Jump to content

Guntur fights against Redzone....


Recommended Posts

గుంటూరులో రెడ్ జోన్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు
Webdunia

గుంటూరు నగరంలో రెడ్ జోన్ పేరుతొ కొనసాగుతున్న గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కుతున్నారు . శ్రీనివాసరావుతోట ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయన్న కారణంగా రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చి ప్రాంతమంతా మూసేసారు.
అన్ని రహాదారులు మూసేసి ఒక్క ఎంట్రన్సు పెట్టి పెద్ద ఎత్తున పోలీసుల కాపలాను పెట్టారు. కంటోన్మెంట్ ఏరియా ప్రకటించిన ప్రాంతాన్ని ఒక నిర్ణిత రోజుల వరకు ఉంచి మూసేసిన దారులను తెరవడం సహజంగా జరుగుతుంది. అయితే గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోట, అనందపేట, గుంటూరు వారితోట ప్రాంతాల్ని మినహాయించి ఇతర ప్రాంతాలను వదిలేసారు.
అప్పటినుంచి నిర్బధంల్ మగ్గుతున్న శ్రీనివాసరావుతోట ప్రాంతప్రజలు ఓపిక పడుతూవచ్చారు . ఎవరికీ విన్నవించుకున్నా ఫలితము చేకూరలేదు. స్థానికంగా కొందరు జిల్లా పోలీసు ఉన్నతాధికారిని కలిసి తమ ఇబ్బందులను చెప్పుకున్నారు.
సదరు అధికారి వారి ఆవేదనను పట్టించుకోకుండా నిర్బంధం వచ్చేనెల చివరిదాకా కొనసాగుతుందని చెప్పారంటున్నారు. చిన్నా చితక కూలీ పనులు చేసుకుని బతికే స్థానికులు ఎన్నాళ్ళు బతుకుదెరువు లేకుండా ఇళ్లల్లో పస్తులుంటామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు.
అరవై అడుగుల రోడ్డు సెంటరుకు పెద్దఎత్తున మహిళలు చేరుకొని నిరసన వ్యక్తం చేసారు . ఇక ఉపేక్షించేది లేదని తామే స్వయంగా పొలిసు యంత్రాంగం ఏర్పాటు చేసిన అన్ని అడ్డంకులు తొలగించేస్తామని ప్రకటించారు.
ఇదేరీతిలో అనందపేట ఏరియాలో కూడా ప్రజా ఉద్యమానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని చెబుతున్నారు . ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయాలుసై ఏ విధంగా స్పందిస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...