Jump to content

వైసీపీ తప్పులను సరిదిద్దకండి.. బాబుకు జేసీ సలహాలు


Eswar09

Recommended Posts

ఎవరైనా తప్పుచేస్తుంటే.. లేదా పొరపాటు పడితే సరిదిద్దుకోమని చెప్పడం ధర్మం. ఏ రంగానికికైనా ఇది వర్తిస్తుంది. కానీ రాజకీయాల్లో మాత్రం ఈ సూత్రం వర్తించదంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ తప్పుచేస్తుంటే మనం ఎందుకు చెప్పాలనేది ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ట్రెండ్. "ఎక్కువ తప్పులు చేస్తే వారికే నష్టం కదా? మనమెందుకు సరిదిద్దాలి'' అన్నదే ఇప్పుడు తెలుగుదేశంలో సాగుతున్న అంతర్మథనం. ఏకంగా అధినేత చంద్రబాబుకే కొంతమంది నేతలు ఈ తరహా హితబోధ చేశారు. రాజకీయాల్లో సీనియర్ అయిన చంద్రబాబుకు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
 
 
   చెప్పేవాడికి చాదస్తం ఉన్నా వినేవాడికి వివేకం ఉండాలని పెద్దలన్నారు. కానీ ఈ మాట నేటి రాజకీయాలకు ఏమాత్రం వర్తించడం లేదు. ఉదాహరణకి ఏపీ విషయాన్నే తీసుకోండి. సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరు నెలలు అవుతున్నప్పటికీ ఇంకా వేడి చల్లారలేదు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎలాంటి హోరీహోరీ కొనసాగిందో ఇప్పుడూ అదే వాతావరణం కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 సీట్లు గెల్చుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలు దిశగా వడివడిగా అడుగులేస్తోంది.
 
 
   వాస్తవానికి.. ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టడంతో ఆరు నెలలపాటు జగన్ పాలనను నిశితంగా గమనించాలని తెలుగుదేశం సహా ఇతర రాజకీయ పక్షాలు తొలుత భావించాయి. కానీ ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడటం, సిమెంట్, ఇనుము, ఇటుక వంటి అనుబంధ రంగాలు ఒక్కసారిగా కుదేలవడంతో అన్ని రాజకీయపక్షాలు గొంతెత్తక తప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి అఖిలపక్ష సమావేశాలతోపాటు ఇసుక దీక్షలను కూడా నిర్వహించింది.
 
 
   ఇదొక్కటే కాదు- ఇంకా అనేక విషయాల్లో జగన్‌ సర్కారు నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో టీడీపీ అధినేత స్పందిస్తూ వచ్చారు. పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష, రాజధాని నిర్మాణాల నిలిపివేత వంటి అంశాలపై రాష్ట్ర శ్రేయస్సు రీత్యా చంద్రబాబు తన అభ్యంతరాలు తెలిపారు. ఆయా విషయాల్లో ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోందనీ, ఈ పరిణామం మంచిదికాదనీ మీడియా ముఖంగా కూడా ఆయన చెబుతూ వచ్చారు. అసెంబ్లీ వేదికగా కూడా సర్కారుకి హితవు చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ప్రస్తావించడం వల్ల ఈ అంశాలపై ప్రజల్లోనూ విస్తృతంగా చర్చ సాగడం గమనార్హం!
 
 
  ఇదిలా ఉంటే.. జగన్‌ ప్రభుత్వం తప్పటడుగులను చంద్రబాబు ఎత్తిచూపడం టీడీపీలోని కొంతమంది నేతలకు ఏమాత్రం ఇష్టంలేదు. అనంతపురం మాజీ ఎంపీ, రాజకీయాల్లో సీనియర్ అయిన జేసీ దివాకర్‌రెడ్డి అయితే ఈ అంశాన్ని చంద్రబాబు ముందే నిర్మొహమాటంగా చెప్పేశారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి జేసీ విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో అరగంటసేపు సమావేశమయ్యారు. "తప్పులు ఎక్కువ చేయనివ్వండి. మీరెందుకు తొందరపడి చెబుతున్నారు? ఎన్ని తప్పులు చేస్తే అన్నీ చేయనివ్వండి. ఓటేసిన ప్రజలక్కూడా నొప్పి తెలియాలి కదా?'' అని జేసీ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అంతేకాదు- "గ్రామాల్లో పరిస్థితి మీకర్థం కావడంలేదు. వైసీపీ వర్గాలు మీదమీదకి వస్తున్నాయి. కక్షపూరిత రాజకీయాలు కొనగుతున్నాయి. ప్యాక్షన్ ఉండే గ్రామాల్లో తెలుగుదేశం వర్గాలు ఉండలేకపోతున్నాయి. జగన్ ఎన్ని తప్పులు చేస్తే అంతా మనకి మంచిదే. ఒకసారి గెలిపిస్తే ఏమవుతుందనుకున్న జనానికి ఇప్పటికే తలబొప్పి కట్టింది. పూర్తిగా అందరికీ సినిమా అర్థంకావాలి. అప్పటివరకు మీరు వెయిట్ చేయండి..'' అంటూ చంద్రబాబుకు జేసీ దివాకర్‌రెడ్డి హితబోధ చేశారు.
 
 
   "ఆంధ్రప్రదేశ్‌ను 14 ఏళ్లు పరిపాలించిన ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన నేను రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చెప్పకుండా ఉండలేను కదా?'' అని చంద్రబాబు జేసీ వద్ద వ్యాఖ్యానించారు. దీనిపై దివాకర్‌రెడ్డి స్పందిస్తూ "మనకు 23 సీట్లిచ్చారు. వాళ్లకు 151 సీట్లిచ్చారు. బాధ్యత వాళ్ల మీదే ఉంది. సక్రమంగా పరిపాలించాల్సింది వైసీపీ వాళ్లే'' అని కరాఖండిగా చంద్రబాబుకు చెప్పారు. అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిపోతోందనీ, ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని అనుకున్నవాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారనీ చంద్రబాబు వివరించగా, దీనిపై కూడా జేసీ తనదైనశైలిలో స్పందించారు. "రాష్ట్ర ప్రజలు ఒకసారి చూద్దాం అనుకున్నారు.. మనం కూడా ఒకసారి చూద్దాం..'' అని నవ్వుతూనే బదులిచ్చారు.
 
 
  చంద్రబాబు పేషీలో జరిగిన ఈ విషయాలు బయటికి ఎలా పొక్కాయి అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నా! బాబుతో సమావేశం తర్వాత బయటికొచ్చిన జేసీ దివాకర్‌రెడ్డే ఈ విషయాలను మీడియాకి పూసగుచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన "కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు?'' అని నర్మగర్భంగా చురక అంటించారు కూడా! ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలనీ, మిగతా పాలనంతా వాళ్ల తాత రాజారెడ్డి పాలనలాగే సాగుతోందనీ పరోక్షంగా సెటైర్లు వేశారు. "మీ బస్సులపై దాడులు జరిగాయని అలా మాట్లాడుతున్నారా?'' అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, "వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చిన వారితో బస్సులపై దాడులు చేయిస్తున్నారనీ, ఈ అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటామనీ'' జేసీ స్పష్టంచేశారు. మొత్తానికి దివాకర్‌రెడ్డి చంద్రబాబుకి ఇచ్చిన సలహాని మాత్రం తెలుగుదేశం పార్టీలో అనేక మంది నేతలు ఆఫ్ ద రికార్డ్ సమర్థిస్తున్నారు. "ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చినప్పుడు మధ్యలో మనకెందుకు?'' అన్నదే వారి అభిప్రాయం కూడా!
Link to comment
Share on other sites

Correct ye only when there are 2 parties. But now PK is also raising voice and trying to gain mileage and score marks in neutrals. So, tdp and CBN calm ga vunte...Janasena and BJP will try to hit the roads to criticize Jagan's failures. They will try to protect themselves as if they understand people difficulties and can help them if voted ani.

They also malign TDP again n again in public saying TDP is not opposing Jagan's acts and TDP is not fit for main opposition ani. 

Calm ga vunte cadre and leaders vere parties side chestaru.

Antha easy kadu...to sit quite in these situations. 

Link to comment
Share on other sites

56 minutes ago, Hello26 said:

Correct ye only when there are 2 parties. But now PK is also raising voice and trying to gain mileage and score marks in neutrals. So, tdp and CBN calm ga vunte...Janasena and BJP will try to hit the roads to criticize Jagan's failures. They will try to protect themselves as if they understand people difficulties and can help them if voted ani.

They also malign TDP again n again in public saying TDP is not opposing Jagan's acts and TDP is not fit for main opposition ani. 

Calm ga vunte cadre and leaders vere parties side chestaru.

Antha easy kadu...to sit quite in these situations. 

Calm ga vadileyyamani kaadu. Criticize govt. But prathi issue pattinchukovalsina pani ledu. Leave it to TDP Social media and empower them

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...