Jump to content

CBN efforts AMTZ vizag


Andhrudu

Recommended Posts

Andhra Pradesh Medtech Zone Limited #AMTZ #Vizag  #Andhrapradesh. Which was established by #CBN in 2016 and fully operational by 2018-19. 

Now it is  One of the largest medical devices and equipment manufacturers hub in india. 
Today in this tough times  it is life line to whole India in providing Masks, PPE kits, ventilators, TestingKits etc.

No one Expected this pandemic. This is vision and responsibility, how  governance should be. 

కుల పిచ్చి ఉన్నోళ్లు ద్వేషించుకోవొచ్చు వాటికీ కాలమే సమాధానం . ప్రెస్  మీట్ లో  మాటల మరాఠి కాదు,  బిగ్ బాస్ స్టంట్ మాస్టర్ కాదు .. All politicians in India wearing #madeinandhra N95 mask will tell why educated class admire him so much. Unfortunately masses can't understand this

Then  in #Andhra #Chandrababunaidu

https://www.google.com/amp/s/www.thehindubusinessline.com/news/national/cm-naidu-to-inaugurate-ap-medtech-zone-today/article25727546.ece/amp/?espv=1

 

Now in #Andhra they are utilizing it.

https://m.eenadu.net/latestnews/AP-Minister-Goutham-Reddy-Pressmeet/1600/120047224

Link to comment
Share on other sites

Modi garu kcr garu jagan garu matalu Baga nice ga cheptaru ... Output a devudike eruka...

CBN wonderman , surprising Everytime with his past acts...

Aa roju software grab cheyalanna 

E roju desanni kapadalanna ....

Kontha mandi Edo vagutharu rajakiyam telidu ani... Manchi cheyalanna mansu undi adi chalu

Lord venkatewsara swamy dayavalla 15 years unnaru chalu tokklo state etu pothe makenduku emka 

Link to comment
Share on other sites

ఎక్కడ్రా... బాబోయ్! 

నువ్వంటే నాకు పెద్ద లవ్వేం లేదు
షాట్ కొట్టాల్సిన చోట డిఫెన్స్ ఆడతావనీ,
సెంచరీ చేసి పాతుకుపోవాల్సినప్పుడు వికెట్ పారేసుకుంటావని కోపం తప్ప!
నువ్ పదే పదే కనపడినప్పుడు, మాట్లాడుతున్నప్పుడూ అనుకునేవాణ్ని...
పరిగెత్తేది గుర్రాలు అయితే నువ్వెందుకు ఆయాస పడతావ్ అని!
ఇప్పుడు చాలా గుర్రాలు అవే!
పైగా కొన్ని ఇంపోర్టెడ్
వేటికీ కళ్లకి గంతల్లేవ్...
ఇష్టానుసారం ఏదైనా చేయొచ్చు
కానీ చేయడం లేదేం?
అంటే చెప్పే దిక్కు లేకనేనా?
నువ్ అప్పట్లో ఆత్రపడింది ఇందుకేనా ?
అర్థమవుతోంది నాకు!

హరికేన్ లాంటి హుదూద్ విరుచుకు పడి వాషౌట్ చేసింది!
అయినా... షవర్ బాత్ చేసి వచ్చినంత ఫ్రెష్ గా వారం రోజుల్లో తేరుకుంది విశాఖ!
జపాన్ చూడని వింత ఇది!
అమెరికా తీరానికి తెలియని స్పీడు అది!
పైగా ఆర్నెల్లు తిరిగే లోపు బెస్ట్ సిటీగా నేషనల్ అవార్డు కూడానూ!
అమ్మణమ్మ కొడకా...
నువ్ పనిగాడివ... మొనగాడా!

దాని పేరు కరోనా !
కర్ నే కేలియే... కుఛ్ నహీ అంటోంది ఏపీ!
ఎటు చూసినా అన్ హ్యాపీ!
వెనకబడ్డాం వెనకబడ్డాం అని 
పది నెలలుగా మొత్తుకుంటున్నందుకో ఏమో...
దేశంలోనే టాప్ కి వెళ్లిపోతోంది ఏపీ!
కరోనా కేసుల్లో! 
భయం వేస్తోంది నాకు!
నువ్ ఉంటే ఇలా ఉండేది కాదని అర్థం అవుతోంది నాకు!

చైనాలో వచ్చినపుడే నువ్వైతే అప్రమత్తం అయ్యేవాడివి కాదా?
విదేశాల్లో ఉన్న పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఊరుకుంటావా?
పిల్లల్ని వెనక్కి పిలవండి... మళ్లీ పంపుదామని మోతెక్కేవాడివి కాదా?
అక్షయపాత్రలతో భోజనాలు పెట్టించి...
డ్వాక్రా మహిళలతో మాస్కులు కట్టించి...
మద్యం డిస్టలరీస్ తో శానిటైజర్లు చేయించి...
రాబోయేది సంక్షోభం... నేను సిద్ధం... మీరు రెడీయేనా అంటూ పొడిపొడి ఇంగ్లిష్ లో దేశం మొత్తాన్నీ నిద్ర లేపేవాడివి కాదా?
వందల కేసులు వచ్చాక ఐసోలేషన్ వార్డులు వెదికేవాడివా నువ్?
నా స్టేటు వైరస్ ని ఇలా ఆపుతోందని ఆన్ లైన్ డెమో పెట్టి ప్రపంచం కళ్లు తెరిపించేవాడివి కాదా?
సందేశాల వీడియో రికార్డింగులు చేసుకుంటూ పొద్దుపుచ్చేవాడివా? 
ఆరోగ్యం ఇలా... ఆర్థికం కోసం అలా ... అంటూ దేశానికి దారి చూపేవాడివి కాదా?
అయినా నా పిచ్చి గానీ...
నీకు కాఫీ తీసుకొచ్చే రాము గాడు కూడా పారాసిటమాల్ మాట మాట్లాడేవాడు కాదేమో!
డిసిప్లీన్ లేకపోతే మేడంకి నచ్చదని!
మొత్తానికి ఇప్పుడు మేం ఎక్కడ ఉన్నామో 
అర్థం అవుతోంది నాకు!

కరోనా లాంటివి వచ్చినపుడు
ఆలోచన ఉన్నోడు కావాలి!
కందిపప్పు కొట్టేసేవాడు కాదు!
వైరస్ ని తట్టుకోవాలంటే వ్యూహం ఉండాలి...
రంగులేసే టాలెంట్ సరిపోదు!
ప్రపంచం మొత్తం రేపు మునుగుతోంది
నేను ఇవాళే ముంచుతా అనేవాడెందుకు?
సంక్షోభాన్ని చక్కదిద్దే మొనగాడు కదా కావాల్సింది!
నువ్ చెప్పిన 49 రోజుల లాక్ డౌన్ ది బెస్ట్ అని దేశం అంటుంటే...
5 వేల సాయం మినిమం అని మిగతా రాష్ట్రాలు వింటుంటే...
మళ్లీ ఇంకోసారి 
అర్థం అవుతోంది నాకు ! 

నువ్ కట్టినవి కూల్చేందుకు...
నువ్ పెట్టినవి ఆపేందుకు...
కోరికోరి కొరివి పెట్టుకున్నాం!
అలా మూసేసిన మెడ్ టెక్ తెరిస్తే తప్ప ఇప్పుడు దిక్కులేదు !
నీ దారే రైటని తెలిసి...
నీ మాటే లైటయి వెలిగి...
నువ్వొచ్చే రోజు రాక ఎక్కడికిపోద్ది!
అర్థం అవుతోంది నాకు!

Anigalla post
He deserves appreciation.

Link to comment
Share on other sites

 CBN -speech attraction -10 percent 

but ground level work completion-90-100 percent

other top leaders in the countries and state who are heros now

speech attarction -1000 percent

ground level work completion 1-2 percent

but people want second category 

and our telugu state first rank

so CBN can never win again in telugu states

 

Link to comment
Share on other sites

1). Hitech City - helped creating an IT boom n revenue in Hyd. 

2). Pharma City - I have no idea what happened to this 

3). AMTZ - we are seeing its fruits now 

But in all those, decoits either tried attributing credit to someone else or external factors, or tried maligning his work with corruption allegations through their wide range of media houses. 

AMTZ vishayam lo kuda same will happen.

Cadre, local MLA, MP aspirants should start n continue talking about benefits we are reaping from AMTZ in these tough Corona times else CBN n TDP will be at great loss.

At least Vizag people should realize and understand his efforts n vision 

Link to comment
Share on other sites

8 hours ago, Royal Nandamuri said:

 

AP Janaalaki gyanam koravadindi anataniki this is best example. Paalichey gedhe ni kabela ki pampi, egiri tanney dunna pothu ki paalu pindaalani chustunnaru! 
 

as usual, konta mandi pichollu, ah tanney dunnapothu balls ki fans ayipoyaaru! Ah dunna pothu em tantondi! Super abba! Dictator lekka! Daani raajadam daani powrusham! Etc etc antu sambhramascharyaaalaku lonavutunnaru!

Link to comment
Share on other sites

WhatsApp received 

*చంద్రబాబుకి వైజాగ్ మెడిటెక్ జోన్ కి అసలు సంభందం ఏమిటి?* 

*అసలు ఇప్పుడు కరొనా కి, అప్పుడు చంద్ర బాబు పెట్టిన మెడిటెక్ జోన్ కి రిలేషన్ ఏమిటి?*
* * * * * * * * * * * * * * * * * * *
- నిన్న జగన్ ఒక కరోనా టస్టింగ్ కిట్ ని ఆవిష్కరిస్తూ ... కరోనా పాజిటివ్ లేక నెగటివ్ అని  ఈ కిట్, మరియు టెస్టింగ్ మెషిన్ ద్వారా 50 నిముషాల్లో చెప్పగల మెషిన్ అని గొప్పగా చెప్పారు.

గోవా కు చెందిన Molbio Diagnostics Pvt. Ltd, అనే కంపెనీ ఈ మెషీన్లని, కిట్స్ ని వైజాగ్ దగ్గరలోని మెడిటెక్ జోన్లో వున్న తన కంపెనీ లో తయారు చేస్తోంది...

*ఆంధ్రాలో ఇంత గొప్ప ఇండస్ట్రీలు ఉన్నాయా? ఎప్పుడు పెట్టారు?*
-  నవ్య ఆంధ్రప్రదేశ్ కు వైద్య రంగంలో చోటు కల్పించాలని, దేశంలోనే తొలిసారి " వైద్య డయాజ్ఞస్టిక్స్" పరికరాల తయారీ కేంద్రాన్ని వైజాగ్ లో ఏర్పాటు చెయ్యాలని 2016 ఆగస్టు 19న, AP Meditech Zone కి, వైజాగ్ లోని, పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో శంకుస్థాపన చేసారు.

-  2016 ఆగస్టు 19న శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్, డిసెంబరు 12, 2018న ప్రారంభించారు. 

- రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ఈ మెడిటెక్ జోన్ లో తమ కంపెనీలను నెలకొల్పాయి.

-  రోబోనిక్‌ ఇండియా, 
ఫోరస్‌ హెల్త్‌, 
మాస్‌ మెడ్‌టెక్‌, 
గ్రీన్‌ ఓషన్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌,ఫోనిక్స్‌ మెడికల్‌ సిస్టమ్స్‌,
రెనాలిక్స్‌ హెల్త్‌ సిస్టమ్స్‌,బయోసైన్స్‌ టెక్నాలజీస్‌, జైనా మెడిటెక్‌Etc
ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ ప్రొడక్షన్ మొదలు పెట్టాయి. 

సూది నుంచి సీటీ స్కాన్‌ వరకు... వైద్యరంగానికి చెందిన అన్ని రకాల పరికరాల తయారీ ఇక్కడ జరుగుతుంది. 

*సరే,మరి కరోనా కి అప్పుడే మెషిన్ తయారు చేసేసారా?*

కాదు. Molbio Diagnostics Pvt. Ltd, వారు తయారు చేసిన ఈ మెషిన్, అసలు TB వ్యాధి Detection కోసం తయారు చేశారు. 
Sputem ఒక ట్యూబ్ లో పెట్టి ఈ మెషిన్ లో పెడితే 50 నిముషాల్లో  TB  ఉన్నదీ లేనిదీ చెప్పేస్తుంది.

ఇలాంటి TB డిటెక్షన్ మెషీన్లని ఆంధ్ర రాష్ట్రం లోని 257 ప్రైమరీ హెల్త్ సెంటర్లు (PHC) ల్లో పెట్టారు.

కరోనా ఇప్పుడొచ్చింది. కానీ టీబీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పాలిట మహమ్మారి. రాష్ట్రాన్ని TB రహితంగా చేయాలనే ఉద్దేశ్యంతో, మెడిటెక్ జోన్ లో తయారు చేసిన మెషీన్లని రాష్ట్రం అంతటా నెలకొల్పారు.

*అంటే ఇప్పుడు ఆ 257 PHCల్లో కరోనా టెస్టింగ్ చెయ్యచ్చా?*

నిరభ్యంతరంగా. కాకపొతే కరోనా కోసం గొంతులోని Swab ని తీసుకొని మెషిన్ లో పెట్టటందుకు ఒక కిట్ అవసరం. ఆ కిట్ కూడా Molbio Diagnostics Pvt. Ltd తయారు చేసింది. వారి దగ్గర నుంచి కొని ప్రభుత్వం ఈ TB Detection Machine ఉన్న అన్నీ PHC లకు సరఫరా చేస్తే చాలు. అంతే.

*ఇదొక్కటేనా మెడిటెక్ జోన్ లో తయారు అయ్యేది?*

కాదు. వ్యాధి నిర్దారణకు అవసరమైన వివిధ వైద్య పరికరాలు, CT Scan ల నుంచి, టెస్ట్ ట్యూబ్ ల దాకా ఇక్కడ తయారు అవుతున్నాయి.

కరోనా కు సంబంధించి చెప్పాల్సి వస్తే, మాస్కులు, పర్సనల్ ఎక్విప్మెంట్ సూట్ లు, వెంటిలేటర్లు, మొదలగునవి ఇక్కడ మెడిటెక్ జోన్ లో తయారు అవుతున్నాయి. 

 *ఇంత మంచి ప్రాజెక్టుని కొత్త ప్రభుత్వం ప్రోత్సహించిందా*

- అధికారంలోకి రాగానే 
మెడ్ టెక్ జోన్ ని, నిర్వీర్యం చేసే ప్రయత్నం మొదలు పెట్టారు.

  - అన్నీ విషయాల్లో చేసినట్లుగానే ఇక్కడ అవినీతి జరిగింది అంటూ గోల చేసారు. 

- విజిలెన్స్ ఎంక్వయిరీ వేసారు.ఇది మెడ్ టెక్ జోన్ కాదు, ఇది ఒక మయసభ అంటూ, దీని పై విచారణకు ఆదేశించారు.  

- ఈ మెడ్ టెక్ జోన్ ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన MD జితేందర్ శర్మను,  ప్రభుత్వం తొలగించింది. 
- దేశంలోని వైద్య రంగం లోని పలువురు ప్రముఖులు ఈ చర్యను నిరసించారు.

- ఇలా ఏపి మెడ్ టెక్ జోన్ ని, నిర్వీర్యం చేయ ప్రయత్నం చేశారు.

*విజిలెన్స్ విచారణలో ఏమైనా బయటపడిందా?*

ప్రభుత్వం వేసిన వివిధ విచారణలు లాగానే, మెడిటెక్ లో ఏమీ జరగ లేదు అని తేల్చారు.

*మరి MD బదిలీ?*
సాక్షాత్తూ ప్రధాన మంత్రి మోడీ గారు, వివిధ వైద్య సంఘాల నుంచి వచ్చిన విజ్ఞాపనలను చూసి, స్వతంత్ర విచారణ చేయించి, రాష్ట్రానికి అక్షింతలు వేస్తే, MD Jithender Sharma ను మళ్లీ MD గా ఆంధ్ర రాష్ట్రం నియమించింది.

- కరోనా కట్టడి కోసం ఇప్పుడు అదే ఆంధ్ర ప్రభుత్వము, ఏదైతే ఒకప్పుడు, అది మెడిటెక్ కాదు, మాయసభ అని ఎగతాళి చేసిన వారే, ఇప్పుడు మాస్కుల, వెంటిలేటర్లు, టెస్టింగ్ మెషీన్ల కోసం ఆర్దర్లు ఇస్తున్నారు.

- ఇప్పుడ ఏపి మెడ్ టెక్ జోన్ మన రాష్ట్రానికే కాదు, దేశానికే, టెస్టింగ్ కిట్స్, మాస్కులు, వెంటిలేటర్లు అందించబోతుంది. 
** ** ** ** ** ** ** ** ** ** ** 
*చంద్రబాబు ఎన్నికల చివరి రోజున, ఒక మాట చెప్పారు....* 
 - నేను శాశ్వతం కాదు.
- ఈ రాష్ట్రం శాశ్వతం.
- భవిషత్తు తరాల కలల రాజధాని అమరావతి శాశ్వతం.
- నిర్మాణం అవుతున్న పోలవరం శాశ్వతం.
- సీమలో పారే కృష్ణా నీళ్ళు శాశ్వతం.
- మనం చేసిన గొప్ప పనులు శాశ్వతం.
- అలోచించి మంచి నిర్ణయం తీసుకోండి.

అయితే మెజారిటీ ప్రజలు మాత్రం,  ఆయన మాటలు విశ్వసించకుండా, వేరే నిర్ణయం తీసుకున్నారు.

 నిజంగానే చంద్రబాబు చెప్పినట్టు మనుషులు శాశ్వతం కాదు. వారు చేసిన మంచి పనులే శాశ్వతం. 

అలాంటి మంచి పనుల్లో, చంద్ర బాబు హయంలో నిర్మించిన మెడిటెక్ జోన్ ఒకటి.
ఈ రోజు కరోనా ఆపత్కర సమయంలో ఆ మెడిటెక్ జోన్ లోని కంపెనీల ఉత్పత్తులు మనల్ని ఆదుకొంటున్నాయి.
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...