Jump to content

కరోనా ఎఫెక్ట్‌: మద్యం లభించడం లేదని ఆత్మహత్య


Recommended Posts

హైదరాబాద్‌: మద్యం లభించడం లేదని ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా మరొకరు ఆత్మహత్యకు యత్నించిన వైనమిది. బంజారాహిల్స్‌, పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ ఇందిరానగర్‌ వాసి, సినీ పరిశ్రమలో పెయింటర్‌గా పనిచేసే మధు(55)కు నిత్యం మద్యం తాగే అలవాటు ఉంది. కొన్నాళ్లుగా దుకాణాల మూసివేతతో ఇతడికి మద్యం లభించలేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు బంజారాహిల్స్‌ రోడ్‌-10లోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్వార్టర్స్‌లోని బ్లాక్‌ 8 భవనం నాలుగో అంతస్థుకు వెళ్లాడు. అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్వార్టర్స్‌వారు ఉదయం గమనించి సమాచారం ఇవ్వడంతో బంజారాహిల్స్‌ పోలీసులు వచ్చారు. ఇదే రోజు.. తండ్రి కనిపించడం లేదని మధు కుమారుడు బంజారాహిల్స్‌ స్టేషన్‌కు రాగా మృతుడిని గుర్తించారు. మరో ఘటనలో.. బేగంపేట్‌ బ్రాహ్మణవాడికి చెందిన టైల్స్‌పని కార్మికుడు సాయికుమార్‌(32) కొన్ని రోజులుగా మద్యం దొరకని నేపథ్యంలో శుక్రవారం పంజాగుట్ట కూడలిలోని రెండు పైవంతెనల మధ్య దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కాలు విరిగిన అతడిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అడ్మిన్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...