Jump to content

Foreign returns


Recommended Posts

US government charged 2000 dollars just bring them to one destination and then passenger has to bear within the country to go home. Compared to that it is fair provided govt keep them in quality 3 or 5 star hotel. It is the gulf returnees govt has to support as they are mostly poor workers.

Link to comment
Share on other sites

1 hour ago, Prasadr said:

US government charged 2000 dollars just bring them to one destination and then passenger has to bear within the country to go home. Compared to that it is fair provided govt keep them in quality 3 or 5 star hotel. It is the gulf returnees govt has to support as they are mostly poor workers.

Yes

Link to comment
Share on other sites

విమాన టిక్కెట్ల కోసం..బంగారం అమ్మేస్తున్నారు
 

యూఏఈలో ఉంటున్న భారత వలస కార్మికులు, చిరుద్యోగులు స్వదేశానికి వచ్చేందుకు విమాన టిక్కెట్ల కోసం తమ దగ్గరున్న బంగారం అమ్మేస్తున్నారు. కొవిడ్ ప్రభావంతో అకస్మాత్తుగా ఉపాధి కోల్పోవడం, జీతాల్లో కోతలతో చాలామంది చేతిలో సరిపడా డబ్బులేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మే 7 నుంచి భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభమవడంతో ఒక్కసారిగా వీరి బంగారం అమ్మకాలు పెరిగిపోయాయి. దుబాయ్ లోని మీనాబజార్ , డేరా ప్రాంతాల్లోని చిన్నచిన్న బంగారు దుకాణాలలో ఎక్కువగా ఇలాంటి లావాదేవీలే జరుగుతున్నాయి. ఇక్కడ నివాసం ఉంటున్న పెద్ద కంపెనీల ఉద్యోగులు సైతం తమ కుటుంబసభ్యులను స్వదేశానికి పంపిస్తున్నారు. వీరంతా తమ బంగారాన్ని భారత్ కు వచ్చాక అమ్ముకుంటే 10-12 శాతం ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉన్నా.. ప్రస్తుతానికి చేతిలో డబ్బు ఉండటమే ముఖ్యమని భావిస్తున్నారు. దుబాయ్ లో సోమవారం 22 క్యారెట్ల గ్రాము బంగారం 193.50 దిర్హమ్ లు(రూ.3,963) పలికింది.

Link to comment
Share on other sites

https://www.andhrajyothy.com/telugunews/nri-naresh-babu-sensational-comments-on-vande-bharat-mission-2020051110465648

 

హైదరాబాద్: విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరిట స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 6 వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో చాలా మంది తెలుగు వారు కూడా ఉన్నారు. కువైత్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న తెలుగు వాసులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో బస చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కువైత్‌లో ఉన్న తెలుగు వారు కంగారు పడి హైదరాబాద్‌కు రావద్దంటూ నరేష్ బాబు అనే తెలుగు ఎన్నారై సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు బాగా ఉన్నాయనుకున్న వారు మాత్రమే హైదరాబాద్‌కు రమ్మంటూ ఆయన సలహా ఇస్తున్నారు. తాను, తనతో పాటు వచ్చిన వారి నుంచి అధికారులు 15 వేలు తీసుకున్నారని.. అదేంటంటే గాంధీ ఆసుపత్రికి వెళ్తారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారని నరేష్ బాబు వాపోయారు. హోటల్‌లో సరైన సదుపాయాలు లేకపోయినప్పటికి.. వేలకు వేలు తీసుకుంటున్నారని అన్నారు. అదేంటంటే.. ఆరోగ్యం కావాలా డబ్బులు కావాలా అన్న విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. డబ్బులు లేకపోతే గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి పక్కన బెడ్ ఇస్తామంటూ దారుణంగా మాట్లాడుతున్నారని అన్నారు. మరోపక్క ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిపై వివక్ష చూపుతున్నారని అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఆంధ్రకు వెళ్లడమే మంచిదని ఆయన చెబుతున్నారు. ప్రతి ఒక్కరు డబ్బు కోసమే తప్ప సహాయం చేద్దామనే ఆలోచన చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...