Jump to content

పీఎం కేర్స్‌’కు భారీగా చైనా విరాళాలు..


KING007

Recommended Posts

‘పీఎం కేర్స్‌’కు భారీగా చైనా విరాళాలు

Jun 29 2020 @ 01:40AMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png
06292020085019n34.jpg

 

  • సరిహద్దు వివాదం నడుస్తుంటే ఎందుకు అంగీకరించారు?
  • ఆ నిధులను ఎటు మళ్లిస్తున్నారు?: కాంగ్రెస్‌
  •  

న్యూఢిల్లీ, జూన్‌ 28: ఈ ఏడాది మార్చిలో ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన ‘పీఎం కేర్స్‌’ నిధికి చైనా సంస్థల నుంచి భారీగా నిధులు వచ్చాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఓవైపు సరిహద్దుల్లో చైనాతో వివాదం నడుస్తుంటే.. చైనా సంస్థల నుంచి విరాళాలను ఎందుకు అంగీకరిస్తున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిసేక్‌ సింఘ్వీ వర్చువల్‌ సమావేశంలో విలేకరులతో మాట్లాడారు.

 

‘‘గడచిన ఆరేళ్లలో చైనా అధ్యక్షుడితో భారత ప్రధాని నరేంద్ర మోదీ 18సార్లు సమావేశమయ్యారు. ఆందోళన కలిగించే అంశమేమిటంటే.. ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటున్న పీఎం కేర్స్‌ నిధికి, చైనా నుంచి రూ. వందల కోట్ల విరాళాలు వచ్చా యి. గత నెల 20 నాటికి పీఎం కేర్స్‌లో రూ. 9678 కోట్ల నిధులుండగా.. హువావే నుంచి రూ. 7కోట్లు, టిక్‌టాక్‌ నుంచి రూ. 30 కోట్లు, పేటీఎం నుంచి రూ. 100కోట్లు, షామీ నుంచి రూ. 15కోట్లు, ఒప్పో నుంచి రూ.కోటి వచ్చాయి. ఓవైపు చైనా దళాలు మన భూభాగాల్ని ఆక్రమిస్తుంటే.. మరోవైపు ప్రధాని ఆ దేశ సంస్థల నుంచి నిధుల్ని తీసుకోవడం బాధాకరం. తన పదవిని దుర్వినియోగపరిచి, ఆ విరాళాలను అంగీకరించిన మోదీ, దేశాన్ని చైనా దురాక్రమణ నుంచి ఎలా రక్షిస్తారు..? అసలు ఆ దేశాన్ని దురాక్రమణదారుగా ఆయన ఎందుకు ప్రకటించడం లేదు? 2007 నుంచీ బీజేపీకి చైనా కమ్యూనిస్టు పార్టీతో(సీపీసీ) సంబంధాలున్నాయి. గత 13ఏళ్లలో ఆ పార్టీ అధ్యక్షులు చైనాతో సంబంధాలు నెరపినంతగా, భారతదేశ చరిత్రలోని ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు నెరపలేదు. 2007 జనవరి, 2008 అక్టోబరుల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌, 2011 జనవరిలో గడ్కరీ, 2014లో అమిత్‌ షా సీపీసీతో సంప్రదింపులు జరిపారు. ఆ పార్టీకి(బీజేపీ) దేశ భద్రత గురించి లెక్కలేదు. అయితే తమ గురించి లేదా రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు.

 

పీఎం కేర్స్‌ నుంచి నిధులు భారీగా దారి మళ్లుతున్నాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలీదు. కాగ్‌తో సహా ఏ ప్రభుత్వ సంస్థ కూడా దాన్ని విచారించేందుకు లేదు. మోదీ సొంతంగా నడుపుతున్న నిధిలా పీఎం కేర్స్‌ వ్యవస్థ నడుస్తోంది. ఈ ఆరోపణలిన్నింటికీ మోదీ సమాధానం చెప్పగలరా?’’ అని సింఘ్వీ నిలదీశారు. 

Link to comment
Share on other sites

4 minutes ago, Raaz@NBK said:

BJP vallu okasari Opposition lo kurchondi.. Bokkalu anni kanapadakapothe appudu adagandi.. Ee private ga ayithe proofs sampadinchalera endhi.. 

Cong vallaki power or opposition renditlo kanapadathai :laughing:

private enti proofs enti em matladuthunna asala background thelusa or as usual....:doh:

Link to comment
Share on other sites

Just now, Rajakeeyam said:

Cong vallaki power or opposition renditlo kanapadathai :laughing:

private enti proofs enti em matladuthunna asala background thelusa or as usual....

Meku teliyakapoina telisinatte vuntaru ga.. 

BJP vallu power lo vunte ememi cheyocha cbupinchaaru.. Congress vallu power loki vasthe meru BJP chesina dhaniki double chesi chupisthaaru.. INC valani chala takkuva anchana vesthunnaru.. Okasari power loki vasthe thaata teesi vodhulutaru BJP vallani.. 

Link to comment
Share on other sites

11 hours ago, Raaz@NBK said:

Meku teliyakapoina telisinatte vuntaru ga.. 

BJP vallu power lo vunte ememi cheyocha cbupinchaaru.. Congress vallu power loki vasthe meru BJP chesina dhaniki double chesi chupisthaaru.. INC valani chala takkuva anchana vesthunnaru.. Okasari power loki vasthe thaata teesi vodhulutaru BJP vallani.. 

As usual kuyyooooo morroooooo ani arustaaaru..... empty gas cylinders, petrol bottles partukoni chow-Rasta lo dharnaa lu chestaaaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...