Jump to content

Rule 71 won


SREE_123

Recommended Posts

మండలిలో నెగ్గిన తెదేపా పంతం!

మండలిలో నెగ్గిన తెదేపా పంతం!

అమరావతి: ఏపీ శాసన మండలిలో తెదేపా పంతం నెగ్గింది. రూల్‌ 71పై చర్చకు ఛైర్మన్‌ షరీఫ్‌ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ బిల్లును, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. ఛైర్మన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా సభ్యులు పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. రూల్‌ 71పై చర్చకు నోటీసు ఇచ్చినా బిల్లులను పరిగణనలోకి తీసుకోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఛైర్మన్‌ స్పందిస్తూ రూల్‌ 71పై చర్చ ప్రారంభించాలని సూచించారు. తెదేపా సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ చర్చను ప్రారంభించారు. రూల్‌ 71పై చర్చకు తెదేపాకు రెండు గంటల సమయాన్ని ఛైర్మన్‌ కేటాయించారు. మరోవైపు మండలిలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటుండటంతో గ్యాలరీలు ఎమ్మెల్యేలతో నిండిపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి మండలి సమావేశాలను తిలకిస్తున్నారు.

మండలిలో నెగ్గిన తెదేపా పంతం!

Link to comment
Share on other sites

1 minute ago, dusukochadu said:

Only a temporary delay. 

Next move will be from Jaggad's side. 

We have to wait and see. 

repu morning ki 8 mlc ni konestaadu..appudu tdp no.19...jaggadi no. 21... 8X50cr aynaa pedaatadu ...

Link to comment
Share on other sites

ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా కూడా ఓడిపోయింది: చంద్రబాబు
21-01-2020 23:02:01
 
 
637152446050822106.jpg
అమరావతి: ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా కూడా ఓడిపోయిందని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల బిల్లులపై బుధవారం చర్చ కూడా పెట్టకూడదని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లులపై ఓటింగ్‌ పెడితే ఇతర సభ్యులు కూడా తమకు మద్దతుగా నిలుస్తారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేదని దీమా వ్యక్తం చేశారు. తమ దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఓటింగ్‌లో గెలవని ప్రభుత్వ ప్రతిపాదన బుధవారం ఎలా నిలుస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...