Jump to content

Who is CM for AP

Recommended Posts

బుధవారం, మార్చి 18, 2020
 
లైవ్ బ్లాగ్

Full Story

15:51(IST)

ఎంతమంది బాధితులొచ్చినా చికిత్సకు సిద్ధంకండి

హైదరాబాద్‌: ఎంతమంది కరోనా బాధితులు వచ్చినా చికిత్సకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారుల్ని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ, చికిత్సపై బుధవారం సీఎస్‌, డీజీపీ, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.  విదేశాల నుంచి వచ్చినవారందరినీ క్వారంటైన్‌లో ఉంచే ఏర్పాట్లపై ఆయన చర్చించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ..  క్వారెంటైన్‌లో అన్ని ఏర్పాటూ చేయాలన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే వైరస్‌ ఉందన్నారు. విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు చెప్పారు.

ఎంతమంది బాధితులొచ్చినా చికిత్సకు సిద్ధంకండి
 
15:35(IST)

విదేశాల్లో ఉన్న 276 భారతీయులకు ‘కరోనా’

దిల్లీ: ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌-19 కేసుల సంఖ్య 150కి చేరింది. మరోవైపు, విదేశాల్లో ఉన్న 276మంది భారతీయులకు కరోనా సోకినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.  బాధితుల్లో ఇరాన్‌లో చిక్కుకున్న వారిలోనే 255 మంది ఉండగా.. యూఏఈలో 12 మంది, ఇటలీలో 5 మంది, హాంకాంగ్‌, కువైట్‌, రువాండా, శ్రీలంకల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్టు లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొంది.

విదేశాల్లో ఉన్న 276 భారతీయులకు ‘కరోనా’
 
15:17(IST)

చికిత్స అందించిన వైద్యుడికీ కరోనా

లఖ్‌నవూ: యూపీలోని లఖ్‌నవూ కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆస్పత్రిలో ఇద్దరు కరోనా బాధితులకు చికిత్స అందించిన ఆయనలో కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు అస్పత్రి అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

చికిత్స అందించిన వైద్యుడికీ కరోనా
 
14:59(IST)

వైష్ణోదేవి యాత్ర రద్దు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో మాత వైష్ణో దేవి యాత్రను నేటి నుంచి రద్దు చేస్తున్నట్టు జమ్మూకశ్మీర్‌ అధికారులు ప్రకటించారు. అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను సైతం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సమాచార, ప్రసారాల శాఖ అధికారులు తెలిపారు.

వైష్ణోదేవి యాత్ర రద్దు
 
14:27(IST)

 తేలిగ్గా తీసుకోవద్దు.. విద్యాసంస్థలు మూసేయండి: పవన్‌

ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పవన్‌ అన్నారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని ఆయన  సూచించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంతాలను వదిలి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. కరోనాను తేలిగ్గా తీసుకోవడం సరికాదన్న జనసేనాని.. కేంద్రం చెప్పినట్టు అన్ని విద్యా సంస్థలనూ మూసివేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వైద్య బృందాలను నియమించాలని కోరారు. జనసేన పార్టీ తరఫున ఇప్పటికే తమ శ్రేణులకు ప్రణాళిక ఇచ్చినట్టు చెప్పారు. 

 తేలిగ్గా తీసుకోవద్దు.. విద్యాసంస్థలు మూసేయండి: పవన్‌
 
14:20(IST)

కరోనా నివారణకు చంద్రబాబు సూచనలు

అమరావతి: ప్రపంచ దేశాలను వణికిస్తూ భారతదేశంలోనూ క్రమక్రమంగా విస్తరిస్తున్న కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ నియంత్రణకు తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంత తేలిగ్గా తీసుకున్నా ప్రజలు స్వచ్ఛందంగా అప్రమత్తత పాటించాలని సూచించారు. ఎవరికి వారు సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 6 అడుగుల దూరం పాటించి.. జనసమూహాలను నివారించాలని కోరారు. కుటుంబం పట్ల బాధ్యతతో ఉంటూ కొవిడ్‌-19పై ఎక్కువ అవగాహన కల్పించాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు.

Link to comment
Share on other sites

తేలిగ్గా తీసుకోవద్దు.. విద్యాసంస్థలు మూసేయండి: పవన్‌

ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పవన్‌ అన్నారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని ఆయన  సూచించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంతాలను వదిలి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. కరోనాను తేలిగ్గా తీసుకోవడం సరికాదన్న జనసేనాని.. కేంద్రం చెప్పినట్టు అన్ని విద్యా సంస్థలనూ మూసివేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వైద్య బృందాలను నియమించాలని కోరారు. జనసేన పార్టీ తరఫున ఇప్పటికే తమ శ్రేణులకు ప్రణాళిక ఇచ్చినట్టు చెప్పారు. 

Link to comment
Share on other sites

6 hours ago, TarakMokshu99 said:

And Both are failed as opposition to creat pressure on CM.

I prefer public creating pressure on Govt rather than these opposition parties. 151 seats vachina vadiki opposition parties Peddaga pressure pettalevu. Public lo back lash vastey anni set avtaayi 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...