Jump to content

పాక్‌ వద్ద పది.. భారత్‌ వద్ద నాలుగే..!


KING007

Recommended Posts

పాక్‌ వద్ద పది.. భారత్‌ వద్ద నాలుగే..!

 కేటాయింపులు లేక కుదేలవుతున్న వాయుసేన
 ఆశలన్నీ బడ్జెట్‌2020పైనే

పాక్‌ వద్ద పది.. భారత్‌ వద్ద నాలుగే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా ఒక 'సైనిక పక్క ఆధునికీకరణ వేగంగా చేసుకొంటూ పోతుండగా.. భారత్‌ మాత్రం  నత్తనడకన ఆధునికీకరణ చేస్తోంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఆధునికీకరణ దేశ అవసరంగా పేర్కొంటున్నా.. ఆ మేరకు కేటాయింపులు మాత్రం ఉండటంలేదు. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం నేవీ చీఫ్‌ ఒక అంశాన్ని లేవనెత్తారు. దళాలు తమ ప్రాధాన్యాల ఎంపికలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు. వనరులు తగ్గిపోతుండటంతో ఒత్తిడి పెరిగి ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. వాయుసేన పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలైన అవాక్స్‌(ఎయిర్‌బోర్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌) అమర్చిన విమనాలు భారత్‌ వద్ద నాలుగు ఉండగా.. పాక్‌ వద్ద 10 వరకు ఉన్నాయి. ఇది ప్రమాదకర పరిణామం.

తగ్గుతున్న నావికాదళం..

దేశ అవసరాలకు తగ్గట్లు 2027నాటికి భారత్‌ వద్ద 200 యుద్ధనౌకలు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2027నాటికి కేవలం 175 మాత్రమే సమకూరే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దళం వద్ద 130 యుద్ధనౌకలు మాత్రమే ఉన్నాయి. మరో 50 వరకు నిర్మాణం, వివిధ దశల్లో ఉన్నాయి. మరోపక్క రక్షణ బడ్జెట్‌లో నావికాదళం వాటా 18శాతం(2012లో) నుంచి 2019-20లో 13శాతానికి పడిపోయింది. కాకపోతే నావికాదళం సబ్‌మెరైన్‌ విభాగాన్ని బలోపేతం చేసే సమయంలో ఈ తగ్గుదల కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. 1980ల్లో భారత్‌ వద్ద 21 సబ్‌మెరైన్లు ఉన్నాయి.. ఇప్పుడు వాటి సంఖ్య 15కు పడిపోయింది. కాకపోతే అరిహంత్‌, చక్ర వంటి అణుశ్రేణి జలంతర్గాములు ఉండటం ఒక్కటే ఊరటనిచ్చే చర్య. ప్రస్తుతం ఉన్న వాటిల్లో కూడా చాలా వాటి జీవిత కాలం చరమ దశకు వచ్చింది. మరోపక్క చైనా మాత్రం దాదాపు 65 సబ్‌మెరైన్లతో భారత్‌పై కన్నేసి ఉంచింది. 

అరాకొరా నిధులు..

రక్షణ నిధుల్లో సింహభాగం కేవలం జీతాలు, పింఛన్లకే వెళ్లిపోతుండటంతో అధునికీకరణ ముందుకు సాగటంలేదు. ఒక వేళ కేటాయించినా అప్పటికే చేసిన కొనుగోళ్లకు చెల్లింపులకు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఒక సారి  భారీ కొనుగోళ్లు చేపడితే మరికొన్నేళ్లు కొత్త ఆయుధాలు ఊసెత్తలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తొలిసారి బడ్జెట్‌ రూ.3లక్షల కోట్లను దాటింది. కానీ ఇది జీడీపీలో 2శాతం కంటే తక్కువ. మరోపక్క చైనా మాత్రం తన జీడీపీలో 3శాతం వరకు రక్షణ రంగంపై ఖర్చు చేస్తోంది. ఇక పాకిస్థాన్‌ అయితే ఏకంగా 3.5శాతం వెచ్చిస్తోంది. భారత్‌లో ప్రతి 1000 మంది ప్రజలకు 1.25 మంది సైనికులు ఉండగా.. చైనాలో ప్రతి 1000 మందికి 2.23 మంది సైనికులు.. పాక్‌లో 4.25 మంది సైనికులు ఉన్నారు. ఈ లెక్కన భారత్‌ దళాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. 
దిగుమతి చేసుకొనే రక్షణ రంగ ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీని తొలగించినట్లు గత బడ్జెట్‌లో సీతారామన్‌ వెల్లడించారు. ఈ నిర్ణయంతో దాదాపు రూ.25వేల కోట్ల వరకు ఆదా అయ్యే పరిస్థితి నెలకొంది. 

పడిపోతున్న వాయుసేన బలం..

మరోపక్క వాయుసేన పరిస్థితి ఏమీ అంత ఘనంగా లేదు. గత ఏడాది మూలధన కేటాయింపుల్లో వాయుసేనకు 38శాతం దక్కాయి. అంటే సుమారు రూ.39,303 కోట్లన్నమాట. ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద వాయుసేన బలం నానాటికీ తగ్గిపోతోంది. 42స్క్వాడ్రన్ల బలం అవసరం కాగా.. ప్రస్తుతం అది 28కు చేరింది.. భవిష్యత్తులో ఇది ఇంకా వేగంగా తగ్గిపోనుంది. వాయుసేన 104 విమానాల కొనుగోలుకు మొదలుపెట్టిన ప్రయత్నాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరోపక్క దేశీయ తేజస్‌ మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. రాఫెల్‌ యద్ధవిమానాల రాక ఒక్కటే వాయుసేనకు కొంత ఊరటగా మిగిలింది. ప్రభుత్వం కనుక ఇప్పుడే మేల్కొని  కేటాయింపులు పెంచి 104 విమానాల కొనుగోలును కొలిక్కి తీసుకొని రాకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. 
పాక్‌పై భారత్‌కు ఉన్న ఆధిపత్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది.. కార్గిల్‌ యుద్ధంలో ఈ లోపాలు కనిపించినా.. బాలాకోట్‌ అనంతరం దాడుల్లో మాత్రం స్పష్టంగా కనిపించాయి. యాంటీ జామింగ్‌ పరికరాలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇక పాక్‌ వద్ద విమానాలపై అమర్చే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవాక్స్‌లను పాక్‌ స్వీడన్‌ నంచి మరో నాలుగు కొనుగోలు చేసింది. దీంతో ఈ రకమైన విమానాల సంఖ్య పాక్‌ వద్ద 10కి  చేరింది.. భారత్‌ వద్ద మాత్రం ఇలాంటివి కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. డీఆర్‌డీవో నేత్ర పేరుతో ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది... అది పూర్తయ్యే వరకు రక్షణ పరిస్థితి ఏమిటో అర్థం కాదు. ఈ నేపథ్యంలో భారత్‌ మరో రెండు కొనుగోలు చేసేందుకు యత్నాలు ప్రారంభించింది. 
మరోపక్క భారత్‌ ప్రాజెక్టు 75 కింద 6 డీజిల్‌ సబ్‌మెరైన్లను నిర్మించాలని భావిస్తోంది. దీనికి రూ.50వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది.  చైనా 2049లోపు 10 విమాన వాహక నౌకలను సిద్ధం చేయనుంది. అప్పటి కల్లా భారత్‌ సబ్‌మెరైన్‌ దళాన్ని సిద్ధం చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. భారత్‌ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా మూడో యుద్ధనౌక నిర్వహణ తలకు మించిన భారంగా మారనుంది. సైన్యానికి తేలిక పాటిక రవాణా  హెలికాప్టర్ల కొరత కూడా దీనిని ఈ బడ్జెట్‌లో తీర్చాల్సి ఉంది.   ఈ నేపథ్యంలో ముఖ్యంగా వాయుసేన, నావికాదళాన్ని బలోపేతం చేసేదిశలో భారత్‌ బడ్జెట్‌ ఉంటుందని భావిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ పదవిని ఏర్పాటు చేయడంతో గతంలో వలే కొనుగోళ్ల ఆలస్యం అయ్యే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వం నిధులను అందుబాటులోకి తెస్తే దళాల ఆధునికకీరణ పట్టాలకెక్కుతుంది. 

Link to comment
Share on other sites

It is hard to understand India’s preferences in the modern world. 
 

On one hand we have excellent space organization and the other hand it is failing miserably in securing the borders. India’s first preference should be installing anti jamming systems. 

Link to comment
Share on other sites

Bokka grow avuthadi india BJP rule lo...Indian army will never get any modern weapons. US vallu india ni regional partner ga China paiki thosthunnaru. aa China vallu anduke Pak ki money and resources ichi India paiki thosthunnaru........China is taking up entire responsibility to bring india kashmir issue in UN security council meetings. it is trying table this agenda in next 3 months. 

inko pakka China is investing $60 Billion dollars in Pak to counter india in next 3 years. Daaniki thodu China is tightening India's growth by taking control of all major ports in sri lanka, bangladesh, myanmar, Iran, pak. ee BJP govt lo use less leaders thappithe oka smart leader kuda ledu. Already India Bonds are faltering on many international markets. in next budgets india is trying to borrow 200 billion dollars from international markets but response is not going to be great like it used to before. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...