Jump to content

ఏపీ 5.. తెలంగాణ 11


kurnool NTR

Recommended Posts

ఈనాడు, దిల్లీ: సుపరిపాలన దినోత్సవం సందర్భంగా కేంద్రం ఓ సూచీని విడుదల చేసింది. వ్యవసాయం.. అనుబంధ రంగాలు, వాణిజ్యం, పరిశ్రమలు, మానవ వనరుల అభివృద్ధి, ప్రజారోగ్యం, ప్రభుత్వ మౌలిక వసతులు, సదుపాయాలు, ఆర్థిక పాలన, సామాజిక సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలను పరిగణిస్తూ శాస్త్రీయంగా దీనిని రూపొందించింది. ముసాయిదా నివేదికను కేంద్రం 2018 నవంబరు 6న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది. వాటి నుంచి లభించిన స్పందన ఆధారంగా సుపరిపాలన సూచీకి రూపమిచ్చింది. దిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ దానిని ఆవిష్కరించారు. సూచీకి సంబంధించి దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు. అందులో పెద్ద రాష్ట్రాలు 18, చిన్న రాష్ట్రాలు 11 (జమ్మూ- కశ్మీర్ ఇందులోనే ఉంది), ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. ఎంపిక చేసుకున్న పది పాలనాంశాలకు ఒక్కో దానికి ఒక్కో మార్కు కింద మొత్తం పది మార్కులకు ర్యాంకింగ్ ఇచ్చారు. పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్ 5.05 మార్కులతో 5, తెలంగాణ 4.83 మార్కులతో 11వ స్థానాల్లో నిలిచాయి.

* వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ 0.48 స్కోర్ తో ఆరు, 0.29 స్కోర్ తో తెలంగాణ 17వ స్థానాల్లో నిలిచాయి.

* పరిశ్రమలు, వాణిజ్యంలో 0.94 స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ రెండు, 0.93 స్కోర్ తో తెలంగాణ మూడో స్థానం పొందాయి.

* మానవ వనరుల అభివృద్ధిలో 0.58 స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ తొమ్మిది, 0.55 స్కోర్ తో తెలంగాణ 11వ స్థానాల్లో నిలిచాయి.

* ప్రజారోగ్యం విషయంలో 0.63 స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ ఏడు, 0.63 స్కోర్ తో తెలంగాణ ఎనిమిది స్థానాలు సాధించాయి.

* మౌలిక వసతులు, సదుపాయాల్లో 0.70 స్కోర్ తో తెలంగాణ ఆరు, 0.66 స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ ఎనిమిది స్థానాల్లో నిలిచాయి.
 

* ఆర్థిక పాలనలో 0.63 స్కోర్ తో తెలంగాణ మూడు, 0.55 స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ ఏడు స్థానాలు సాధించాయి.

* సామాజిక సంక్షేమం, అభివృద్ధి విషయంలో 0.57 స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ మూడు, 0.46 స్కోర్ తో తెలంగాణ ఎనిమిది స్థానాలు అందుకున్నాయి.

TS best state anta kada welfare schemes and development lo 😛😛😛

Link to comment
Share on other sites

3 minutes ago, Npower said:

@Kurnool NTR bro.... how is the sentiment in your Kurnool area.  What people thinking about Kurnool getting capital.

They have never demanded for capital but demands for High court has been there for several years, TDP should have taken move to establish Highcourt bench atleast. As there are no jobs in the area, automatically people develop sentiments to the proposal of capital.

I am not in Kurnool to know the exact feelings of different sections of people. In my view Amaravathi farmers have genuine reason for their protests. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...