Jump to content
Sign in to follow this  
koushik_k

ఇది వ్యూహకర్తల కాలం

Recommended Posts

న్యూఢిల్లీ  : కొన్ని నెలలుగా దేశంలో పాచికలు రాజకీయాన్ని మార్చేస్తున్నాయి. దేశ రాజకీయాలు మొత్తం పాచికలు చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నికలనగానే అనేక రకాల పద్ధతులుంటాయి. ప్రచారం చేయడం, విమర్శలు చేసుకోవడం, బూత్ మేనేజ్ మెంట్, కార్యకర్తలను మెంటేయిన్ చేయడం, ధారాళంగా మాట్లాడటం... ఇలా రకరకాల పద్ధతులతో ఆయా పార్టీలు అధికారాన్ని ముద్దాడటానికి ప్రయత్నిస్తుంటాయి. ఇవన్నీ కూడా బయటికి కనిపించే పద్ధతులు. ఎవ్వరికీ తెలియకుండా, ఏమాత్రం బయటకు కనిపించకుండా, ఏమాత్రం ప్రచార ఆర్భాటాన్ని కోరుకోని వ్యూహకర్తలు కూడా ఉంటారు. ఎన్నికల సభలో మాటలతో దంచికొట్టడమే బయటకు కనిపిస్తుంది కానీ.... వ్యూహకర్తలు వేసే పాచికలు ఓటర్లకు అంతగా కనిపించవు.

 

ప్రతి పార్టీలో కూడా.. తమ మాటలతో పార్టీని విజయ తీరానికి నడిపించే స్టార్ క్యాంపెయినర్స్‌తో పాటు వ్యూహకర్తలు కూడా ఉంటారు. ప్రాంతీయ పార్టీల్లో అయితే దాదాపుగా అధ్యక్షులే ఈ రెండు పాత్రలనూ ఒంటిచేత్తో నడిపిస్తుంటారు. లేదా బాగా పాచికలు వేయగలిగిన నేత, ఆ పార్టీ అధ్యక్షులకు సహకరిస్తుంటారు. కానీ రానూ రానూ మాట్లాడే వారి పాత్ర తగ్గుతూ.... వెనకుండి పాచికలు వేసే వ్యూహకర్తల గిరాకీ బాగా పెరిగిపోతోంది. కాంగ్రెస్‌లో వ్యూహకర్తల బృందం పేరుతో వ్యూహాలు రచించే నేతలున్నారు. ఇక బీజేపీలో అయితే చాలా కాలం పాటు అద్వానీయే ఈ పాత్ర పోషించారు. తర్వాత తర్వాత అద్వానీ స్తబ్దుగా మారిపోయారు.

 

ఎప్పుడైతే అమిత్‌షా రంగప్రవేశం చేశారో అప్పటి నుంచి దేశంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. బహిరంగ సభల్లో ప్రజలను సమ్మోహనం చేసే బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీ భుజానికెత్తుకుంటే... వెనకుండి పాచికలు వేసే బాధ్యతను అమిత్‌షా తీసుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది. ప్రత్యర్థులను దాదాపు మూడు చెరువుల నీళ్లు తాగించేశారు. యూపీ లాంటి మినీ ఇండియాలో అమిత్ షా వేసిన పాచికలకు అన్ని పార్టీలూ విలవిలలాడిపోయాయి. ఇటు హిందుత్వను, అటు సోషల్ ఇంజినీరింగ్‌ను కలిపి చెలరేగిపోవడంతో దేశ రాజకీయ యవనికపై అమిత్‌షా తిరుగులేని వ్యూహకర్తగా ఎదిగారు. ఏ ఎన్నిక జరిగినా, ఎక్కడ ఎన్నికలు జరిగినా... అందరి చూపూ అమిత్‌షా వైపే ఉంటుంది. ‘అపర చాణుక్యుడి’గా పేరుగాంచారు.

 

ఇక అమిత్‌షాకు తిరుగులేదని భావిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్ రాజకీయ యవనికపై ప్రత్యక్షమయ్యారు. మొదట ఈయన బీజేపీ గెలుపు కోసం పనిచేశారు. తర్వాత తర్వాత కొన్ని ప్రాంతీయ పార్టీల గెలుపును భుజానికెత్తుకున్నారు. మొదట బీజేపీ గెలుపు కోసం పనిచేయగా, తర్వాత ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి విజయానికి, ఆ తర్వాత ఆమ్‌ఆద్మీ గెలుపు బాధ్యతను తలకెత్తుకున్నారు. ఆ తర్వాత ఈ విజయ ప్రస్థానాన్ని గమనించిన మమత, స్టాలిన్ పీకేను తమ వ్యూహకర్తగా నియమించుకున్నారు.

 

కార్యక్షేత్రం లోకి వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడం, అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసి వారిని సరిచేయడం, ఆయా పార్టీల అధినేతలకు సలహాలివ్వడం,  ఆయా పార్టీల తరపున సోషల్ మీడియాలో  ప్రచారం హోరెత్తించి అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తారు. 24 గంటలూ అలర్ట్‌గా ఉంటూ, ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి, అందుకు తగ్గట్టుగా పాచికలు వేస్తారు. ఈ మధ్య కాలంలో ప్రజలను సమ్మోహితులను చేసేవిధంగా మాట్లాడే వారి పాత్ర తగ్గి, వెనకుండి పాచికలు వేసే వారు బాగా సక్సెస్ అవుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వ్యూహకర్త వర్సెస్ వ్యూహకర్తగా రాజకీయాలు మారిపోయాయి. ఇప్పుడు నడుస్తోంది అమిత్‌షా, ప్రశాంత్ కిశోర్ కాలం. పాచికలదే కాలం. 

Share this post


Link to post
Share on other sites
16 minutes ago, vgchowdary said:

adi jaanalaki artham kaananta kaalam..raajulade rajyam...

adhi vallaki eppatiki ardam kaadu uncle...enduku ante vallantha corrupted evaru leru kabatti...

Share this post


Link to post
Share on other sites
4 minutes ago, koushik_k said:

Time to recruit PK 

will he accept out request?

Okka PK ni anadam kosam, babu garu mottha UP ni dacoits tho polchadu... it went beyind personlas.. i think he wont accept out req

Share this post


Link to post
Share on other sites
22 minutes ago, Bezawadabullo said:

will he accept out request?

Okka PK ni anadam kosam, babu garu mottha UP ni dacoits tho polchadu... it went beyind personlas.. i think he wont accept out req

a movie pk ni duvvatam lo pette shraddha 50% e pk meda pedithe pakka accept chesthadu.. end of the day money is what he need. 

Share this post


Link to post
Share on other sites
19 minutes ago, koushik_k said:

a movie pk ni duvvatam lo pette shraddha 50% e pk meda pedithe pakka accept chesthadu.. end of the day money is what he need. 

Paina article lo mee peru eyyatam marchipoyaru :peepwall:

Share this post


Link to post
Share on other sites

Guys come on....they are just using data pulled from your social media accounts and and emails associated with that along ...this gives them to analyse a pattern to do things and separate each section of audience and send the required stuff selectively based on search.... Cambridge analytica has done the same stuff and now it is done in same way ....very soon these will be banned in India ....

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×