Jump to content

రాజధాని మార్చొద్దని కేంద్రం లేఖ…!


Recommended Posts

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు రాజధాని మార్చవద్దని స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖకు కేంద్ర హోం శాఖ పరిధిలోని జనాభా లెక్కల డైరెక్టరేట్‌ ఒక లేఖ రాసింది. రాష్ట్రంలోని సరిహద్దులు మార్చవద్దని, త్వరలో 2021 జనాభా లెక్కల గణన జరగనుందని, అది పూర్తయ్యే వరకు పరిపాలనా విభాగాల(అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్స్‌) సరిహద్దులను మార్చరాదని స్పష్టం చేసింది.h-11.jpg

సచివాలయం మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్న తరుణంలో… జిల్లా, రెవెన్యూ డివిజన్‌, మండలం, గ్రామాలు పరిపాలనా విభాగాల కిందకే వస్తాయని, జనాభా లెక్కలు పూర్తయ్యేవరకు చేపట్టవద్దని ఆదేశాలు జారి చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఒకసారి చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటుకి అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలో జిల్లాల ఏర్పాటుకి కూడా అడ్డుపడింది కేంద్రం.

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం గాని రెవెన్యూ డివిజన్‌, మండలాలు, గ్రామాల వారీగా విభజన చేపట్టకూడదని స్పష్టం చేసింది. జనాభాలెక్కలు ముగిసేవరకు ఇప్పుడున్న యథాతథ స్థితినే కొనసాగించాలిని తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఫిబ్రవరి 9 నుంచి జనాభా లెక్కల కార్యక్రమం ప్రారంభం మొదలై… వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు రివిజన్‌ జరగనుంది.

ఏప్రిల్‌, సెప్టెంబరు మాసాల్లో ఇంటింటి గణన, ఇళ్ల లెక్కల గణన, జనాభా రిజిస్టర్‌ అప్‌డేట్ చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పాలనా యూనిట్ల విషయంలో యథాతథ స్థితినే కొనసాగించాలని తన ఆదేశాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు ఇది ఇబ్బందికరంగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ ఇప్పటికే జగన్ వద్దకు చేరిందని ఆయన తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, RKumar said:

paper pulihora lekapothe nijamgaane aapamannara?

I said before elections AP position will become like TN if TDP out of power. BJP wants to play & control all south states where they can't win on their own.

Pulihora laaga undi,  news lo ekkada ledu idhi.... 

Link to comment
Share on other sites

రాజధానిపై తొలిసారిగా స్పందించిన కేంద్రం

రాజధానిపై తొలిసారిగా స్పందించిన కేంద్రం

దిల్లీ: ఏపీ రాజధాని అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దాన్ని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. 2015 ఏప్రిల్‌ 23న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారానే తెలిసింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం ఆ ప్రభుత్వానికి ఉన్నది’’ అని నిత్యానందరాయ్‌ సమాధానమిచ్చారు.

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. ముఖ్యంగా అమరావతిలో రైతులు, మహిళలు ఉద్ధృతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకోసం భూములిచ్చిన తమకు అన్యాయం చేయడమేంటని మండిపడుతున్నారు. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుకెళ్లింది. శాసనసభలోనూ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందేలా చేసింది. మరోవైపు శాసన మండలిలో మాత్రం ఆ బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపుతూ ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ అమరావతి రైతుల ఆందోళనను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికే అధికారముంటుందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ లిఖితపూర్వకంగా జయదేవ్‌కు సమాధానమిచ్చారు.  

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...