Jump to content

మీసేవ కేంద్రాలు బంద్‌


kurnool NTR

Recommended Posts

Another Tuglak act by govt.


జిల్లా సచివాలయం, న్యూస్ టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతూ మీసేవ కేంద్రాల నిర్వాహకులు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నారు. జిల్లాలో 668 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా వివిధ శాఖలకు సంబంధించి 540 సేవలు అందుతున్నాయి. కులం, ఆదాయం, జనన, మరణ తదితర ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు, 1బీ, అడంగల్ చేర్పులు, మార్పులకు రుసుం చెల్లించి సేవలు పొందుతున్నారు. గత 12 ఏళ్లుగా సుమారు ఆరేడు వేల మంది సిబ్బంది వీటిపై ఆధారపడి ఉన్నారు. నూతన గ్రామ సచివాలయాల ఏర్పాటు నేపథ్యంలో వివిధ ధ్రువీకరణ పత్రాలను వీటిలో ఉచితంగా ఇస్తామని చెప్పడంతో... కేంద్రాల నిర్వహణకు, తమ జీవనానికి ఇబ్బంది అని మీసేవ కేంద్రాల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. తమను గ్రామ, వార్డు సచివాలయాల విధుల్లోకి తీసుకోవాలని ముందు నుంచి అడుగుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదనీ.. దీంతో సిబ్బంది వీధిన పడే పరిస్థితి నెలకొందన్నారు. తప్పని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళుతున్నామనీ, ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మీసేవ కేంద్రాలు తెరవబోమని చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...