Jump to content

సీతక్కా.. నువ్వు అక్క కాదు..అమ్మవి


Recommended Posts

Enduko eeme ante respect 

సీతక్కా.. నువ్వు అక్క కాదు..అమ్మవి

సీతక్కా.. నువ్వు అక్క కాదు..అమ్మవి!

ఆ గ్రామానికి వెళ్లిన తొలి ప్రజాప్రతినిధి ఆమే!

వాజేడు: సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎక్కడకు వెళ్లినా రాజకీయంగా అక్కడ ఎంతో కొంత హడావుడి ఉంటుంది. అదే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వెళ్తే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడో అతికొద్ది మంది మాత్రమే నిరాడంబరంగా ఉంటూ ప్రజాసేవ కోసం పరితపిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్‌ సీతక్క. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తితో రోజువారీ కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇలాంటి కష్టసమయంలో ఎంతోకొంత సహాయం చేయాలని భావించిన సీతక్క.. గత కొద్దిరోజులుగా ప్రజల వద్దకే నేరుగా వెళ్తున్నారు. వాళ్ల ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిచోట్ల నిత్యావసరాలు అందివ్వడం, భోజన సౌకర్యాలు కల్పించడం.. ఇలా తన పరిధిలో చేయాల్సిన సహాయం చేస్తున్నారు. తన వాహనం వెళ్లలేని చోట తానే కాలినడకన వెళ్లి ఆయా బాధితులకు అండగా నిలబడిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. తాజాగా వాజేడు మండలంలో కొండలపైనున్న పెనుగోలు గిరిజన గ్రామానికి సీతక్క వెళ్లారు.

Link to comment
Share on other sites

కూరగాయల మూట తలపై పెట్టుకుని..

వాజేడు మండల కేంద్రం నుంచి పెనుగోలు దూరం 20 కి.మీ. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఉన్న ఆ గ్రామానికి చేరుకోవాలంటే కాలినడకే శరణ్యం. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సీతక్క సైతం సుమారు 15 కి.మీ కాలినడకన నడిచారు. అవకాశం ఉన్నచోట మధ్యలో కొద్దిదూరం ద్విచక్ర వాహనం ఎక్కినప్పటికీ ఎక్కువ భాగం కాలినడకనే వెళ్లి పెనుగోలు చేరుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లేదారిలో కూరగాయల మూటను సైతం ఆమె స్వయంగా మోసుకుని వెళ్లారు. అక్కడ సీతక్క ఫౌండేషన్‌, అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ, సర్వర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు నిత్యావసరాలు, దుస్తులు అందజేశారు. దీంతో పెనుగోలు గ్రామానికి వెళ్లిన తొలి ప్రజాప్రతినిధిగా సీతక్క నిలిచారు. ఎమ్మెల్యే వెంట ములుగు సబ్‌ రిజిస్ర్టార్‌, సర్వర్‌ ట్రస్టు నిర్వాహకురాలు తస్లీమా మహ్మద్‌, అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పీర్ల కృష్ణబాబు, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బీవీ సీతారామరాజు, నాగారం సర్పంచి ఆదినారాయణ తదితరులు ఉన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...