Jump to content

మానవ తప్పిదం వల్లే ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన


Recommended Posts

మానవ తప్పిదం వల్లే ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన 

ఎన్‌జీటీకి శేషశయన రెడ్డి కమిటీ నివేదిక

మానవ తప్పిదం వల్లే ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన
 

అమరావతి: విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో సోమవారం ఈ ఘటనపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌జీటీ శేషశయన రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించింది. మానవ తప్పిదంతో పాటు, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తన నివేదికలో పేర్కొంది.

విచారణ సందర్భంగా ఎల్‌జీ పాలిమర్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్‌జీటీకి లేదని వాదించారు. మరోవైపు 2001 నుంచి కూడా కంపెనీ అనుమతి లేకుండా నడుస్తోందని ఈఏఎస్‌ శర్మ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గ్యాస్‌ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న ఎన్‌జీటీ ధర్మాసనం నివేదికను పరిశీలించాలక లిఖిత పూర్వక ఆదేశాలు వెలువరిస్తామని పేర్కొంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఎన్‌జీటీ తదుపరి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

మానవ తప్పిదం వల్లే ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదం: ఎన్‌జీటీకి నివేదిక 

Jun 1 2020 @ 16:47PM

అమరావతి: ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ తన నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ సమర్పించారు. మానవ తప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో తెలిపారు. విచారణ కమిటీ నివేదికపై అభ్యంతరాలుంటే 24 గంటల్లో తెలపాలని ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్‌జీటీ స్పష్టం చేసింది. నివేదిక పరిశీలించి లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని ఎన్‌జీటీ అధికారుల వెల్లడించిరు. నేడో, రేపో ఎన్‌జీటీ తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...