Jump to content

Ramesh to continue as aec


rama123

Recommended Posts

ఎస్‌ఈసీ బాధ్యతల స్వీకరణ ఉత్తర్వులు వెనక్కి 

వెల్లడించిన ఎస్‌ఈసీ కార్యదర్శి

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఇచ్చిన ఉత్వర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి ప్రకటించారు. ఆయన పునర్‌ నియామకానికి సంబంధించి అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ అభ్యంతరాలు లేవనెత్తిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

అంతకుముందు ఏజీ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎప్పటిలోగా నియమించాలనే విషయంలో హైకోర్టు నిర్దిష్ట గడువేమీ విధించలేదని ఆయన అన్నారు. తీర్పు అమలుకు కోర్టు కాలపరిమితి విధించకపోతే రెండు నెలలు గడువు ఉంటుందని చెప్పారు. అయితే ఈలోపే నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తనకు తానుగా బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటన విడుదల చేశారని, బాధ్యతలు చేపట్టినట్లు వివిధ శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్‌ పంపారని చెప్పారు. ఆయనను ఎస్‌ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందే తప్ప.. బాధ్యతలు తీసుకోవాలని రమేశ్‌కుమార్‌కు చెప్పలేదని ఏజీ తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలంటే చట్టపరమైన చిక్కులున్నాయని, కొన్ని అంశాల్లో సందిగ్ధత ఉన్నందునే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావించినట్లు ఏజీ శ్రీరాం స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

నిమ్మగడ్డ నియామకం చెల్లదు అన్నప్పుడు ఆయన చేపట్టిన ఎన్నికలు కూడా చెల్లవు. కాబట్టి ఎన్నికలు రద్దు అయిపోయినట్లే. మళ్లీ మొదలు పెట్టాలి. 

కానీ సుప్రీంకోర్టులో చెప్పుదెబ్బలు తప్పవు. 

సుప్రీంకోర్టులో కవరప్ చేయడానికే వెంటనే అమిత్ షా ఫోను, రాంమాధవ్ జగన్ ని కలవడం జరిగాయి అని నా అనుమానం.  సుప్రీం కోర్టులో వాళ్లకు అనుకూలంగా తీర్పు వస్తే, తెలుగుదేశం కథ క్లోస్ అయినట్లే.  ఎందుకంటే వచ్చే ఎన్నికలలో కూడా వాళ్ళు ఇలాంటి పనులు చేసి అడ్డదారిలో గెలుస్తారు. 

ఇలాంటి దాడులను తట్టుకొని పది సంవత్సరాలపాటు ఎవరు కార్యకర్తలు మిగలరు. 

But Harish Salve Talking against YCP. Told need to take strict action against them in the case of Comments against Judges. 

More Screwing is there for Jagan.

 

 

Link to comment
Share on other sites

న్యాయవ్యవస్థను కించపరుస్తున్న ఆంధ్రా నాయకులకు గుణపాఠం చెప్పాలి

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీ నాయకులు న్యాయవ్యవస్థను కించపరుస్తున్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, న్యాయస్థానాల గౌరవాన్ని నిలబెట్టేలా వారికి గుణపాఠం చెప్పాలని సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నాయకులు న్యాయమూర్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. కులం పేరుతో నిందిస్తున్నారని, అనేక రకాలుగా దూషిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్విటర్‌ తదితర సామాజిక వేదికలపై ఇటీవల న్యాయమూర్తులను కించపరుస్తూ న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న పరిణామాలపై  బార్‌ అండ్‌ బెంచి వెబ్‌సైట్‌లో సీఏఎన్‌ ఫౌండేషన్‌ శనివారం నిర్వహించిన చర్చావేదికలో ఆయన పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం వాటిల్లుతున్న అంశంలో ఎలా వ్యవహరించాలంటూ సాగిన ఈ చర్చలో హరీశ్‌సాల్వే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలను రెండుసార్లు ప్రస్తావించారు. ప్రధానంగా ఇలా విమర్శలు చేసే వారిని రెండు రకాలుగా అభివర్ణించారు. ఒకటి పౌరసమాజం కాగా రెండో వర్గం ప్రభుత్వంలోను, రాజకీయపార్టీల్లోనూ ఉంటూ తమ మాటలతో ప్రజాభిప్రాయాన్ని మలిచేవారుగా ·చెప్పారు. ఈ రెండో తరహా వ్యక్తులు చేసే విమర్శలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. దీన్ని మరో రెండు విభాగాలుగా చూడాలన్నారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి చెందిన వారు కోర్టులను విమర్శిస్తే అది తీవ్రంగా పరిగణిస్తూనే సంస్థాపరమైన సమతౌల్యం సాధించాల్సి ఉంటుందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే అదీ మరీ తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. రాజకీయపార్టీ నాయకులు నేరుగా న్యాయమూర్తులను దూషిస్తూ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే న్యాయస్థానాన్ని నిందిస్తే ఇక ఆ వ్యవస్థకు గౌరవం ఎలా దక్కుతుందని ప్రశ్నించారు. వ్యక్తిగత పరువునష్టం కేసుల పరిశీలనకు ఒక ప్రత్యేకంగా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసి త్వరగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని హరీశ్‌ సాల్వే అభిప్రాయపడ్డారు.

Link to comment
Share on other sites

2 hours ago, sudhakar21 said:

Better tdp leave this issue

tomorrow this nimmagadda may support Jagan 

who knows 

better concentrate on people issues more

like special status,promises

ee Ramesh Nominations antha silent ga unnadu, Panchayathi offices ki rangulu vesthe "Gatam Gatahaa" annadu.

He is equally waste fellow. TDP should demand for re elections including nomination stage

Link to comment
Share on other sites

నిమ్మగడ్డ ni ఎవరు mosthannaru, టిడిపి never did, but opposition ga the way govt acted shd be condemned n take this to court n public, nominations అప్పుడు ఆయన emanna support chesada మనం cheyyataniki.. 

Link to comment
Share on other sites

3 hours ago, ramntr said:

నిమ్మగడ్డ ni ఎవరు mosthannaru, టిడిపి never did, but opposition ga the way govt acted shd be condemned n take this to court n public, nominations అప్పుడు ఆయన emanna support chesada మనం cheyyataniki.. 

Avasaram ayithey, aa nimmagadda ki personal ga salaha isthundhi ela fight cheyali ani. Anthey gani, aayana issue TDP emi pattukoledhu kada.

Link to comment
Share on other sites

ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే: నిమ్మగడ్డ
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈసీ)గా తనను పూర్తికాలం పదవిలో కొనసాగేలా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎస్ ఈసీ వ్యవహారంలో ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడం సరికాదన్నారు. ఇది ముమ్మాటికీ హైకోర్టు తీర్పును ధిక్కరించడమే అవుతుందన్నారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతను ప్రభుత్వం అంగీకరించడం లేదని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు తన పదవీకాలం ఉందని నిమ్మగడ్డ తన ప్రకటనలో తెలిపారు.
 

తన నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని.. హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించట్లేదని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది పిటిషన్ వేయనున్నారు. రేపు హైకోర్టు సమ్మర్ వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

అయ్యా ఏజీ గారూ..

నిమ్మగడ్డ గారి నియామకమే చెల్లనప్పుడు వారిచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ కూడా చెల్లదు కదా ?

అంటే ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ ఏకగ్రీవాలతో సహ చెల్లనట్లే కదా ?

కాస్త రేపు సుప్రీమ్ కోర్ట్ లో ఈ సంగతి చూడండి.

*నిమ్మగడ్డ సుప్రీం కు వెళ్లక ముందే ఏపి సిఎం జగన్ కి షాక్..*

ఏపీ ముఖ్యమంత్రి వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గా మారిన వ్యవహారానికి శుక్రవారం హైకోర్టు చెక్ పెట్టిన విషయం తెలిసిందే. 

ఏపీ ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని.. 
నిమ్మగడ్డ ను తొలగించడం కుదరదని, తిరిగి ఆయన నే ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. 

అయితే, దీనిపై సుప్రీంకోర్టు కు వెళ్తామని.. వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రకటించారు. 

అయితే వారు సుప్రీంకోర్టు కు వెళ్లే లోపు వైసీపీ కి పెద్ద షాక్ తగిలింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం పై సుప్రీంకోర్టు లో కేవియట్ పిటిషన్ దాఖలైంది. 

హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు - హైకోర్టు తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా సుప్రీంకోర్టు లో కేవియట్ దాఖలు చేశారు. 

దీంతో ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీంకోర్టు కు వెళ్లినా స్టే తెచ్చు కోలేరు. 

ఈ సడెన్ సర్ ప్రైజ్ తో వైసీపీ నేతలకు దిమ్మ తిరిగినట్టయ్యింది.

కరోనా విజృంభణలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న సదుద్దేశ్యంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేస్తే దానికి స్వయంగా ముఖ్యమంత్రి కులం రంగు పులిమారు. మంత్రులు ఎమ్మెల్యేలు రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న స్పీకరు సైతం కులాల పేరుతో బూతులు తిట్టారు.
ఆ తర్వాత రాజకీయ రంగు పులిమారు. 

దీంతో పాటు ఐఏఎస్ అయిన నిమ్మగడ్డ నే కొందరు వైసీపీ నేతలు వారి సహజ లక్షణంతో బెదిరించడం మొదలు పెట్టారు. 

దీంతో అతను కేంద్రానికి భద్రత కోసం లేఖ రాయగా కేంద్రం నిమ్మగడ్డ కు భద్రత పెంచింది. 

తర్వాత ఏపీ సర్కారు వ్యూహాత్మక అడుగులు వేసి ఆయన పోస్టును పీకేసింది.

ఎలాగైనా నిమ్మగడ్డ ను తప్పించడానికి ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నించడం జరిగింది.

సీఈసీ రమేష్ తో పాటు టిడిపి కి చెందిన వర్ల రామయ్య ఏపీ బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ తదితరులు హైకోర్టు లో పిటిషను వేశారు. 
వీరితో పాటు కొందరు లాయర్లు,  ప్రజాస్వామ్య వాదులు కోర్టులో పిటిషను వేశారు. 

వీటన్నింటిని విచారించిన అనంతరం ఏపీ ప్రభుత్వం రాజ్యాంగం అతి క్రమించిందని ఆర్డినెన్సు ను కొట్టేసింది. 

దీంతో కనగరాజ్ నియమాకం చెల్లదని తేలి పోయింది. 

ఆటోమేటిగ్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎస్ఈసీ అయ్యారు.

దీనిని జీర్ణించు కోలేని వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పింది. 

ఇది గెలవడం కోసం కాదు, కేవలం స్టే తెచ్చుకునే ప్రయత్నం. వారు వెళ్లే లోపు అక్కడ కేవియట్ దాఖలవడం అనూహ్య పరిణామాం.  

అంటే ఇక నిమ్మగడ్డే ఎస్ ఈసీ.. 
సుప్రీం తీర్పు ఆయన కు వ్యతిరేకంగా వస్తే తప్ప. విచారణ సమయం లో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమారే ఎస్ ఈసీ అన్న మాట..

అధికార వైకాపా అతి జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోర్టులంటే లెక్కలేనితనం న్యాయ నిపుణులలో చర్చలలోకి వస్తోంది. అది ఆ పార్టీకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా తెలియదు గాని, కెలుక్కొంటూ వెళితే దాని నాయకుడే మూల్యం చెల్లిస్తాడు. అది ఆ పార్టీ మనుగడకే ప్రమాదం అయ్యి మూన్నాళ్ల ముచ్చట అవుతుంది.

తన వాదన పటిమతో అంతర్జాతీయ కోర్టులో పాకిస్తాన్ లో వున్న మన భారతీయుడిని విడిపించిన హరీష్ సాల్వే గారు వైకాపా కోర్టు దిక్కారణను సీరియస్ గా తీసుకోవాలని నొక్కి చెప్పారు. ఈయన గతంలో ముకుల్ రోహత్గి తో పాటు జగన్ రెడ్డి బెయిలు కోసం సుప్రీంకోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది కావడం గమనార్హం.

రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య ఘర్షణ వినాశనానికే దారి తీస్తుంది. ప్రభుత్వాలు అనాలోచితంగా చేసే విధాన నిర్ణయాలను న్యాయ వ్యవస్థ చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పుడు హుందాగా స్వీకరించి, సరిదిద్దుకొంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది. ధిక్కార స్వరం వినిపిస్తే వ్యవస్థల మీద ప్రజలకు విశ్వాసం సడలిపోతుంది, దుష్పలితాలను అనుభవించాల్సి వస్తుంది.

ఎస్.ఈ.సి వివాదంలో మరిన్ని మలుపులు దాగుడుమూతలు అవసరమా? ఉన్నత న్యాయస్థానం తీర్పుతో సర్కారు ఆటలా? పేరు లేకుండానే  ఫైలు నడిపారు. జీవో ఫైలుకు ఆమోదం ఉందా? కొత్త సంప్రదాయాలకు తెరలేపారు. ప్రజాహితం లేని ఆర్డినెన్స్ జారీలో లోపాలకు సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి  

Link to comment
Share on other sites

రేపు అమిత్‌షాతో జగన్‌ భేటీ

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్‌షాతో చర్చించనున్నారు.

Link to comment
Share on other sites

9 minutes ago, rajanani said:

రేపు అమిత్‌షాతో జగన్‌ భేటీ

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్‌షాతో చర్చించనున్నారు.

 

SEC gurinche anukunta....Supreme Court lo edho esukuntaaaremo. But Congress edho Caveat Petition esindhanta so that High Court decisions meedha Supreme Court cannot give a stay ani. CHoodali emi avuthundho

Link to comment
Share on other sites

నిమ్మగడ్డ వ్యవహారం.. సుప్రీంలో పిటిషన్‌ 

దిల్లీ: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్‌ను పునర్‌ నియమించాలంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే రమేశ్‌ కుమార్‌ తొలగింపునకు సంబంధించి ఇచ్చిన ఆర్డినెన్స్‌లు, జీవోలను కూడా కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఎస్‌ఈసీ నియామకంపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరింది.

Link to comment
Share on other sites

4 hours ago, suravaram said:

 

SEC gurinche anukunta....Supreme Court lo edho esukuntaaaremo. But Congress edho Caveat Petition esindhanta so that High Court decisions meedha Supreme Court cannot give a stay ani. CHoodali emi avuthundho

Akkada vunnadi MoSha 

avasaram ite yevadini Ina tappistam maa mata vinaka pothe

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...