Jump to content

శాసనమండలిలో బిల్లును అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీ పరిస్థితి ఇది..!


koushik_k

Recommended Posts

  • టార్గెట్‌ జగదీశ్‌
అనకాపల్లి(విశాఖపట్నం జిల్లా): టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు కుటుంబానికి అనకాపల్లి బెల్లం మార్కెట్‌ యార్డులో గల కోల్డ్‌ స్టోరేజ్‌ను అధికారులు సీజ్‌ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మార్కెట్‌ కమిటీ అధికా రులు దానికి నోటీసు అతికించడంతో పాటు సీజ్‌ చేసి వెళ్లిపోయారు. అందులో అనేకమంది రైతులు, వ్యాపారులకు చెందిన ఉత్పత్తులున్నాయి. ఇప్పుడు వాటిని తీసుకువెళ్లడానికి వారొచ్చినా అధికారులు మాత్రం తాళాలు తీయడం లేదు. కోల్ట్‌ స్టోరేజీ మూసేశామని చెప్పి వెనక్కి పంపేస్తుండడంతో రైతులు, వర్తకులు లబోదిబోమంటున్నారు.
 
ఏమైనా లావాదేవీలుంటే యాజమాన్యం, మార్కెట్‌ కమిటీ చూసుకోవాలి కానీ తమ ఉత్పత్తులను స్తంభింపజేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా, కోల్డ్‌ స్టోరేజీ యాజమాన్యం గతంలో కొంతకాలం అద్దె చెల్లించలేదని, ఆ తర్వాత మొత్తం కట్టారని, అందుకే నోటీసు ఇచ్చామని మార్కెట్‌ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. అద్దె బకాయి లేనప్పుడు ఎలా సీజ్‌ చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా....‘దయచేసి ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు, ఇంతకుమించి ఏమీ మాట్లాడలేం’ అని పేర్కొన్నారు.
 
 
ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ, ‘‘నా కుటుంబ సభ్యులు బతుకుతెరువు కోసం మార్కెట్‌ కమిటీ వద్ద స్థలం 30ఏళ్లకు లీజుకు తీసుకుని యార్డులో కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. మార్కెట్‌ కమిటీకి డిపాజిట్‌ కూడా చెల్లించాం. అద్దె బకాయి కూడా లేదు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అకస్మికంగా కోల్డ్‌స్టోరేజ్‌ను సీజ్‌ చేయడం అన్యాయం. కేవలం రాజకీయ కక్షతోనే నా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న కోల్డ్‌స్టోరేజీ సీజ్‌ చేసినట్టు స్పష్టంగా అర్థమ వుతోంది. దీనిపై మా కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించనున్నారు.
 
శాసనమండలిలో బిల్లులను అడ్డుకున్నామన్న కక్షతో మా బతుకుపై కొట్టారు. చేతనైతే అభివృద్ధి చేసి చూపించాలే కానీ ప్రభుత్వం ఇటువంటి దిగజారుడు పనులకు పాల్పడడం సబబు కాదు. ఇప్పటికీ నా డిమాండ్‌ ఒక్కటే. అమరావతిలో రాజధాని ఉంచి వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయాలి’’ అని పేర్కొన్నారు. కాగా, ఇక్కడి మార్కెట్‌ యార్డులో అనేకమంది అద్దె చెల్లించకుండానే చాలాకాలంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారికి ఎవరికీ నోటీసులు ఇవ్వకుండా కేవలం ఈ కోల్ట్‌ స్టోరేజీకి మాత్రమే నోటీసులు ఇచ్చి సీజ్‌ చేయడం గమనార్హం.
Link to comment
Share on other sites

On 1/26/2020 at 8:01 PM, koushik_k said:

Sad Sad..  I hope we take revenge on opposition instead of distributing white roses once we get back in power 

evarikaina prajalu 1-2 chances isthaaru. already 3 times 14+ years CM ga chance vachhindi. 

Link to comment
Share on other sites

1 hour ago, Bollu said:

Urgent ga cbn ki Telegram cheyandi cbn ki party inko sari power loki radhu ani db pundits chepparu ani, party close chesukontaru. Unnecessary ga efforts pettaddu ani ground level report telisina medavulu salaha icharu ani.

:roflmao:heard many such stories back in 2009. These people don’t Change!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...