Jump to content

Iran vs America


KING007

Recommended Posts

ట్రంప్‌ ఆదేశాలతోనే...

బాగ్దాద్‌ విమానాశ్రయంపై దాడి తమ పనేనని ధ్రువీకరించిన అమెరికా

ట్రంప్‌ ఆదేశాలతోనే...

వాషింగ్టన్‌: బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడి తామే చేసినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ధ్రువీకరించింది. ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్‌ను చంపాలన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకే ఈ దాడి జరిపినట్లు వెల్లడించింది. జనరల్‌ సోలెమన్‌ మృతిని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కూడా ధ్రువీకరించింది. అమెరికా వైమానిక దళాలలకు చెందిన హెలికాప్టర్లే దాడి చేశాయని ఆరోపించింది. దాడి జరిగిన కొద్దిసేపటికే ట్రంప్‌ అమెరికా జాతీయ జెండాను ట్విటర్‌లో ఉంచడం గమనార్హం. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు దాదాపు నాలుగు శాతం మేర పెరిగాయి.

ట్రంప్‌ ఏమని ఆదేశించారు...

ఇరాక్‌లో ఉన్న తమ బలగాల్ని రక్షించుకునేందుకు ఖాసీంని చంపాలని ట్రంప్ ఆదేశించినట్లు పెంటగాన్‌ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకే అమెరికా సైనిక వర్గాలు స్వీయ రక్షణలో భాగంగా దాడి చేయాల్సి వచ్చిందని తెలిపింది. భవిష్యత్తులో ఇరాన్‌ చేయాలనుకుంటున్న మరిన్ని దాడుల్ని నిరోధించాలనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరుల్ని రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని పేర్కొంది. తాజా దాడిలో ఇరాక్‌ తిరుగుబాటు సంస్థ పీఎంఎఫ్‌ డిప్యూటీ కమాండర్‌ అబు మహదీ అల్‌-ముహందిస్ సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌నకు చెందిన మరికొంతమందిని అమెరికా బలగాలు బాగ్దాద్‌లో బంధించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

ఇటీవల ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్‌ మద్దతున్న నిరసనకారులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడున్న అమెరికా బలగాలతో తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. దీనిపై స్పందించిన అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌.. అమెరికావాసులపై జరిపే దాడిని ఏమాత్రం సహించేది లేదన్నారు. దాడికి ఇరానే కారణమని ఆరోపించారు. తప్పకుండా ప్రతీకార చర్య ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఇరాన్‌ తమ చర్యల్ని నిలిపివేయాలని హితవు పలికారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

ఎవరీ ఖాసీం సోలెమన్‌...

ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌లో కీలక నిఘా విభాగం అయిన ఖుద్స్‌ ఫోర్స్‌కి మేజర్‌ జనరల్‌ ఖాసీం సోలెమన్‌ 1998 నుంచి అధిపతిగా ఉన్నారు. సరిహద్దు వెలుపల జరిపే దాడులు ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చడం, ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌పై పోరులో ఖాసీం కీలక పాత్ర పోషించినట్లు చెబుతుంటారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమనెయ్‌కి ఖాసీం నేరుగా రిపోర్ట్‌ చేస్తారు. 1980లో జరిగిన ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధంలో తొలిసారి ఖాసీం వెలుగులోకి వచ్చారు.

 
అమెరికా చర్యని తిప్పికొడతాం: రౌహానీ

అమెరికా చర్యని తిప్పికొడతాం: రౌహానీ

టెహ్రాన్‌: తమ దేశ నిఘా విభాగం అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌ హత్య నేపథ్యంలో అమెరికాపై ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇరాన్‌ సహా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు అమెరికాపై తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటాయని హెచ్చరించారు. నేరపూరితమైన అమెరికా చర్యని తప్పకుండా తిప్పికొడతామన్నారు. ఈ మేరకు ఆయన తన సందేశాన్ని ఆ దేశ అధికార వెబ్‌సైట్‌లో ఉంచారు. 

మరోవైపు సోలెమన్‌ హత్య నేపథ్యంలో ఇరాక్‌ వీధుల్లో ప్రభుత్వ వ్యతిరేకదారులు సంబరాలు జరుపుకొంటున్నారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. గత కొన్ని నెలలుగా బాగ్దాద్‌లో వారి ఆందోళనలకు వేదికగా మారిన తాహిర్‌ స్క్వేర్‌లో సంబరాలు జరుపుకొంటున్నారని సమాచారం. నినాదాలు చేస్తూ.. ఇరాక్‌ జాతీయ పతాకాలతో ఊరేగింపు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సైతం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు

సోలెమన్‌ మృతి.. సంబరాల్లో ఇరాకీలు

వీడియో పోస్ట్‌ చేసిన అమెరికా విదేశాంగ మంత్రి

సోలెమన్‌ మృతి.. సంబరాల్లో ఇరాకీలు

వాషింగ్టన్‌: ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సోలెమన్‌ను అమెరికా హతమార్చడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. అమెరికా చర్యకు ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌ గట్టి హెచ్చరికలే చేసింది. అయితే సోలెమన్‌ మృతిపై ఇరాక్‌లో మాత్రం హర్షాతిరేకాలు వెల్లువెత్తినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో కూడా పోస్టు చేశారు. 

ఆ వీడియోలో కొందరు యువకులు ఇరాక్‌ జాతీయ జెండా పట్టుకుని ఆనందంతో వీధుల్లో పరిగెత్తుతున్నట్లుగా ఉంది. ‘ఇరాకీలు.. ఇరాకీలు.. సోలెమన్‌ ఇక లేడని తెలిసి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆనందంలో వీధుల్లో డ్యాన్స్‌ చేస్తున్నారు’ అని పాంపియో ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వీడియో సోర్స్‌ గానీ.. ఎక్కడ చిత్రీకరించారన్న వివరాలను మాత్రం పాంపియో వెల్లడించలేదు. 

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ విమానాశ్రయంపై అమెరికా జరిపిన రాకెట్‌ దాడుల్లో ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్‌ హతమైన విషయం తెలిసిందే. ఈ దాడికి పెంటగాన్‌ ధ్రువీకరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు సోలెమన్‌ను హతమార్చినట్లు వెల్లడించింది. విదేశాల్లో ఉన్న తమ సిబ్బందిని రక్షించుకునేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇరాక్‌, ఇతర ప్రాంతాల్లో అమెరికా దౌత్యవేత్తలు, సిబ్బందిపై దాడులకు జనరల్‌ సోలెమన్‌ కీలక ప్రణాళికలు రచించేవారని పేర్కొంది. ఇటీవల బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై జరిగిన దాడిని కూడా సోలెమన్‌ చేయించాడని తెలిపింది. కాగా.. అమెరికా చర్యకు ఇరాన్‌ దీటుగా బదులిచ్చింది. ‘తీవ్ర పత్రీకార దాడి’ తప్పదని ఆ దేశ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖొమైనీ హెచ్చరించారు. 

 

 

 

 

 

Link to comment
Share on other sites

అమెరికా పౌరులారా.. ఇరాక్‌ వదిలి వెళ్లండి 

అమెరికా పౌరులారా.. ఇరాక్‌ వదిలి వెళ్లండి

బాగ్దాద్‌: ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సోలెమన్‌ను అమెరికా హతమార్చడంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాక్‌లోని తమ పౌరులకు అమెరికా అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా పౌరులు తక్షణమే ఇరాక్‌ వదిలి వెళ్లిపోవాలని బాగ్దాద్‌లోని యూఎస్‌ ఎంబసీ కోరింది. ‘అమెరికా పౌరులు వెంటనే వాయుమార్గం ద్వారా దేశం విడిచి వెళ్లండి. అది సాధ్యం కాకపోతే కనీసం రోడ్డు, రైలు మార్గం ద్వారా అయినా ఇతర దేశాలకు వెళ్లండి’ అని ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా ఈ ఉదయం వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సోలెమన్‌ సహా ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో ఇరాక్‌ ఉన్నత స్థాయి కమాండర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అమెరికా చర్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్‌.. ప్రతీకార దాడి తప్పదని హెచ్చరించింది. మరోవైపు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. అమెరికా దాడిని కొన్ని దేశాలు సమర్థించగా.. మరికొన్ని దేశాలు ఆందోళనల వ్యక్తం చేశాయి.

Link to comment
Share on other sites

4 hours ago, ramntr said:

Us ki Iran ki enemity enti... Iran is one such developed Muslim country anta re.... 

LongLong ago,sooo Long ago... Iran nuclear program start chesi uranium enrichment chesukuntu velthundhi (valla defense ki ani anukundham) kani prapancham (USA) danini "Danger" view point tho chusindhi. So Iran medha trade , banking and other financial sanctions vesaru... result of that, valla economy pumpuhar ayendhi,with inflation all time high...  Ee time loo Obama oka deal chesadu, vallu uranium enrichment capacity building tagisthe, sanctions sadalistham ani.. Iran daniki oopukoni deal ok chesindhi.... All cool anukunaru. USA allies like Britain, Germany, France vellu chala kush endhuku ante Iranian oil medha vella companies kuda nadusthaye.

Kani trump thata vachi malli sanctions vesadu. Actually Iran, valla neighboring countries ayena Iraq (vomeric's girlfriend) , Syria, Lebanon & Yemen loo rebels ki backing esthu internal civil wars lantivi create chesthu , Iranian influence penchukuntundhi... eemadhya kalam loo koncham baga intensify chesaru...Vetanitini co-ordinate chesevade , evala padina wicket "Suleimani" ankul.  very powerful guy in middle eastern world.

Ee topic medha chepali ante chala vundhi... multi-dimensional ... like vomerican military... US elections 2020, trump thatha answerable to lot of things... and as brother rightly mentioned OIL also plays major role. recently Saudi Oil facility medha attack jarigindhi... they say that, Iran did it. This has irked lot of stake holders. 

Saudi , UAE, Qatar, Bahrain, Kuwait evi ani oil rich countries... world ki supply aye vella oil ...  Iran and oman madhyaloo vunna 21 mile sea opening  which is called "Strait of Hormuz" dwara pass aye prapanchaniki supply avuthundhi ... This is the most critical Chockpoint in the world...   So ee USA sanctions valla frustrate avuthuna Iran, Ee  "Strait of Hormuz" critical junction ni block chestham ani bedirinchindhi... adhe jarigithe,world economies medha impact vuntundhi.

Vella gilludu ekkuva avuthundhi ani... trump thatha ki thochindhi chesadu.

Epudu Iran retaliate aye , emana drastic steps tesukunte... cinema rasotharam ga vuntundhi... India ki kuda impact vuntadhi... petrol tank full chesukoni petukondi .. just saying..:) 

Link to comment
Share on other sites

అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడి

అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడి

బాగ్దాద్‌: అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడికి దిగింది. ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ బలగాలు క్షిపణులతో దాడికి దిగాయి. ఇరాక్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా ఈ దాడులు జరిపింది. పశ్చిమ ఆసియా నుంచి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాక్‌లోని ఆల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై డజనుకుపైగా క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడింది. ఈ దాడిలో అమెరికా సైనికులకు జరిగిన నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎయిర్‌బేస్‌లపై దాడిని పెంటగాన్‌ ధ్రువీకరించింది. దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది. ఇరాన్‌ క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు. తాజా పరిస్థితులపై ట్రంప్‌ స్వయంగా సమీక్షిస్తున్నారని, సరైన సమయంలో బదులిస్తామని అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్‌కు సమర్పించామని, ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్‌ హౌస్‌ వెల్లడించింది. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది.

Loading video

Link to comment
Share on other sites

ఇరాన్‌ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి?

ఇరాన్‌ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి?

బాగ్దాద్‌: ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ చేసిన క్షిపణి దాడుల్లో 80 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాడుల్లో కనీసం 80 మంది ‘అమెరికా ఉగ్రవాదులు’ మృతిచెందారని ఇరాన్‌ అధికారిక టీవీ పేర్కొనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 

మిలిటరీ కమాండర్‌ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్‌ ఈ క్షిపణి దాడులు చేపట్టింది. ఇరాక్‌లోని అల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై క్షిపణులతో విరుచుకుపడింది. మొత్తం 15 క్షిపణులతో దాడి చేశామని, అన్ని మిసైల్స్‌ లక్ష్యాన్ని చేరుకున్నాయని ఇరాన్‌ మీడియా పేర్కొంది. అమెరికా హెలికాప్టర్లు, మిలిటరీ పరికరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని వెల్లడించింది. ఈ సందర్భంగా వాషింగ్టన్‌కు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ప్రతీకార చర్యలకు దిగితే మరో 100 ప్రాంతాలను లక్ష్యాలుగా చేసుకుంటామని హెచ్చరించింది. 

ఇరాన్‌ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి?

అంతా బాగానే ఉంది: ట్రంప్‌

మరోవైపు ఇరాన్‌ క్షిపణి దాడుల తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని, తాజా పరిస్థితులపై మరికొద్ది గంటల్లో ప్రకటన చేస్తానని వెల్లడించారు. ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌. ఇరాక్‌లోని రెండు సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనల్లో ఎంతమంది చనిపోయారు..? ఎంత నష్టం జరిగిందనేది అంచనా వేస్తున్నాం. ఇప్పటివరకు అంతా ఓకే! ప్రపంచవ్యాప్తంగా మాకు శక్తిమంతమైన, సమర్థమైన సైనిక బలగం ఉంది. బుధవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) దీనిపై నేను ప్రకటన చేస్తా’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 

Loading video

Link to comment
Share on other sites

ఇద్దరి అడుగులు యుద్ధం వైపే..!

ప్రత్యక్ష ఘర్షణ మొదలు.. 80మంది అమెరికన్ల మృతి..?
హ్యాంగర్ల నుంచి బయటకు వచ్చిన ఎఫ్‌-35లు
అగ్నిపర్వతంలా మారిన పశ్చిమాసియా

ఇద్దరి అడుగులు యుద్ధం వైపే..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేక కథనం

పశ్చిమాసియాలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న సులేమానీ ఖననం పూర్తైన తర్వాత నుంచి ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకొనేందుకు అడుగులు వేస్తోంది. మరోపక్క అమెరికా ఏమాత్రం తగ్గడంలేదు. అగ్రదేశం అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి పదునుపెడుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఇరాన్‌, ఇరాక్‌, అమెరికాల్లో పరిణామాలు నాటకీయంగా మారిపోతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ భయాలకు ఆజ్యం పోసేట్లు బుధవారం తాజా ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఒక పౌరవిమానం కూలిపోవడం.. అణుకేంద్రం వద్ద భూప్రకంపనలు.. అంతకుముందు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల ప్రత్యక్ష దాడులతో యుద్ధం ఖాయమనే భయం సర్వత్రా నెలకొంది. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో సంకీర్ణ సేనల సిబ్బంది మృతిచెందినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఐఆర్‌జీసీ ప్రోత్సాహక ముఠాలే అమెరికాపై దాడి చేశాయి.. ఇప్పుడు ఇరాన్‌ అధికారిక బలగమైన ఐఆర్‌జీసీ దాడి చేయడం అంటే ప్రత్యక్షంగా తలపడటమే.

నిన్న కెర్మాన్‌లో సులేమానీ అంతిమయాత్రలో పాల్గొన్న ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ నేత హుస్సేన్‌ సలామీ.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనారు. సులేమానీ హత్యకు ప్రతీకారంగా దాడులు చేపట్టేందుకు ఇరాన్‌ 13 ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెరికాకు తమ ప్రతీకారం భయానక పీడ కలగా మిగిలిపోగలదని ఇరాన్‌ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ షామ్‌ఖానీ హెచ్చరించారు. మరోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశాల్లో పాల్గొనాల్సిన తనకు అమెరికా వీసా నిరాకరించిందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి మొహమ్మద్‌ జవాద్‌ జరీఫ్‌ తెలిపారు.
అమెరికాతో ఐఆర్‌జీసీ ప్రత్యక్ష ఘర్షణ మొదలు..

సులేమానీని హత్య చేసినందుకుగాను అమెరికా సైనిక బలగాలపై ఉగ్రవాద ముద్ర వేస్తూ ఇరాన్‌ పార్లమెంటు ప్రత్యేక బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం అమెరికా బలగాలు, పెంటగాన్‌ ఉద్యోగులు, దాని అనుబంధ సంస్థలు, ఏజెంట్లు, కమాండర్లు, సులేమానీ హత్యకు ఆదేశాలు జారీ చేసిన వారందర్నీ ఉగ్రవాదులుగానే పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఉపరితలం పై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే దాదాపు 20కిపైగా క్షిపణులను ఇరాక్‌లోని అల్‌ అసద్‌ ఎయిర్‌ బేస్‌పై, ఇర్బిల్‌లోని మరో బేస్‌పై ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇరాన్‌కు చెందిన ప్రెస్‌టీవీ కూడా ధ్రువీకరించింది. సులేమానీ మరణం తర్వాత తొలిసారి ఐఆర్‌జీసీ నేరుగా అమెరికా బలగాలతో తలపడినట్లైంది. ఇప్పటి వరకు ఐఆర్‌జీసీ నేరుగా తలపడకుండా ఇరాక్‌లోని పాపులర్‌ మొబలైజేషన్‌ ఫోర్స్‌తో దాడులు చేయించింది. సులేమానీ మరణం తర్వాత ఒకట్రెండు రాకెట్‌ దాడులను పాపులర్‌ మొబలైజేషన్‌ ఫోర్స్‌ నిర్వహించింది. రాత్రి జరిగిన దాడిని తామే చేసినట్లు ఐఆర్‌జీసీ కూడా ధ్రువీకరించింది. సమయం గడిచేకొద్దీ వివరాలను కూడా వెల్లడిస్తామని పేర్కొంది. అల్‌ అసద్‌ స్థావరంలో దాదాపు 1,500వరకు సంకీర్ణదళాల సిబ్బంది ఉన్నట్లు సమాచారం. నిన్న జరిగిన దాడిలో దాదాపు 80 మంది వరకు మరణించి ఉండొచ్చని ఇరాన్‌కు చెందిన ప్రెస్‌టీవీ ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొంది. ఈ విషయాన్ని ఇరాన్‌ స్టేట్‌ టీవీ కూడా ధ్రువీకరిస్తోంది. భారీ సంఖ్యలో అమెరికా ఆయుధాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. మరోపక్క ‘కుర్దిస్థాన్‌ 24’ జర్నలిస్టులు మాత్రం ఎవరూ మరణించలేదని చెప్పటం విశేషం.  ఈ దాడిపై ట్రంప్‌ నర్మగర్భంగా స్పందించడం చూస్తుంటే అమెరికా మరో భారీ దాడికి సన్నాహాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఆయన ట్విటర్‌లో ‘‘అంతాబాగానే ఉంది’’ ‘‘రేపు పొద్దున్నే స్పందిస్తా’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ట్రంప్‌ నష్టాన్ని తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసద్‌ బేస్‌పైనే ఎందుకు..

అల్‌ అసద్‌ బేస్‌పై ఐఆర్‌జీసీ దాడులు చేయడానికి చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఇరాక్‌లో అమెరికా 2003లో సద్దాంపై విజయం తర్వాత ఉపయోగించిన తొలి స్థావరం ఇదే. ఇది ఇరాక్‌లో అమెరికాకు ఉన్న  అతిపెద్ద స్థావరాల్లో ఒకటి. గత ఏడాది అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సతీమణితో కలిసి దీనిని సందర్శించారు. 2018 క్రిస్మస్ వేడుకల సందర్భంగా ట్రంప్‌ దంపతులు ఇక్కడికి వచ్చి దాదాపు 3 గంటలకు పైగా గడిపారు. దీన్ని అత్యాధునిక, సురక్షితమైన స్థావరంగా అమెరికా భావిస్తోంది.   

దాడి జరిగిన కొద్దిసేపటికే కూలిన  పౌరవిమానం..

ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ బలగాలు అమెరికా వైమానిక స్థావరంపై దాడి చేసిన కొద్ది సేపటికే ఉక్రెయిన్‌కు చెందిన విమానం ఒకటి టెహ్రాన్‌ ఎయిర్‌పోర్టు వద్దే నేలకూలింది. గాల్లోకి లేచిన రెండు నిమిషాల్లోనే  ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కూలిపోయే ముందు భారీగా మంటల్లో  విమానం చిక్కుకున్నట్లు ఓ వీడియో కూడా విడుదలైంది. దీనిపై భిన్నమైన కథనాలు కూడా వెలువడుతున్నాయి. అమెరికా వైమానిక స్థావరంపై దాడి తర్వాత ప్రతిదాడులు జరుగుతాయని ఇరాన్‌ భావించడం సహజమే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ పొరబాటున ఈ విమానాన్ని కూల్చేసే అవకాశాలు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇది వాస్తవం కాకకపోవచ్చు. కానీ, గతంలో కూడా సమన్వయ లోపంతో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ ప్రమాదంతో ఇరాన్‌ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంత దేనికి బాలాకోట్‌ అనంతరం పాక్‌తో వైమానిక ఘర్షణ సమయంలో మన సైనిక హెలికాప్టర్‌ను మన గగనతల రక్షణ వ్యవస్థే పట్టపగలు కూల్చేసినట్లు వార్తలొచ్చాయి.

ఎఫ్‌-35లను బయటకు తీసిన అమెరికా..!

ఇద్దరి అడుగులు యుద్ధం వైపే..!

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన తురుపు ముక్క ఎఫ్‌-35 స్టెల్త్‌ జెట్‌ విమానాలను బయటకు తీసింది. ఉటలోని హిల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్థావరంలో ఉన్న 388వ, 419వ ఫైటర్‌ వింగ్స్‌ భారీగా యుద్ధ సన్నద్ధత విన్యాసాలు చేశాయి. ఈ క్రమంలో భాగంగా దాదాపు 52 ఎఫ్‌-35ఏ విమానాలు ‘ఎలిఫెంట్‌ వాక్‌’ను నిర్వహించాయి. ఒకే రన్‌వే పై నుంచి చాలా యుద్ధవిమనాలు తక్కువ దూరంతో టేకాఫ్‌ అయ్యేలా దీనిని నిర్వహిస్తారు. పూర్తిస్థాయి యుద్ధం వస్తే ఎలా స్పందించాలనే అంశంలో భాగంగా దీన్ని చేపట్టారు. ఇరాన్‌తో ఉద్రిక్తల సమయంలో ఇన్ని యుద్ధవిమనాలు రన్‌వేపైకి రావడం గమనార్హం. ‘మా వద్ద దాదాపు రెండు ట్రిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ న్యూ ఆయుధాలు ఉన్నాయి’ అని ట్వీట్‌ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఎలిఫెంట్‌ వాక్‌ నిర్వహించడం గమనార్హం.

Link to comment
Share on other sites

15 minutes ago, ramntr said:

 vadu isis enemy ey ayina vadi meeda ఎందుకు us ki kachi.... ఈ whole episode lo us de wrong anela vundi news chusthanna దాన్ని బట్టి, ఒబామా gadu much better anukunta ga... 

US embassy meda daadi chesaru,  adhi cheyinchindi Suleiman ye ani Trump kaksha kattadu vadi meda....  Backend lo enni jarigayo no idea.... 

Link to comment
Share on other sites

1 hour ago, KING007 said:

US embassy meda daadi chesaru,  adhi cheyinchindi Suleiman ye ani Trump kaksha kattadu vadi meda....  Backend lo enni jarigayo no idea.... 

వాడిని most wanted list lo announce చేశారా n Un n other countries agreed aa.. 

Link to comment
Share on other sites

2 hours ago, ramntr said:

 vadu isis enemy ey ayina vadi meeda ఎందుకు us ki kachi.... ఈ whole episode lo us de wrong anela vundi news chusthanna దాన్ని బట్టి, ఒబామా gadu much better anukunta ga... 

Obama is anti Israel and pro Iran...Trump is out and out pro Israel....

Link to comment
Share on other sites

12 minutes ago, kishbab said:

Iran atomic power unna country anknta. Full pledged war ki digithe us ki kuda pedda bokka padtadi

No way us has geographic advantage over attacks from outside ....it's advantages is no land border with any enemy and neighbors are mere puppets or friends of it ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...