Jump to content

ముసునూరి కాపయ నాయకుడు


Recommended Posts

దక్షిణాపధాన ముస్లిం దురాక్రమణదారులను తరిమికొట్టి హిందూ రాజ్యస్థాపన చేసిన తెలుగువారి తొట్టతొలి హిందూ చక్రవర్తి ' ముసునూరి కాపయ నాయకుడు '.. 
ఈరోజు వారి జయంతి ..  
సంఘ్ లో గానం చేసే ఏకాత్మతా స్తోత్రం లోని '' ముసునూరి నాయకౌ '' ... వీరే...యుద్ధరంగంలో ముస్లిం మూకలను తెలుగు గడ్డ మీద తరిమి తరిమి కొట్టిన మృగేంద్రుడు మన కాపనీడు...ఈరోజు వారి జన్మదినం తిధుల ప్రకారం...
ముసునూరి కాపయ నాయకుడు (క్రీ.శ. 1332-1368).. ముస్లిం పాలననుంచి ఆంధ్రాను విముక్తం చేసి ..ఎన్నో హిందూ రాజ్యాల స్థాపనకు స్పూర్తినిచ్చిన '' అరివీర భయంకరుడు '' కాపనీడు... వీరివల్ల స్పూర్తిపొందిన రాజ్యాల్లో హోయసల, ద్వారసముద్రము మరియు అరవీటి రాజులు..హరిహర మరియు బుక్క రాయలు హోయసల రాజ్యమును జయించి విద్యారణ్యులవారి బోధనలవల్ల ఆనెగొంది లొ విజయనగర రాజ్యము స్థాపించారు...
ప్రోలయ నాయకుడి మరణానంతరం ఆయన పినతండ్రి కుమారుడైన ముసునూరి కాపయ నాయకుడు క్రీ.శ.1332లో ఆంధ్రదేశ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. కాపయ నాయకుడి చరిత్రకు ముఖ్య ఆధారాలు ఇతడు వేయించిన పోలవరం, పిల్లలమర్రి, గణపేశ్వర శాసనాలు. అంతేకాకుండా రేచర్ల వెలమల చరిత్రను వివరించే వెలుగోటి వారి వంశావళి, ఫెరిస్టా రచనలు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి.

మహ్మదీయుల ఆధీనంలో ఉన్న ఓరుగల్లు కోటను కాపయ నాయకుడు కర్ణాటక హోయసాల పాలకుడైన మూడో వీరభల్లాలుడి సహాయంతో స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి ఓరుగల్లు దుర్గ పాలకుడైన మాలిక్ మక్బల్ యుద్ధం నుంచి పారిపోయాడు. కాపయ నాయకుడు క్రీ.శ.1337లో ఓరుగల్లును ఆక్రమించాడు. తెలంగాణలోని మెతుకుసీమ, ఇందూరు(నిజామాబాద్)లోని కౌలాసకోట, నల్గొండ, పానగల్లు, దేవరకొండ, భువనగిరి ప్రాంతాలతోపాటు కృష్ణా, గోదావరి నదీ తీర ప్రదేశాలు కూడా ఇతడి రాజ్యంలోకి వచ్చాయి. కాపయ నాయకుడు తన పాలనను రేకపల్లి దుర్గం నుంచే నిర్వహించాడు. క్రీ.శ.1346 నాటి గణపేశ్వర శాసనం ఇతడిని ‘అనుమనగంటి పురవరాధీశ్వర’ అనే బిరుదుతో ప్రస్తావించింది.

ఉత్తర తెలంగాణ, కృష్ణానది పర్యంతం ఉత్తర తీరాంధ్ర ప్రాంతంపై కాపయ నాయకుడు ఆధిపత్యం చెలాయించినట్లు చెప్పొచ్చు. గణపేశ్వర శాసనం కాపయ నాయకుడిని సమస్త రాజాశ్రయుడని, సమస్త జనపరివృత్తాలంకృతుడని కూడా వర్ణించింది. ఇతడిని కలువచేరు శాసనం కాపావనీశ్వరుడని, పిల్లలమర్రి శాసనం ఆంధ్రదేశాధీశ్వరుడని, ముమ్మిడి నాయకుడి ఆర్యావట శాసనం- ప్రఖ్యాతాంధ్ర సురత్రాణుడని వర్ణించాయి.

ఆంధ్రదేశానికి రాజకీయ ఐక్యతను ప్రసాదించిన కాపయ నాయకుడి ఆశలు అచిరకాలంలోనే భగ్నమయ్యాయి. ఇతడిని ధిక్కరించి అద్దంకిలో ప్రోలయ వేమారెడ్డి, రాచకొండలో రేచర్ల పద్మనాయకులు, కొండవీడులో రెడ్డి రాజులు, పిఠాపురంలో కొప్పుల వెలమలు.. వంటి చిన్నచిన్న స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. దీంతో ఆంధ్రదేశం మరోసారి ముక్కలైంది. ఈ రాజవంశాల్లో వర్ణాభిమానం మితిమీరింది. రాజ్యం కోసం వెలమలు, రెడ్లు తమలో తాము పోరాటాలు జరుపుకుంటూ తుదకు తెలంగాణతోపాటు మధ్యాంధ్ర దేశాన్ని బహమనీ సుల్తానులకు అప్పగించారు.. 
భారత్ మాతాకి జై....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...