడానికి సిలబస్‌లో కోత
* మధ్యలో చదువు మానేసినా మళ్లీ కొనసాగించుకొనే అవకాశం
* 6వ తరగతి నుంచే కోడింగ్‌..వృత్తి విద్యా కోర్సులు
* 12వ తరగతి వరకు కస్తూర్బా విద్యాలయాలు
* బోర్డు పరీక్షల ప్రాధాన్యం కుదింపు

సరికొత్త సంస్కరణలు

మానేసినా గుర్తింపు..
ఇప్పటిలాగా... గణితం ఎంచుకున్నవారు చరిత్రపై ఆసక్తి ఉంటే వదలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే... డిగ్రీలో ఓసారి చేరి, ఇష్టం లేకున్నా మూడేళ్ళు తప్పనిసరిగా అదే చదవాల్సిన అవసరమూ లేదు. తమకు ఇష్టం వచ్చిన కాంబినేషన్లలో సబ్జెక్ట్‌లు తీసుకోవచ్చు.... ఇష్టం వచ్చినప్పుడు ఆ కోర్సు నుంచి వైదొలగవచ్చు. అప్పటి వరకు గుర్తింపు ఇస్తారు. మళ్లీ కుదిరినప్పుడు కొనసాగించవచ్చు. పరిశోధన చేయాలనుకుంటే నాలుగో ఏడాది వరకు ఉండి చేయొచ్చు కూడా! అలా విద్యార్థికి వెసులుబాటు ఉండేలా సబ్జెక్ట్‌ల ఎంపికలో, కోర్సు గడువులో (3-4 ఏళ్ళు) మార్పులు తెచ్చారు. ఇంజినీరింగ్‌ వాళ్ళు ఆర్ట్స్‌ చదివేలా... ఆర్ట్స్‌ ఎంచుకున్నవాళ్ళు సైన్సూ చదివేలా ఏర్పాటు చేస్తారు.
* తొలి సంవత్సరం: సర్టిఫికెట్‌
* రెండో ఏడాది: అడ్వాన్స్‌ డిప్లమో
* మూడో ఏడాది: బ్యాచిలర్‌ డిగ్రీ
* నాలుగో ఏడాది: పరిశోధనతో కూడిన బ్యాచిలర్‌ డిగ్రీ ఇస్తారు.

టీచర్‌ కావాలంటే ఇక....
ఉపాధ్యాయ సామర్థ్యాలపై కొత్త విధానంలో ప్రత్యేక దృష్టిసారించారు. ఉపాధ్యాయుల నియామకాలను ఇకమీదట పారదర్శక-పటిష్ఠ పద్ధతిలో చేపడతారు.
* బోధన పట్ల నిబద్ధత, తపన ఉన్నవారు
* అకడమిక్‌గా, బోధనాపరంగా, పరిశోధనపరంగా, ప్రజాసేవ పట్ల అంకితభావాలను కూడా పరీక్షించి తీసుకుంటారు.
* వారి సామర్థ్యాల్ని మదించిన తర్వాతే... పదోన్నతులుంటాయి.
* ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రమాణాలను రూపొందిస్తారు.

ఎంబీబీఎస్, ఇంజినీరింగ్‌ మాతృభాషలో?
భారతీయ భాషలకు, మాతృభాషలకు కొత్త విద్యావిధానం పెద్దపీట వేస్తోంది. కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో కూడా మాతృభాష, భారతీయ భాషలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్, ఇంటర్‌ప్రెటేషన్‌ (ఐఐటీఐ), పాళి, పెర్షియన్, పాకృతం, సంస్కృతాలకు సంబంధించి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి... అన్ని ఉన్నతవిద్యా సంస్థల్లో వీటి విభాగాలుండేలా చూస్తారు. ఉన్నత విద్యలోని అనేక కోర్సులను మాతృభాషల్లో, స్థానిక భాషల్లో నిర్వహించేందుకు ప్రోత్సహిస్తారు.

ఏ భాషనూ రుద్ద కూడదు...
స్కూల్‌ నుంచి మొదలెడితే... ఉన్నత విద్య వరకు ప్రతిదశలోనూ సంస్కృతం ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంటుంది. మిగిలిన భాషలు కూడా తీసుకోవచ్చు. ఏ భాషనూ విద్యార్థిపై బలవంతంగా రుద్దరు. సెకండరీ స్థాయిలో విదేశీవిద్యల్ని కూడా పరిచయం చేస్తారు.

3, 5, 8 లోనే పరీక్షలు
3, 5, 8 తరగతుల్లోనే స్కూల్‌ పరీక్షలుంటాయి. అవి కూడా నిర్దేశిత బోర్డు ద్వారా నిర్వహిస్తారు. 10, 12 తరగతులకు యధావిధంగానే పరీక్షలుంటాయిగాని... వాటి తీరు మారుతుంది. విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా... వారి జ్ఞానాన్ని, విశ్లేషణలను ఇతరత్రా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందుకోసం పరాఖ్‌ (విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, విశ్లేషించే సంస్థ)ను ఏర్పాటు చేస్తున్నారు. ఆరో తరగతి తర్వాతి నుంచే వృత్తివిద్యలను అందరికీ పరిచయం చేస్తారు. అంటే 12వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరికీ ఏదైనా ఓ వృత్తివిద్యలో ప్రవేశం ఉంటుంది.

ఎంబీబీఎస్‌ చేస్తూ కోడింగూ...
ఇప్పటిదాకా వృత్తివిద్యా కోర్సులది పూర్తిగా ప్రత్యేక దారి. సాంకేతిక విద్య, లా, వ్యవసాయ విద్య, వైద్యం, ఆరోగ్యం... ఇలా వేటికవే విడివిడిగా సాగుతున్నాయి. వీటన్నింటినీ ఉన్నతవిద్యలో భాగం చేసి... మల్టీడిసిప్లినరీగా వెసులుబాటు కల్పిస్తారు. అంటే... ఎంబీబీఎస్‌ చేస్తూనే కావాలంటే కోడింగ్‌ కూడా నేర్చుకోవచ్చు.

నూతన విధానంలోని మార్పులు..

కొత్తగా 3 కోట్ల సీట్లు
2035 నాటికి ‘స్థూల నమోదు నిష్పత్తి’ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో)ని ఇప్పుడున్న 26.3% నుంచి 50%కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఉన్నత విద్యా సంస్థల్లో కొత్తగా 3 కోట్ల సీట్లు వస్తాయి.
* అన్ని కోర్సుల్లో హోలిస్టిక్, మల్టీ డిసిప్లినరీ విద్యా విధానాన్ని తీసుకొస్తారు. సబ్జెక్టులను సరళంగా మార్చనున్నారు.
* యూజీ కోర్సుల్లో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణ (మల్టిపుల్‌ ఎంట్రీ/ఎగ్జిట్‌) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడున్న విధానంలో 4 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆరు సెమిస్టర్ల తర్వాత చదువుకోలేని పరిస్థితి వస్తే పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఒక ఏడాది తర్వాత విద్యార్థి మానేస్తే సర్టిఫికెట్‌ ఇస్తారు. రెండేళ్ల తర్వాత మానేస్తే డిప్లొమా, 3-4 ఏళ్ల తర్వాత డిగ్రీ అందిస్తారు.
* ఉద్యోగాలకు వెళ్లాలనుకున్న వారికి మూడేళ్ల డిగ్రీ, పరిశోధన రంగం వైపు వెళ్లాలనుకున్నవారికి నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాం అమలు చేయనున్నారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి ఓ ఏడాది పీజీ కోర్సు ఉంటుంది. దాని తర్వాత ఎంఫిల్‌ చేయాల్సిన అవసరం లేకుండానే పీహెచ్‌డీకి వెళ్లొచ్చు. మాస్టర్స్‌తో కలిపి అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ అమలు చేస్తారు. ఎంఫిల్‌ను తొలగిస్తారు.

నిధుల పెంపుతో చేయూత
సాధ్యమైనంత త్వరగా జీడీపీలో 6% నిధులు విద్యారంగానికి కేటాయిస్తారు. ప్రస్తుతం - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 4.4% నిధులు ఇస్తున్నాయి.
* అమెరికాలో నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఉన్నట్లుగా దేశంలో నేషనల్‌ రీసెర్చి ఫౌండేషన్‌ ఏర్పాటు చేస్తారు. శాస్త్ర, సామాజిక శాస్త్రాల విభాగాల్లో చేపట్టే భారీ పరిశోధన కార్యక్రమాలకు దీని ద్వారా ఆర్థిక చేయూత అందిస్తారు. పరిశోధన, నవ్యావిష్కరణలు, పేటెంటింగ్‌లో ఈ ఫౌండేషన్‌ ద్వారా సాయం చేస్తారు.
* విద్యా రంగాన్ని అంతర్జాతీయీకరణ చేస్తారు. విదేశీ విద్యాసంస్థలు ఇక్కడ ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకొనేలా ప్రోత్సహిస్తారు.

తెలుగులోనూ ఇ-కంటెంట్‌
* ఇప్పటి వరకు ఇంగ్లిష్, హిందీలకే పరిమితమైన ఈ-కంటెంట్‌ను తెలుగుతోపాటు 8 భారతీయ భాషల్లో అభివృద్ధి చేసి అమల్లోకి తెస్తారు.
* అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో వర్చువల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తారు.
* విద్యా రంగంలో సాంకేతిక వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడానికి ప్రైవేటు, ప్రభుత్వ, సాంకేతిక రంగాన్ని ఒకే వేదిక మీదికి తెస్తూ ‘నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఫోరం’ ఏర్పాటు చేస్తారు.

పాఠశాల విద్యా విధానంలో...
పూర్వ ప్రాథమిక విద్యను (ప్రీ ప్రైమరీ) సార్వత్రీకరిస్తారు. దీనికి సంబంధించిన పాఠ్యాంశాలను ఎన్‌సీఈఆర్‌టీ అభివృద్ధి చేస్తుంది. 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు ఆటలు, కార్యకలాపాల ఆధారమైన సరళ పాఠ్యాంశాలను అమల్లోకి తెస్తారు.
* 1 నుంచి 3 తరగతులు చదివే 6-9 ఏళ్ల విద్యార్థులు ప్రాథమికమైన అక్షరాలు, అంకెలు సరిగా గుర్తుపట్టి చదివేలా, లెక్కలు చేసేలా తీర్చిదిద్దేందుకు ఒక నేషనల్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక దశలో విద్యార్థులు నిర్దేశిత పాఠ్యాంశాలను సరిగా నేర్చుకొనేలా తీర్చిదిద్దడమే ఈ మిషన్‌ ప్రధాన ఉద్దేశం.
* బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇప్పుడున్న 8, 10 తరగతుల నుంచి 12వ తరగతి వరకు పెంచుతారు.
* ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గించనున్నారు. ఏటా ఒకసారి కాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్ట్‌లో విద్యార్థులకు రెండు స్థాయిలు ఉంటాయి. బట్టీ పట్టే సామర్థ్యాన్ని కాకుండా వారిలోని తెలివితేటలను పరీక్షించేలా వీటిని తీర్చిదిద్దుతారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేలా వాటిని నిర్వహిస్తారు.

పురోగతి నివేదికలూ మారిపోతాయి
విద్యార్థుల పురోగతి నివేదిక (ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌)లో మార్పులు తెస్తారు. ఇప్పటివరకు విద్యార్థి మార్కులతోపాటు, వారి ప్రవర్తన గురించి టీచర్లు రాసే అభిప్రాయాలు మాత్రమే అందులో ఉంటున్నాయి. ఇకమీదట విద్యార్థి స్వీయ అభిప్రాయంతోపాటు, వారి సహాధ్యాయి, టీచర్ల అభిప్రాయాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఏటా విద్యార్థులు నేర్చుకోవాల్సిన జీవన నైపుణ్యాల (లైఫ్‌స్కిల్స్‌) గురించి తల్లిదండ్రులతో మాట్లాడి నివేదిక రూపొందిస్తారు. 12వ తరగతి ముగించుకొని బయటికెళ్లే సమయానికి వారు ఏయే నైపుణ్యాలు నేర్చుకున్నారన్నది దానిలో నిక్షిప్తం చేస్తారు.

ఏ భాషనూ బలవంతంగా రుద్దవద్దు
త్రిభాషా సూత్రంతో సహా అన్ని స్థాయి తరగతుల్లో సంస్కృతం ఉండేలా చూడాలని, దాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలిపెట్టాలని కొత్త విధానం స్పష్టం చేసింది. ఇతర భారతీయ ప్రాచీన భాషలను ఎంచుకొనే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పించాలని పేర్కొంది. విద్యార్థులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దొద్దని స్పష్టం చేసింది. భారతీయ భాషలను విద్యార్థులు చాలా ఆనందంగా నేర్చుకొనే వాతావరణాన్ని కల్పించాలని పేర్కొంది. పలు విదేశీ భాషలు నేర్చుకోవడానికీ వీలు కల్పించాలని సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా ఇండియన్‌ సైన్‌ లాగ్వేంజ్‌ను ప్రామాణీకరించాలని పేర్కొంది. బధిర పిల్లల కోసం జాతీయ, రాష్ట్రస్థాయిల్లో పాఠ్యాంశాలు అభివృద్ధి చేయాలంది. భారతీయ భాషల సంరక్షణతోపాటు, వాటి వినియోగాన్ని పెంచి, వాటికి గతిశీలతను తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్లు నూతన విద్యా విధానం పేర్కొంది.

మరిన్ని అంశాలు

10+2+3 బదులు 5+3+3+4
పాఠ్యక్రమాల నిర్మాణాన్ని పూర్తిగా మారుస్తున్నారు. ప్రస్తుతం 10+2+3 విధానం ఉంది. పదోతరగతి వరకు విద్యార్థులకు దశలవారీ పాఠ్యాంశాలు ఉంటాయి. ప్లస్‌టూకి వెళ్లినవారికి ప్రత్యేక సబ్జెక్ట్‌లు వస్తాయి. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి 5+3+3+4 ఏళ్ల పాఠ్యక్రమ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో 3 నుంచి 6 ఏళ్లవరకు పిల్లలకు ప్లేస్కూల్‌ ఉంటుంది. వారికి ఎనిమిదేళ్లు వచ్చేంతవరకూ ఆటలు, ఇతర కార్యకలాపాలు, అనుభవ పూర్వకంగా నేర్చుకోవడం వంటివి ఉంటాయి. 3 నుంచి 8 ఏళ్ల లోపు వారు ఫౌండేషన్‌ స్టేజిలో, 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు ప్రిపరేటరీ స్కూలింగ్‌లో, 11-14 ఏళ్ల వారు మిడిల్‌ స్కూల్‌లో, 14-18 ఏళ్లవారు సెకెండరీ స్థాయిలో ఉంటారు. 6 నుంచి 8 తరగతుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఏ కూర్పులోనైనా సబెక్టులు తీసుకోవచ్చు. అంటే ఫిజిక్స్‌తో పాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కానీ, ఆహార తయారీ కోర్సులు కానీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు కానీ ఎంచుకోవచ్చు. విద్యాహక్కును 1 నుంచి 8వ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రీ స్కూల్‌ నుంచి 12వ తరగతి వరకు విస్తరింపజేస్తారు.

డిజిటల్‌ లాకర్లలో పాత క్రెడిట్లు
ఒకటి రెండు సంవత్సరాలు చదివిన తర్వాత విద్యార్థులు ఏదైనా కారణాలతో చదువు మానేసినా, మళ్లీ తనకు వీలైన సమయంలో దానికి కొనసాగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అప్పటివరకు ఆ విద్యార్థి చదివిన ఒకటి, రెండు సంవత్సరాలకు సంబంధించిన క్రెడిట్స్‌.. డిజిటల్‌ లాకర్స్‌లో భద్రంగా ఉంటాయి. విద్యార్థి మళ్లీ తొలి సంవత్సరం నుంచి చదవాల్సిన అవసరం లేదు. అప్పటివరకు తన డిజిటల్‌ లాకర్‌లో ఉన్న క్రెడిట్స్‌ను ఉపయోగించుకొని మిగిలిన సంవత్సరాలు పూర్తిచేయొచ్చు.ప్రాథమిక స్థాయి నుంచే సైన్స్‌పై ఆసక్తి
సైన్స్, లెక్కలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే వారిని ప్రోత్సహిస్తారు. 6వ తరగతి నుంచి విద్యార్థులకు కోడింగ్‌ నేర్పిస్తారు. ప్రస్తుతం విద్యార్థులు సంగీతం, కళలు, ఆటలు, ఇతర ఆసక్తికర అంశాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల సైన్స్‌పై ఆసక్తి, సమస్యలను పరిష్కరించే తత్వం, సంక్లిష్టమైన ఆలోచనా విధానం వారిలో తగ్గిపోతోంది. దీని దృష్ట్యా- ఇప్పుడున్న పాఠ్యాంశాలను అత్యవసర అంశాల వరకే పరిమితం చేసి మిగతా వాటిని తగ్గిస్తారు. వృత్తి విద్యా కోర్సులను 6వ తరగతినుంచే ప్రారంభిస్తారు. ఇందులో ఇంటర్న్‌షిప్‌ సైతం ఉంటుంది

యూజీసీ, ఏఐసీటీఈ ఉండవు
ప్రస్తుతం విద్యావ్యవస్థ నియంత్రణ కోసం యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వంటి వ్యవస్థలున్నాయి. వీటన్నింటినీ విలీనం చేసి మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
* అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే నిబంధనలు అమలుచేస్తారు.

సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఒక్కటే పరీక్ష
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా పరీక్షలు జరుపుతున్నాయి. ఉమ్మడి పరీక్ష వల్ల విద్యార్థులకు పలు పరీక్షలకు హాజరయ్యే భారం తగ్గుతుందన్నది కేంద్రం ఆలోచన. అయితే ఇది తప్పనిసరి కాదని, ఐచ్ఛికమన్నారు. ఆ పరీక్షలో వచ్చిన స్కోర్‌తో ప్రవేశాలు ఇచ్చుకోవడం ఆయా విద్యాసంస్థల ఇష్టమని కేంద్రం తెలిపింది.

గుర్తింపు ఆధారంగా స్వయం ప్రతిపత్తి
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల కింద 45వేల అనుబంధ కళాశాలలు ఉన్నాయి. వాటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంవల్ల విద్యా ప్రమాణాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇకమీదట వీటికున్న అక్రిడిటేషన్‌ ఆధారంగా విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తారు. ఏ+, ఏ, బి గ్రేడ్‌లున్న విద్యాసంస్థలకు విభిన్నమైన ఆర్థిక, విద్యాపరమైన స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇప్పుడున్న అనుబంధ విధానాన్ని 15 ఏళ్లలో పూర్తిగా రద్దు చేస్తారు.
* విద్యార్థులు, అధ్యాపకులకు మార్గనిర్దేశం చేయడానికి ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ మెంటారింగ్‌’ ఏర్పాటు చేస్తారు.

ప్రభావం

పాఠశాల విద్యలోకి ఇంటర్‌
జాతీయ నూతన విద్యావిధానం అమలులోకి వస్తే తెలుగురాష్ట్రాలపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 12వ తరగతి వరకు పాఠశాల విద్యలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో ఉన్నతవిద్య పరిధిలో ఉన్న ఇంటర్మీడియట్‌ బోర్డులు పాఠశాల విద్య కిందికి రానున్నాయి. ఫలితంగా జూనియర్‌ కళాశాలలు ఇక నుంచి అవే పేరుతో పనిచేస్తాయా? వాటిని కూడా పాఠశాలలుగా మారుస్తారా అనే చర్చ సాగుతోంది. కళాశాలల్లోనే కింది తరగతులను కూడా ప్రారంభించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్య నిర్మాణం 5+3+3+4 లాగా మార్చినా ఒక్కో దశకు ఒక్కో పాఠశాల ఏర్పాటు చేయరని చెప్పారు. పాఠశాల విద్య పరిధిలోకి వచ్చినా ఇంటర్‌బోర్డు మనుగడలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

పలు భాషల వారుంటే ఎలా?
అయిదో తరగతి వరకు మాతృభాషలో బోధన ఉండాలని కేంద్రం నిర్ణయించగా దాన్ని అమలు చేయడంలో సమస్యలు తప్పవని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో పలు రాష్ట్రాల వారు నివసిస్తున్నందున పలు భాషల వారు ఒక పాఠశాలలోని ఒక తరగతిలో ఉంటే ఏ భాషలో బోధించాలన్నది సమస్యవుతుందని విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్‌ చెప్పారు. ఏ భాషలో బోధించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులకు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని, ఇటీవల ఏపీలో ఆంగ్ల మాధ్యమం అన్నప్పుడు అదే విషయం చెప్పిందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు.

ప్రభుత్వ బడులకు ఊతం
విద్యా హక్కు చట్టం కిందికి 3-18 సంవత్సరాల వయసు వారిని తీసుకురావడంతో అది ప్రభుత్వ బడులకు ఊతంగా మారనుంది. శిశు తరగతులకు మూడేళ్లు కేటాయించడంతో ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో వాటిని ఏర్పాటుచేయనున్నారు. ఒక వేళ అంగన్‌ వాడీ కేంద్రాలున్నా వాటిని పాఠశాలల ప్రాంగణాల్లోకి మార్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఒక సిలబస్‌ లేకుండా నడుస్తున్న శిశు తరగతులు గాడినపడనున్నాయి. దీనివల్ల సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగనుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు శిశు తరగతులు లేకపోవడం ప్రభుత్వ బడులకు ఒక లోపంగా ఉందని వారు తెలిపారు.

డిగ్రీ కళాశాలలకు చిక్కే..
విశ్వవిద్యాలయాలు కాకుండా స్వయంప్రతిపత్తి కళాశాలలే ఉంటాయని చెబుతున్నందున తెలుగు రాష్ట్రాల్లో వందలాది ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలకు చిక్కులు రానున్నాయి. స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటే న్యాక్‌ గ్రేడ్‌ ఉండాలి. అది దక్కాలంటే సొంత ప్రాంగణం తప్పదు. ఏపీ, తెలంగాణలో 80 శాతానికిపైగా డిగ్రీ కళాశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఫలితంగా వందలాది కళాశాలలను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

Earlier till what grade it used to be there? When I did my Masters, I remember people used to come to universities directly from Telugu language and they got exposed to English for first time and were very vulnerable.

I feel all subjects should be taught in English with Telugu and Hindi as mandatory 2nd languages till 5th grade and later optional till 10th grade.

Increase to 6% gdp is a welcome move.

Link to comment
Share on other sites

4 minutes ago, HelloNTR said:

english medium should be encouraged with mandatory mother tongue as subject ... chinapudu sponge la untadi brain appatnunde english medium lo pedithe better

Bro mother tongue lo chadivithey subjects baga ekkutaayi idi nenu 100pc garuntee ga cheptha physics , chemistry etc., mother tongue lo chadivina vallaa ni check chesi chudu they are very sharp

Link to comment
Share on other sites

3 hours ago, Rajakeeyam said:

Earlier till what grade it used to be there? When I did my Masters, I remember people used to come to universities directly from Telugu language and they got exposed to English for first time and were very vulnerable.

I feel all subjects should be taught in English with Telugu and Hindi as mandatory 2nd languages till 5th grade and later optional till 10th grade.

Increase to 6% gdp is a welcome move.

After 6 years the education reforms are initiated, how do you justify the delay? As education and health are the fundamental rights of the Indians, what measures has been taken for the befit of the poor.

Aren't the poor suffering because they cant afford for private hospitals? What measures has been take to provide free health to every Indian? Kindly educate me.

Link to comment
Share on other sites

worst decision . it will take us back to stone age.  jagan applied common sense on this issue. every parent want their children to study in english medium. india should use english as medium of instruction in all schools. one subject can be added as secondary language like hindi or mother tongue or regional language based on student choice. 

english and hindi are official languages in india . communication between center and state happening in hindi and english. india has many languages. many people in india would prefer to learn english than hindi for better livelihood. english will unite india by easing communication among people in different states . english can help us in attracting foreign investment .

Link to comment
Share on other sites

4 hours ago, Rajakeeyam said:

At least in AP Telugu is mandatory until 10th, it can be either Hindi or Sanskrit. 
 
Telugu and English should Be made mandatory upto Bachelors. Hindi can be optional.

Link to comment
Share on other sites

4 hours ago, ChiefMinister said:

Bro mother tongue lo chadivithey subjects baga ekkutaayi idi nenu 100pc garuntee ga cheptha physics , chemistry etc., mother tongue lo chadivina vallaa ni check chesi chudu they are very sharp

I agree, students can relate well to their surroundings if they study the subject in mother tongue. This is especially true in Science. Anyways Science is an Universal language, so training the students in basic English will be useful for them. 

Link to comment
Share on other sites

1 hour ago, APDevFreak said:

After 6 years the education reforms are initiated, how do you justify the delay? As education and health are the fundamental rights of the Indians, what measures has been taken for the befit of the poor.

Aren't the poor suffering because they cant afford for private hospitals? What measures has been take to provide free health to every Indian? Kindly educate me.

NEP was in works from 2017

Ayushman Bharat, 5L coverage for poor Indians, they can go to any empowered hospital.

Link to comment
Share on other sites

English పెట్టాలి anukotam OK, but చెప్పే teachers ekkada, 90% batch ki English రాదు, inka చెప్పాలంటే English చెప్పే teachers చాలా mandike English మీద command vundadu govt Schools lo, you shd have proper plan to take it up, jus on fly English medium ante teachers suicide చేసుకుంటారు harassment ani.. Cbn's strategy of taking up things in phased manner is best one... అప్పుడు no అన్నారు ఈ ycp, ఇప్పుడు one shot lo English medium anta..... 

Link to comment
Share on other sites

3 hours ago, ravindras said:

worst decision . it will take us back to stone age.  jagan applied common sense on this issue. every parent want their children to study in english medium. india should use english as medium of instruction in all schools. one subject can be added as secondary language like hindi or mother tongue or regional language based on student choice. 

english and hindi are official languages in india . communication between center and state happening in hindi and english. india has many languages. many people in india would prefer to learn english than hindi for better livelihood. english will unite india by easing communication among people in different states . english can help us in attracting foreign investment .

Germany, china ,japan etc., countries will teach all subjects upto post graduation or even phds in their mother tounge ...foriegn investments akkada aagipoyayaa???

Ne mother tongue lo chadivi side ga english as a language for communication ga nerchukuntey chaalu...

Chinnapati nundi english medium chadivinaa gani GRE Toefel ki coaching teesukovalsindey....so just consider it as  a language anthey...

Inka India language between states antunnaru...assalu meeru europe lo english matlade vallu entha mando telusaa???

Link to comment
Share on other sites

Baffas started WhatsApp fwd messages with huge statements..... 

“with this our education system will be on par with modern countries.....”

arey mundu schools ki infrastructure improve cheyyandiraaa..... ohhh daaniki paisal release cheyyalsi vastundi kada..... hamaaraaaa baaat..... kaajag kaa baaath..... seeedah mannn sey! 

Link to comment
Share on other sites

జాతీయ నూతన విద్యా విధానం - 2020
📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒
జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2020, జులై 29 ఆమోదించింది. ఈ నూతన విద్యా విధానంలో విద్యార్థుల సమగ్ర వికాసానికే పెద్దపీట వేశారు. అదే సమయంలో భారమూ తగ్గించే ప్రయత్నం చేశారు. మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా మార్పులకు శ్రీకారం చుట్టారు.

జాతీయ విద్యా విధానాన్ని తొలుత 1968లో, తర్వాత 1986లో రూపొందించారు. దానికి 1992లో పరిమితంగా సవరణలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 1986 విధానమే 34 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. దాని స్థానంలో కొత్త విధానం రూపొందించడానికి మోదీ ప్రభుత్వం 2016 మే 27న టీఎస్‌ఆర్‌ సుబ్రహ్మణ్యం కమిటీ, 2019 మే 31న కె.కస్తూరిరంగన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కస్తూరిరంగన్‌ కమిటీ నివేదికను ఇప్పుడు ఆమోదించింది.

జాతీయ నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం... ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు. కొత్త విధానంలో విద్యను సరళతరంగా మార్చారు. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులను చదువుకొనే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం భారంగా మారిన పాఠ్యాంశాలను తగ్గించి, విద్యార్థులు తమలో అంతర్గతంగా దాగిన నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు అవసరమైన సమయాన్ని కేటాయించుకొనే అవకాశం ఇవ్వబోతున్నారు. పాఠశాల విద్య పూర్తిచేసుకొని బయటికెళ్లేనాటికి కనీసం ఒక వృత్తి విద్యా నైపుణ్యమైనా విద్యార్థి సాధించేలా మార్పులు చేస్తున్నారు. అయిదో తరగతి వరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని నిబంధన విధించారు. వీలైతే 8వ తరగతి వరకు కానీ, అంతకు మించిన తరగతుల వరకు కానీ మాతృభాషలోనే విద్యాబోధన చేయడం ఉత్తమమని ఈ కొత్త విధానంలో రాష్ట్రాలకు నిర్దేశించారు. ఇకమీదట మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యాశాఖగా మార్చడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ప్రత్యేకతలు...
* రెండేళ్ల తర్వాత డిగ్రీ మానేసినవారికి డిప్లొమా
* 4 ఏళ్ల డిగ్రీ కోర్సు చేస్తే నేరుగా పీహెచ్‌డీలోకి ప్రవేశం
* విద్యార్థులపై భారం తగ్గించడానికి సిలబస్‌లో కోత
* మధ్యలో చదువు మానేసినా మళ్లీ కొనసాగించుకొనే అవకాశం
* 6వ తరగతి నుంచే కోడింగ్‌..వృత్తి విద్యా కోర్సులు
* 12వ తరగతి వరకు కస్తూర్బా విద్యాలయాలు
* బోర్డు పరీక్షల ప్రాధాన్యం కుదింపు

సరికొత్త సంస్కరణలు

మానేసినా గుర్తింపు..
ఇప్పటిలాగా... గణితం ఎంచుకున్నవారు చరిత్రపై ఆసక్తి ఉంటే వదలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే... డిగ్రీలో ఓసారి చేరి, ఇష్టం లేకున్నా మూడేళ్ళు తప్పనిసరిగా అదే చదవాల్సిన అవసరమూ లేదు. తమకు ఇష్టం వచ్చిన కాంబినేషన్లలో సబ్జెక్ట్‌లు తీసుకోవచ్చు.... ఇష్టం వచ్చినప్పుడు ఆ కోర్సు నుంచి వైదొలగవచ్చు. అప్పటి వరకు గుర్తింపు ఇస్తారు. మళ్లీ కుదిరినప్పుడు కొనసాగించవచ్చు. పరిశోధన చేయాలనుకుంటే నాలుగో ఏడాది వరకు ఉండి చేయొచ్చు కూడా! అలా విద్యార్థికి వెసులుబాటు ఉండేలా సబ్జెక్ట్‌ల ఎంపికలో, కోర్సు గడువులో (3-4 ఏళ్ళు) మార్పులు తెచ్చారు. ఇంజినీరింగ్‌ వాళ్ళు ఆర్ట్స్‌ చదివేలా... ఆర్ట్స్‌ ఎంచుకున్నవాళ్ళు సైన్సూ చదివేలా ఏర్పాటు చేస్తారు.
* తొలి సంవత్సరం: సర్టిఫికెట్‌
* రెండో ఏడాది: అడ్వాన్స్‌ డిప్లమో
* మూడో ఏడాది: బ్యాచిలర్‌ డిగ్రీ
* నాలుగో ఏడాది: పరిశోధనతో కూడిన బ్యాచిలర్‌ డిగ్రీ ఇస్తారు.

టీచర్‌ కావాలంటే ఇక....
ఉపాధ్యాయ సామర్థ్యాలపై కొత్త విధానంలో ప్రత్యేక దృష్టిసారించారు. ఉపాధ్యాయుల నియామకాలను ఇకమీదట పారదర్శక-పటిష్ఠ పద్ధతిలో చేపడతారు.
* బోధన పట్ల నిబద్ధత, తపన ఉన్నవారు
* అకడమిక్‌గా, బోధనాపరంగా, పరిశోధనపరంగా, ప్రజాసేవ పట్ల అంకితభావాలను కూడా పరీక్షించి తీసుకుంటారు.
* వారి సామర్థ్యాల్ని మదించిన తర్వాతే... పదోన్నతులుంటాయి.
* ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రమాణాలను రూపొందిస్తారు.

ఎంబీబీఎస్, ఇంజినీరింగ్‌ మాతృభాషలో?
భారతీయ భాషలకు, మాతృభాషలకు కొత్త విద్యావిధానం పెద్దపీట వేస్తోంది. కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో కూడా మాతృభాష, భారతీయ భాషలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్, ఇంటర్‌ప్రెటేషన్‌ (ఐఐటీఐ), పాళి, పెర్షియన్, పాకృతం, సంస్కృతాలకు సంబంధించి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి... అన్ని ఉన్నతవిద్యా సంస్థల్లో వీటి విభాగాలుండేలా చూస్తారు. ఉన్నత విద్యలోని అనేక కోర్సులను మాతృభాషల్లో, స్థానిక భాషల్లో నిర్వహించేందుకు ప్రోత్సహిస్తారు.

ఏ భాషనూ రుద్ద కూడదు...
స్కూల్‌ నుంచి మొదలెడితే... ఉన్నత విద్య వరకు ప్రతిదశలోనూ సంస్కృతం ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంటుంది. మిగిలిన భాషలు కూడా తీసుకోవచ్చు. ఏ భాషనూ విద్యార్థిపై బలవంతంగా రుద్దరు. సెకండరీ స్థాయిలో విదేశీవిద్యల్ని కూడా పరిచయం చేస్తారు.

3, 5, 8 లోనే పరీక్షలు
3, 5, 8 తరగతుల్లోనే స్కూల్‌ పరీక్షలుంటాయి. అవి కూడా నిర్దేశిత బోర్డు ద్వారా నిర్వహిస్తారు. 10, 12 తరగతులకు యధావిధంగానే పరీక్షలుంటాయిగాని... వాటి తీరు మారుతుంది. విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా... వారి జ్ఞానాన్ని, విశ్లేషణలను ఇతరత్రా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందుకోసం పరాఖ్‌ (విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, విశ్లేషించే సంస్థ)ను ఏర్పాటు చేస్తున్నారు. ఆరో తరగతి తర్వాతి నుంచే వృత్తివిద్యలను అందరికీ పరిచయం చేస్తారు. అంటే 12వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరికీ ఏదైనా ఓ వృత్తివిద్యలో ప్రవేశం ఉంటుంది.

ఎంబీబీఎస్‌ చేస్తూ కోడింగూ...
ఇప్పటిదాకా వృత్తివిద్యా కోర్సులది పూర్తిగా ప్రత్యేక దారి. సాంకేతిక విద్య, లా, వ్యవసాయ విద్య, వైద్యం, ఆరోగ్యం... ఇలా వేటికవే విడివిడిగా సాగుతున్నాయి. వీటన్నింటినీ ఉన్నతవిద్యలో భాగం చేసి... మల్టీడిసిప్లినరీగా వెసులుబాటు కల్పిస్తారు. అంటే... ఎంబీబీఎస్‌ చేస్తూనే కావాలంటే కోడింగ్‌ కూడా నేర్చుకోవచ్చు.

నూతన విధానంలోని మార్పులు..

కొత్తగా 3 కోట్ల సీట్లు
2035 నాటికి ‘స్థూల నమోదు నిష్పత్తి’ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో)ని ఇప్పుడున్న 26.3% నుంచి 50%కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఉన్నత విద్యా సంస్థల్లో కొత్తగా 3 కోట్ల సీట్లు వస్తాయి.
* అన్ని కోర్సుల్లో హోలిస్టిక్, మల్టీ డిసిప్లినరీ విద్యా విధానాన్ని తీసుకొస్తారు. సబ్జెక్టులను సరళంగా మార్చనున్నారు.
* యూజీ కోర్సుల్లో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణ (మల్టిపుల్‌ ఎంట్రీ/ఎగ్జిట్‌) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడున్న విధానంలో 4 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆరు సెమిస్టర్ల తర్వాత చదువుకోలేని పరిస్థితి వస్తే పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఒక ఏడాది తర్వాత విద్యార్థి మానేస్తే సర్టిఫికెట్‌ ఇస్తారు. రెండేళ్ల తర్వాత మానేస్తే డిప్లొమా, 3-4 ఏళ్ల తర్వాత డిగ్రీ అందిస్తారు.
* ఉద్యోగాలకు వెళ్లాలనుకున్న వారికి మూడేళ్ల డిగ్రీ, పరిశోధన రంగం వైపు వెళ్లాలనుకున్నవారికి నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాం అమలు చేయనున్నారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి ఓ ఏడాది పీజీ కోర్సు ఉంటుంది. దాని తర్వాత ఎంఫిల్‌ చేయాల్సిన అవసరం లేకుండానే పీహెచ్‌డీకి వెళ్లొచ్చు. మాస్టర్స్‌తో కలిపి అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ అమలు చేస్తారు. ఎంఫిల్‌ను తొలగిస్తారు.

నిధుల పెంపుతో చేయూత
సాధ్యమైనంత త్వరగా జీడీపీలో 6% నిధులు విద్యారంగానికి కేటాయిస్తారు. ప్రస్తుతం - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 4.4% నిధులు ఇస్తున్నాయి.
* అమెరికాలో నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఉన్నట్లుగా దేశంలో నేషనల్‌ రీసెర్చి ఫౌండేషన్‌ ఏర్పాటు చేస్తారు. శాస్త్ర, సామాజిక శాస్త్రాల విభాగాల్లో చేపట్టే భారీ పరిశోధన కార్యక్రమాలకు దీని ద్వారా ఆర్థిక చేయూత అందిస్తారు. పరిశోధన, నవ్యావిష్కరణలు, పేటెంటింగ్‌లో ఈ ఫౌండేషన్‌ ద్వారా సాయం చేస్తారు.
* విద్యా రంగాన్ని అంతర్జాతీయీకరణ చేస్తారు. విదేశీ విద్యాసంస్థలు ఇక్కడ ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకొనేలా ప్రోత్సహిస్తారు.

తెలుగులోనూ ఇ-కంటెంట్‌
* ఇప్పటి వరకు ఇంగ్లిష్, హిందీలకే పరిమితమైన ఈ-కంటెంట్‌ను తెలుగుతోపాటు 8 భారతీయ భాషల్లో అభివృద్ధి చేసి అమల్లోకి తెస్తారు.
* అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో వర్చువల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తారు.
* విద్యా రంగంలో సాంకేతిక వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడానికి ప్రైవేటు, ప్రభుత్వ, సాంకేతిక రంగాన్ని ఒకే వేదిక మీదికి తెస్తూ ‘నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఫోరం’ ఏర్పాటు చేస్తారు.

పాఠశాల విద్యా విధానంలో...
పూర్వ ప్రాథమిక విద్యను (ప్రీ ప్రైమరీ) సార్వత్రీకరిస్తారు. దీనికి సంబంధించిన పాఠ్యాంశాలను ఎన్‌సీఈఆర్‌టీ అభివృద్ధి చేస్తుంది. 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు ఆటలు, కార్యకలాపాల ఆధారమైన సరళ పాఠ్యాంశాలను అమల్లోకి తెస్తారు.
* 1 నుంచి 3 తరగతులు చదివే 6-9 ఏళ్ల విద్యార్థులు ప్రాథమికమైన అక్షరాలు, అంకెలు సరిగా గుర్తుపట్టి చదివేలా, లెక్కలు చేసేలా తీర్చిదిద్దేందుకు ఒక నేషనల్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక దశలో విద్యార్థులు నిర్దేశిత పాఠ్యాంశాలను సరిగా నేర్చుకొనేలా తీర్చిదిద్దడమే ఈ మిషన్‌ ప్రధాన ఉద్దేశం.
* బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇప్పుడున్న 8, 10 తరగతుల నుంచి 12వ తరగతి వరకు పెంచుతారు.
* ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గించనున్నారు. ఏటా ఒకసారి కాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్ట్‌లో విద్యార్థులకు రెండు స్థాయిలు ఉంటాయి. బట్టీ పట్టే సామర్థ్యాన్ని కాకుండా వారిలోని తెలివితేటలను పరీక్షించేలా వీటిని తీర్చిదిద్దుతారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేలా వాటిని నిర్వహిస్తారు.

పురోగతి నివేదికలూ మారిపోతాయి
విద్యార్థుల పురోగతి నివేదిక (ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌)లో మార్పులు తెస్తారు. ఇప్పటివరకు విద్యార్థి మార్కులతోపాటు, వారి ప్రవర్తన గురించి టీచర్లు రాసే అభిప్రాయాలు మాత్రమే అందులో ఉంటున్నాయి. ఇకమీదట విద్యార్థి స్వీయ అభిప్రాయంతోపాటు, వారి సహాధ్యాయి, టీచర్ల అభిప్రాయాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఏటా విద్యార్థులు నేర్చుకోవాల్సిన జీవన నైపుణ్యాల (లైఫ్‌స్కిల్స్‌) గురించి తల్లిదండ్రులతో మాట్లాడి నివేదిక రూపొందిస్తారు. 12వ తరగతి ముగించుకొని బయటికెళ్లే సమయానికి వారు ఏయే నైపుణ్యాలు నేర్చుకున్నారన్నది దానిలో నిక్షిప్తం చేస్తారు.

ఏ భాషనూ బలవంతంగా రుద్దవద్దు
త్రిభాషా సూత్రంతో సహా అన్ని స్థాయి తరగతుల్లో సంస్కృతం ఉండేలా చూడాలని, దాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలిపెట్టాలని కొత్త విధానం స్పష్టం చేసింది. ఇతర భారతీయ ప్రాచీన భాషలను ఎంచుకొనే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పించాలని పేర్కొంది. విద్యార్థులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దొద్దని స్పష్టం చేసింది. భారతీయ భాషలను విద్యార్థులు చాలా ఆనందంగా నేర్చుకొనే వాతావరణాన్ని కల్పించాలని పేర్కొంది. పలు విదేశీ భాషలు నేర్చుకోవడానికీ వీలు కల్పించాలని సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా ఇండియన్‌ సైన్‌ లాగ్వేంజ్‌ను ప్రామాణీకరించాలని పేర్కొంది. బధిర పిల్లల కోసం జాతీయ, రాష్ట్రస్థాయిల్లో పాఠ్యాంశాలు అభివృద్ధి చేయాలంది. భారతీయ భాషల సంరక్షణతోపాటు, వాటి వినియోగాన్ని పెంచి, వాటికి గతిశీలతను తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్లు నూతన విద్యా విధానం పేర్కొంది.

మరిన్ని అంశాలు

10+2+3 బదులు 5+3+3+4
పాఠ్యక్రమాల నిర్మాణాన్ని పూర్తిగా మారుస్తున్నారు. ప్రస్తుతం 10+2+3 విధానం ఉంది. పదోతరగతి వరకు విద్యార్థులకు దశలవారీ పాఠ్యాంశాలు ఉంటాయి. ప్లస్‌టూకి వెళ్లినవారికి ప్రత్యేక సబ్జెక్ట్‌లు వస్తాయి. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి 5+3+3+4 ఏళ్ల పాఠ్యక్రమ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో 3 నుంచి 6 ఏళ్లవరకు పిల్లలకు ప్లేస్కూల్‌ ఉంటుంది. వారికి ఎనిమిదేళ్లు వచ్చేంతవరకూ ఆటలు, ఇతర కార్యకలాపాలు, అనుభవ పూర్వకంగా నేర్చుకోవడం వంటివి ఉంటాయి. 3 నుంచి 8 ఏళ్ల లోపు వారు ఫౌండేషన్‌ స్టేజిలో, 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు ప్రిపరేటరీ స్కూలింగ్‌లో, 11-14 ఏళ్ల వారు మిడిల్‌ స్కూల్‌లో, 14-18 ఏళ్లవారు సెకెండరీ స్థాయిలో ఉంటారు. 6 నుంచి 8 తరగతుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఏ కూర్పులోనైనా సబెక్టులు తీసుకోవచ్చు. అంటే ఫిజిక్స్‌తో పాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కానీ, ఆహార తయారీ కోర్సులు కానీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు కానీ ఎంచుకోవచ్చు. విద్యాహక్కును 1 నుంచి 8వ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రీ స్కూల్‌ నుంచి 12వ తరగతి వరకు విస్తరింపజేస్తారు.

డిజిటల్‌ లాకర్లలో పాత క్రెడిట్లు
ఒకటి రెండు సంవత్సరాలు చదివిన తర్వాత విద్యార్థులు ఏదైనా కారణాలతో చదువు మానేసినా, మళ్లీ తనకు వీలైన సమయంలో దానికి కొనసాగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అప్పటివరకు ఆ విద్యార్థి చదివిన ఒకటి, రెండు సంవత్సరాలకు సంబంధించిన క్రెడిట్స్‌.. డిజిటల్‌ లాకర్స్‌లో భద్రంగా ఉంటాయి. విద్యార్థి మళ్లీ తొలి సంవత్సరం నుంచి చదవాల్సిన అవసరం లేదు. అప్పటివరకు తన డిజిటల్‌ లాకర్‌లో ఉన్న క్రెడిట్స్‌ను ఉపయోగించుకొని మిగిలిన సంవత్సరాలు పూర్తిచేయొచ్చు.ప్రాథమిక స్థాయి నుంచే సైన్స్‌పై ఆసక్తి
సైన్స్, లెక్కలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే వారిని ప్రోత్సహిస్తారు. 6వ తరగతి నుంచి విద్యార్థులకు కోడింగ్‌ నేర్పిస్తారు. ప్రస్తుతం విద్యార్థులు సంగీతం, కళలు, ఆటలు, ఇతర ఆసక్తికర అంశాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల సైన్స్‌పై ఆసక్తి, సమస్యలను పరిష్కరించే తత్వం, సంక్లిష్టమైన ఆలోచనా విధానం వారిలో తగ్గిపోతోంది. దీని దృష్ట్యా- ఇప్పుడున్న పాఠ్యాంశాలను అత్యవసర అంశాల వరకే పరిమితం చేసి మిగతా వాటిని తగ్గిస్తారు. వృత్తి విద్యా కోర్సులను 6వ తరగతినుంచే ప్రారంభిస్తారు. ఇందులో ఇంటర్న్‌షిప్‌ సైతం ఉంటుంది

యూజీసీ, ఏఐసీటీఈ ఉండవు
ప్రస్తుతం విద్యావ్యవస్థ నియంత్రణ కోసం యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వంటి వ్యవస్థలున్నాయి. వీటన్నింటినీ విలీనం చేసి మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
* అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే నిబంధనలు అమలుచేస్తారు.

సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఒక్కటే పరీక్ష
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా పరీక్షలు జరుపుతున్నాయి. ఉమ్మడి పరీక్ష వల్ల విద్యార్థులకు పలు పరీక్షలకు హాజరయ్యే భారం తగ్గుతుందన్నది కేంద్రం ఆలోచన. అయితే ఇది తప్పనిసరి కాదని, ఐచ్ఛికమన్నారు. ఆ పరీక్షలో వచ్చిన స్కోర్‌తో ప్రవేశాలు ఇచ్చుకోవడం ఆయా విద్యాసంస్థల ఇష్టమని కేంద్రం తెలిపింది.

గుర్తింపు ఆధారంగా స్వయం ప్రతిపత్తి
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల కింద 45వేల అనుబంధ కళాశాలలు ఉన్నాయి. వాటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంవల్ల విద్యా ప్రమాణాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇకమీదట వీటికున్న అక్రిడిటేషన్‌ ఆధారంగా విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తారు. ఏ+, ఏ, బి గ్రేడ్‌లున్న విద్యాసంస్థలకు విభిన్నమైన ఆర్థిక, విద్యాపరమైన స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇప్పుడున్న అనుబంధ విధానాన్ని 15 ఏళ్లలో పూర్తిగా రద్దు చేస్తారు.
* విద్యార్థులు, అధ్యాపకులకు మార్గనిర్దేశం చేయడానికి ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ మెంటారింగ్‌’ ఏర్పాటు చేస్తారు.

ప్రభావం

పాఠశాల విద్యలోకి ఇంటర్‌
జాతీయ నూతన విద్యావిధానం అమలులోకి వస్తే తెలుగురాష్ట్రాలపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 12వ తరగతి వరకు పాఠశాల విద్యలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో ఉన్నతవిద్య పరిధిలో ఉన్న ఇంటర్మీడియట్‌ బోర్డులు పాఠశాల విద్య కిందికి రానున్నాయి. ఫలితంగా జూనియర్‌ కళాశాలలు ఇక నుంచి అవే పేరుతో పనిచేస్తాయా? వాటిని కూడా పాఠశాలలుగా మారుస్తారా అనే చర్చ సాగుతోంది. కళాశాలల్లోనే కింది తరగతులను కూడా ప్రారంభించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్య నిర్మాణం 5+3+3+4 లాగా మార్చినా ఒక్కో దశకు ఒక్కో పాఠశాల ఏర్పాటు చేయరని చెప్పారు. పాఠశాల విద్య పరిధిలోకి వచ్చినా ఇంటర్‌బోర్డు మనుగడలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

పలు భాషల వారుంటే ఎలా?
అయిదో తరగతి వరకు మాతృభాషలో బోధన ఉండాలని కేంద్రం నిర్ణయించగా దాన్ని అమలు చేయడంలో సమస్యలు తప్పవని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో పలు రాష్ట్రాల వారు నివసిస్తున్నందున పలు భాషల వారు ఒక పాఠశాలలోని ఒక తరగతిలో ఉంటే ఏ భాషలో బోధించాలన్నది సమస్యవుతుందని విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్‌ చెప్పారు. ఏ భాషలో బోధించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులకు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని, ఇటీవల ఏపీలో ఆంగ్ల మాధ్యమం అన్నప్పుడు అదే విషయం చెప్పిందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు.

ప్రభుత్వ బడులకు ఊతం
విద్యా హక్కు చట్టం కిందికి 3-18 సంవత్సరాల వయసు వారిని తీసుకురావడంతో అది ప్రభుత్వ బడులకు ఊతంగా మారనుంది. శిశు తరగతులకు మూడేళ్లు కేటాయించడంతో ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో వాటిని ఏర్పాటుచేయనున్నారు. ఒక వేళ అంగన్‌ వాడీ కేంద్రాలున్నా వాటిని పాఠశాలల ప్రాంగణాల్లోకి మార్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఒక సిలబస్‌ లేకుండా నడుస్తున్న శిశు తరగతులు గాడినపడనున్నాయి. దీనివల్ల సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగనుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు శిశు తరగతులు లేకపోవడం ప్రభుత్వ బడులకు ఒక లోపంగా ఉందని వారు తెలిపారు.

డిగ్రీ కళాశాలలకు చిక్కే..
విశ్వవిద్యాలయాలు కాకుండా స్వయంప్రతిపత్తి కళాశాలలే ఉంటాయని చెబుతున్నందున తెలుగు రాష్ట్రాల్లో వందలాది ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలకు చిక్కులు రానున్నాయి. స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటే న్యాక్‌ గ్రేడ్‌ ఉండాలి. అది దక్కాలంటే సొంత ప్రాంగణం తప్పదు. ఏపీ, తెలంగాణలో 80 శాతానికిపైగా డిగ్రీ కళాశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఫలితంగా వందలాది కళాశాలలను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

చెన్నై: కేంద్ర కేబినెట్ ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. త్రిభాషా విధానాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధాకరమని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ నూతన విధానాన్ని రాష్ట్రంలో అమలుచేయమని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...