Jump to content

ప్రకాశం జిల్లాలో 27వేల నమూనాల వృథా..


KING007

Recommended Posts

ప్రకాశం జిల్లాలో 27వేల నమూనాల వృథా

ప్రకాశం జిల్లాలో 27వేల నమూనాల వృథా

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వైరస్‌ అనుమానితుల నుంచి సేకరించిన 27వేల నమూనాలు, కిట్లు వృథా అయ్యాయని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అనుమానిత లక్షణాలున్న వారి నుంచి నమూనాల సేకరణలో క్షేత్ర స్థాయిలో పొరపాట్లు దొర్లుతున్నాయి. సేకరించిన వాటికి ఐడీ నంబర్లు వేయడం లేదు. మూత లేకుండానే కొన్నింటిని ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. టెస్టింగ్‌ కేంద్రాల్లో నమూనాలు పక్కన పెడుతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యంవల్ల ల్యాబ్‌ సిబ్బంది ఒకరు మరణించారు’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఒంగోలు, పొదిలిలలో అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ప్రకటనలు విడుదల చేశారు.

జిల్లాలలోనూ ఇదే పరిస్థితి..
ప్రకాశం మాదిరిగానే పలు జిల్లాల్లోనూ నమూనాలు పరీక్షలకు నోచుకోవడం లేదు. సిబ్బంది నిర్లక్ష్యంపర్యవేక్షణ లోపంవల్ల ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. శనివారం ఉదయం వరకు రాష్ట్రంలో 11,36,225 మంది నుంచి నమూనాలను సేకరించారు. ప్రకాశం జిల్లాలో 27వేల నమూనాల వృథాను పరిగణనలోకి తీసుకుని జిల్లాలవారీగా విశ్లేషిస్తే మరిన్ని లొసుగులు బయటపడే అవకాశాలున్నాయి. సుమారు పది జిల్లాలలో ఒక్కోచోట 4 నుంచి 5వేల వరకు నమూనాలను పరీక్షించకుండానే వదిలేశారన్న విమర్శలున్నాయి. ఒక్కొక్క నిర్ధారణ పరీక్షకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 వరకు వెచ్చిస్తోంది. సేకరించిన నమూనాలు నిర్ణీత వ్యవధిలో ల్యాబ్‌లకు వెళ్తున్నాయా? వివరాల నమోదు సక్రమంగా ఉందా? సకాలంలో ఫలితాలు వస్తున్నాయా? తదితర అంశాలపై పర్యవేక్షణ కొరవడుతోంది. వైద్య సిబ్బంది నమూనా తీసే సమయంలో బాధితులు కొందరు భయపడుతున్నారు. దీనివల్ల పరీక్షకు వీలుగా నమూనాలు చాలడం లేదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...