Jump to content

Target lokesh


Recommended Posts

*_లోకేష్ టార్గెట్ గా జగన్ వ్యూహం_*
◆ అచ్చెన్నాయుడు అరెస్ట్
◆ పితాని నెక్స్ట్
(అనంచిన్ని వెంకటేశ్వరరావు)

*_తొలుత తెలంగాణలో  బట్టబయలు చేసిన ఈఎస్ఐ మందుల కుంభకోణం తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించింది. ఇతెలంగాణ తరహాలో ఏపీలోనూ జరిగిందనే కోణంలో పలు కథనాలను అందించింది. అయితే ప్రస్తుతం అరెస్ట్ అయినది అచ్చెన్నాయుడు మాత్రమే. తర్వాత ఇదే కార్మికశాఖ బాధ్యతలు చూసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అరెస్ట్ కు సంబంధించిన వ్యవహారాలపై జగనన్న ప్రభుత్వం 'పక్కా స్కెచ్'తో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. సంచలన పరిశోధన కథనం._*

రూ.155 కోట్లకు....:
తెలంగాణలో జరిగిన ఇదే తరహా కుంభకోణం ఓస్థాయిలో 'బ్లాస్ట్' అయింది. ఏపీలో మరింత పెద్ద స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు విజిలెన్స్ నిర్ధారించింది… దాదాపు రూ.155 కోట్ల స్కాంగా తేల్చడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది.

*9 అంశాల్లో అక్రమాలు:*
ఈ కుంభకోణంలో.. తప్పుడు కొటేషన్లు, మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్ కొనుగోళ్లు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోళ్లు, ఫర్నీచర్, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు, టోల్ ఫ్రీ- ఈసీజీ సర్వీసులు (టెలిహెల్త్), సీవరేజ్ ట్రీట్‌మెంట్, బయోమెట్రిక్ పరికరాల కొనుగోళ్లు వంటి ..మొత్తం 9 అంశాల్లో అక్రమాలు జరిగాయి. దేనికి ఎవరు బాధ్యులో కూడా విజిలెన్స్ ఇంతకుముందే వెల్లడించింది.

*అచ్చెన్నాయుడు ఏం చేశాడు?:*
నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఖరారు చేయించడం, టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్లు ఇప్పించడం, ఉనికిలో లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు, రేట్ కాంట్రాక్టు లేని కంపెనీలకు రూ.51 కోట్లు చెల్లింపు వంటివి ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు. ఇందుకు ఆయన సిఫార్సు లెటర్ (ఎల్. ఆర్ నెం.1198/ఎం(ఎల్ఎఫ్ఎఫ్, వైఎస్ 5/ 2016, తేదీ: 25 11.2016) నాడు ఇచ్చారు. ఇదే ఆయన మెడకు చుట్టుకుంది.

*పితానీ కూడా ఇచ్చాడు:*
అచ్చెన్నాయుడు ఇచ్చినట్లుగానే
మాజీ మంత్రి, కార్మికశాఖను నిర్వహించిన పితాని సత్యనారాయణ కూడా (నోట్. నెం.18/ఎం(ఎల్ఇటి ఎఫ్/ 2018, తేదీ:09.02.2018) ఓ సిఫార్సు లెటర్ ఇచ్చారు.

*లోకేష్ ను ఎలా ఇరికించ బోతున్నారు..?:*
గతంలో ఓసారి ప్రభుత్వమే బ్లాక్ లిస్టులో పెట్టిన హరిప్రసాద్ కంపెనీకి 333 కోట్ల ఫైబర్ గ్రిడ్ కంట్రాక్టు (ప్రభుత్వ సాయంతో ఏపీ ప్రజలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ ఇచ్చే ప్రాజెక్టు) విషయాన్ని జగన్ ప్రభుత్వం ఇప్పటికే తవ్వింది. ఈ కంపెనీకి అసలు ఆ కాంట్రాక్టు ఎలా ఇచ్చారు..? అంతే కాదు, ప్రభుత్వ ఐటీ కంట్రాక్టుల ఎవాల్యూయేషన్ కమిటీలో ఆ వ్యక్తికి ఎలా స్థానం ఇచ్చారు..? చంద్రబాబు కుటుంబసంస్థ హెరిటేజ్‌ లోనూ, ఈ హరిప్రసాద్ కంపెనీలోనూ ఒక డైరెక్టర్ సేమ్…’’ అని బాబు హయాంలో జగన్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘నో, నో, హరిప్రసాద్ సేవాభావం ఉన్నవాడు, జాతీయ ప్రయోజనాల కోసం త్యాగాలు చేశాడు’ అంటూ చంద్రబాబు గుడ్డిగా ఎదురుదాడితో తనను సమర్థించుకున్నారు.

*ఎలా ఇచ్చారబ్బా..?:*
హరిప్రసాద్ కంపెనీ 'టెరాసాఫ్ట్‌'కు ఎల్1, ఎల్2లను కాదని, పౌరసరఫరాల ఈ-పాస్ యంత్రాల సప్లయ్ కంట్రాక్టు ఇస్తే, అవి సరఫరా చేయకపోవడంతో అప్పట్లో దీన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది ప్రభుత్వమే. మళ్లీ తనే ఏపీ ప్రభుత్వ ఐటీ వ్యవహారాల కీలకసభ్యుడు అయ్యాడు. రియల్ టైం గవర్నెన్స్, ఏపీ టవర్స్, ఏపీ సైబర్… ఇలా అన్నింటికీ ఆయన సలహాదారు. ఇప్పుడు మళ్లీ ఆయన తెరపైకి వచ్చాడు. భలే వెరైటీ ట్విస్ట్.

*రూ.333 కోట్ల ఫైబర్ గ్రిడ్ కంట్రాక్టు..:*
సదరు కంపెనీ అనేక అవకతవకలకు పాల్పడిన నివేదికలు జగన్ ప్రభుత్వం వద్ద సిద్దంగా ఉన్నాయి. అయితే ఎప్పుడు..? మరి ఇటీవల వరస దెబ్బలు తింటున్న జగనన్న.. ఒకవేళ సీబీఐ గనుక సీరియస్‌గా తవ్వితే..ఏయే ఫైళ్లపై లోకేష్ సంతకాలు చేశాడో కూడా బయటికొస్తుంది. తనను బాధ్యుడిగా సీబీఐ ఫిక్స్ చేస్తుందా..? లేదా..? చూడాలి. కానీ చంద్రబాబుతో పాటు లోకేష్‌ ను కూడా ఫిక్స్ చేసేలా జగన్ విసిరిన అస్త్రమే ఇప్పుడు చర్చనీయాంశం..!!  ఏ విధంగా లోకేష్ ను జగన్ ఎలా ఇరుకున పెడతాడో వేచిచూద్దాం.

Link to comment
Share on other sites

Ooorukondi swamy target ledu vankai ledu

Vadu pettina cases ki easy ga bail vachesthai and enthalaaa irikinchadaniki try chesinaa aaa case lu Court lo nilabadavu 

Judges pichi vallu kadu vidu andarini anavasaram gas irikisthuu pothuntee chusthu oorukovadaniki case lo proofs undali kada

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...