Jump to content

Raghurama raju reply


rajanani

Recommended Posts

14 minutes ago, OneAndOnlyMKC said:

3rd line nundi pichodu chadivithe for suopose... Ardam kaaka padipotaadu

Pichodiki 1st line ey ardam కాదు... Next lines chadavatam అనే సమస్యే లేదు... 

Link to comment
Share on other sites

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ.. షోకాజ్ నోటీసు పంపిన విజయసాయిరెడ్డికి రివర్స్‌లో ప్రశ్నల వర్షం కురిపిస్తూ..లేఖ పంపారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. పది రోజులుగా పార్టీని..పార్టీ అధినేతను.. పార్టీ ఎమ్మెల్యేలను కించ పరిచే విధంగా మాట్లాడుతున్నారని.. వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని లేకపోతే.. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి ఒక్కరోజులోనే స్పందిస్తానని చెప్పిన నర్సాపురం ఎంపీ… అదే వేగంగా విజయసాయిరెడ్డికి లేఖ పంపారు. అయితే.. నేను కాదు మీరే సమాధానం చెప్పాలని రివర్స్‌లో షోకాజ్ నోటీసుపంపినట్లుగా మ్యాటర్ ఉంది. నోటీసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరు ఎలా ఉంటుందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ పేరు మీద గెలిచానని.. దానికి బదులుగా.. మరో పార్టీ పేరుతో షోకాజ్‌ నోటీసు ఎలా ఇస్తారని లేఖలో రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. అదే సమయంలో…తనను తాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి .. జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని రిప్లయ్‌లో రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికపైనా…నర్సాపురం ఎంపీ తనదైన శైలిలో ప్రశ్నలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో అసలు క్రమశిక్షణ సంఘం ఉందా? .. ఉంటే క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా? .. క్రమశిక్షణ సంఘానికి చైర్మన్‌, సభ్యులు ఎవరు..? .. విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా… రఘురామకృష్ణంరాజు వ్యవహారం చూస్తే.. పార్టీపై కావాలని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగానే ఉందని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. షోకాజ్ నోటీసుల పేరుతో.. ఆయనను మరింత రెచ్చగొడితే.. డ్యామేజ్ అయ్యేలానే సమాధానం ఇస్తారని.. ఏ కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికైనా అర్థం అవుతుందంటున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి రఘురామకృష్ణంరాజు ఇచ్చిన సమాధానం మొత్తానికే పార్టీని నవ్వుల పాలు చేస్తుందని అంటున్నారు. 

Link to comment
Share on other sites

ఛీ ఛీ .. మేము అధికారంలో లేనప్పుడు ఒకరిద్దరు గోలచేశారేమో  గానీ .. అధికారంలో ఉన్నప్పుడు ఇట్టాటి చీదర ఐతే లేదయ్యా .. 

అయినా .. బొచ్చులో నాయకత్వం అని ఎందుకన్నావ్ అని నోటీసివ్వటమేందో .. 

అదసలు బొచ్చులొ నోటీస్  .. అది బొచ్చులో నోటీస్  అవునో కాదో చెప్పకపోతే చర్యలు తీసుకుంటానని తిరిగనటం ఏందో ..

 

-Lifted from FB

Link to comment
Share on other sites

If you guys remember - 2019 lo RRR meeda IT raids jarigaayi..... ah tarvathane YCP lo join ayyadu.... don’t blindly think BJP is behind his rebellion. Asalu RRR ni balavantamga YCP loki join chesindhi BJP eh (pressure through IT raids). He financially helped all the MLA seats under him. 
 

this is the background.... only time will reveal the end tunnel!

Link to comment
Share on other sites

పార్టీ సభ్యుడికి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ పోతుందా? 

ఎన్నికల సంఘం అధికారులకు ఎంపీ ప్రశ్న

దిల్లీ: ఎన్నికల సంఘం అధికారులతో నరసాపురం ఎంపీ రఘ రామకృష్ణ రాజు భేటీ ముగిసింది. సుమారు గంటన్నరపాటు అధికారులతో ఆయన మాట్లాడారు. వైకాపా క్రమశిక్షణ కమిటీ, దాని సభ్యులు ఎవరో నియమ నిబంధనల్లో చెప్పారా? ఉంటే వాటి వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం సెక్రెటరీ జనరల్, డైరెక్టర్ జనరల్‌ను ఎంపీ కోరారు. పార్టీ సభ్యుడికి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ పోతుందా... అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా కేసు తొలిసారి చూస్తున్నట్లు ఎంపీతో ఎన్నికల సంఘం అధికారులు అన్నట్లు తెలుస్తోంది. ఎంపీ కోరిన సమాచారం సోమవారం లేదా మంగళవారం నాడు ఇస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. దీంతో రఘు రామకృష్ణ రాజు సోమవారం మరోసారి ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారని సమాచారం.

Link to comment
Share on other sites

రాజ్‌నాథ్‌సింగ్‌తో రఘురామకృష్ణరాజు భేటీ 

దిల్లీ: వైకాపా షోకాజ్‌ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆపార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ఈసీని కలిసిన రఘురామకృష్ణరాజు శనివారం ఉదయం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో శరద్‌యాదవ్‌ తరహాలో రఘురామకృష్ణరాజుపై సస్పెన్షన్‌ వేటే వేస్తారని, పార్లమెంట్‌లో కూడా నిర్ణయం తీసుకునేలా చర్యలు ఉంటాయని వైకాపా నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన.. రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...