Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

rajanani

జర్మనీలో ఆర్థికమంత్రి ఆత్మహత్య

Recommended Posts

eenadu news
ఫ్రాంక్‌ఫర్ట్‌ ఆమ్‌ మెయిన్‌: కరోనా వైరస్‌ వల్ల భవిష్యత్‌లో సంభవించబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలోనన్న తీవ్ర ఆందోళనతో జర్మనీలోనీ హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ షాఫెర్‌ (54) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మినిస్టర్‌ ప్రెసిడెంట్‌ వోల్కర్‌ బౌఫియర్‌ వెల్లడించారు. రైల్వే ట్రాక్‌ సమీపంలో శనివారం థామస్‌ మృతదేహం గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించారు. 
మేం షాక్‌లో ఉన్నాం. దీన్ని నమ్మలేకపోతున్నాం. మాకు ఎంతో బాధగా ఉంది. హెస్సీ ఆర్థిక మంత్రిగా థామస్ 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మహమ్మారి ధాటికి ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి.. కంపెనీలు, కార్మికులకు అండగా నిలవడానికి ఆయన పగలూ రాత్రి తీవ్రంగా శ్రమించారు. ఈ కష్ట సమయంలో ఆయన మాకు ఎంతో అవసరం’’ అని వోల్కర్‌ అన్నారు.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×