Jump to content

పూటకి ఒక ట్వీట్ పెట్టి ఇదంతా మీరే చేసుకున్నారు


Recommended Posts

కిట్ల కాడ ఆ మంత్రం మరిచిపోవడం అనుమాస్పదం

ఆంధ్రాకు ఏదో దాన కర్ణులు లెక్క
ప్రతి పనికి ఓ మంత్రం జపించే వారు 

దేశంలోనే ఇదో వినూత్నం అని 
పారదర్శకం అని 
అబ్బో అట్టా ఇట్టా కాదు 
దాని గురించి ప్రచారం చేసింది 

దాంతో పాటు రెడ్డి గారు చెప్పే ఓ డైలాగు 
అవినీతిని సహించను అని 
ఆ డైలాగ్ చెప్పినప్పుడల్లా 
ఆయన చార్జ్ షీట్ల గురించి తెలిసిన 
ఆంధ్రా ఘొల్లున నవ్వినా 
ఆయ మాత్రం ఆపేవారు కారు. 

కానీ దేశంలో ఈయన పెత్తేకంగా కనిపెట్టిన 
రివర్స్ మంత్రం ఎందుకో 
సరిగ్గా కరోనా కిట్ల దగ్గర 
ప్రయోగించడం మరిచిపోయారు

ఏ రాష్ట్రానికి తక్కువకు ఇస్తే 
ఆ రాష్ట్రం చెల్లించే ధర 
మేమూ చెల్లిస్తాం అని 

మన అదృష్టం కొద్ది  
చత్తీస్‌ఘడ్ కిట్లను కొనుగోలు చేసిన ధరను 
బహిరంగ పరిచింది 

ఒక వేల 
ఇంకో ప్రభుత్వం ఏడన్నా కమీషన్ల కక్కుర్తితో 
ఎక్కువ రేటుకు కొని వుంటే 
వైకాపా కూడా చెల్లించేసేదా?

రివర్స్ మంత్రం ఇక్కడ ఎందుకు జరిపించలేదు? 

ఒక వేళ చత్తీస్‌ఘడ్ 337 కు కొన్నామని చెప్పకుండా వుండి వుంటే

ఇక్కడ వైకాపా నాయకులు తలో రేటు చెబుతున్నారు 
640 ఒకరి పాట అయితే 730 కి మరొకరి పాట 740 కి ఇంకొకరి పాట 

అందులో ఏదన్నా ఓ ఫ్యాన్సీ నంబర్ రేట్ కి చెల్లించేసే వారా? 

ఎక్కడన్నా పర్చేస్ ఆర్డర్ లో ... 
దేశంలో ఇంకొకరు ఏ రేటుకు కొంటే 
అదే రేటుకు కొంటామని చెబుతారా?  

అంటే రేటు నెగోషియేట్ చేతగాలేదా? 

లేదా అంత కంటే తక్కువకు మరెవరన్నా కొంటే 
అవినీతి ఆరోపణలు వస్తుంది అని 
ఈ పర్చేశ్ ఆర్డర్లో పితలాటకాలు పెట్టారా? 

రివర్స్ టెండరింగ్ మంత్రం మరిచిపోవడం మాత్రం 
వైకాపా అభిమానుల్లో కూడా 
కరోనా సమయంలో అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. #చాకిరేవు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...