Jump to content

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పేషంట్ల ను చూస్తున వైద్యుల పరిస్తితి


Vinod NKR

Recommended Posts

this is not new... YCP govt works like that.... they wont enable people to handle their own.. first they eat full money.. then share 1k or 2k to people..  and people also wants that.. whats wrong?? its not CBN who enables people to stand on their own and become independent.. people want to sit idle and have free benefits.. they are ignoring the fact that such benefits will come only after everyone at top ate their part..

Link to comment
Share on other sites

 

 

విమర్శించిన డాక్టర్‌ను సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్

విశాఖపట్నం: నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి ఎనస్థీషియన్ డాక్టర్ కె. సుధాకర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. డాక్టర్ సుధాకర్‌పై జాతీయ విపత్తు సమయంలో ప్రభుత్వానిక వ్యతిరేకంగా మాట్లాడడం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం, తన మాటల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటి పలు నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు నర్సిపట్నం టౌన్ సీఐ స్వామి నాయుడు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మాస్కులు, తగిన రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం లేపాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. 

 

సోమవారం సాయంత్రం మునిసిపల్‌ కార్యాలయంలో అధికారుల సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన డాక్టర్‌ సుధాకర్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపైనా, వివిధ శాఖల ఉన్నతాధికారులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మంగళవారం పత్రికల్లో రావడం, వార్తా ఛానెళ్లలో ప్రసారం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులు మంగళవారం ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. మరోవైపు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్‌ చేసిన ఆరోపణలను ప్రతిపక్ష టీడీపీ కుట్ర అంటూ విమర్శించారు. డాక్టర్‌ సుధాకర్‌ మునిసిపల్‌ కార్యాలయానికి వచ్చే ముందు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లివచ్చినట్టు చెబుతూ, ఇందుకు సంబంధించిన వీడియాను తన ట్యాబ్‌లో ప్రదర్శించారు. అయితే డాక్టర్‌ సుధాకర్‌ చేసిన అభియోగాల గురించి ప్రస్తావించలేదు. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...