Jump to content

అసెంబ్లీకి హాజరుకాకూడదని టీడీపీ నిర్ణయం


rajanani

Recommended Posts

అసెంబ్లీకి హాజరుకాకూడదని టీడీపీ నిర్ణయం 

అమరావతి: శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన దౌర్జన్యం విషయంలో తదుపరి కార్యాచరణపై టీడీఎల్పీ భేటీలో చర్చించనున్నారు. తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని టీడీపీ ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ చైర్మన్‌ షరీఫ్‌ తన నిర్ణయం ప్రకటించిన వెంటనే శాసనమండలిలో చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటనలు చోటుచేసుకున్నాయి. 
చైర్మన్‌ నోటి నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ఒకమంత్రి సైగ చేయగానే... వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరుగెత్తుకుంటూ చైర్మన్‌ వద్దకు వెళ్లి ఆయన చదువుతున్న పేపర్లను ముక్కలు ముక్కలుగా చించారు. మరో వైపు నుంచి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ చైర్మన్‌ సీటు వద్దకు వెళ్లి రెండు చేతులతో ఆయన కదలకుండా కట్టడి చేశారు. ఈలోపు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కొడాలి నాని టేబుల్‌ పైకి ఎక్కి చైర్మన్‌ ముందు ఉన్న బల్లను చేతులతో చరుస్తూ ఆగ్రహం ప్రదర్శించారు. వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Good decision. Ninna odipoyamane ukrosham tho decoit batch ee roju Babu gari meeda attack chesina ascharyam ledu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...