Jump to content

‘రెడ్డి’ కాబట్టే ఇలాగా!?


krish2015

Recommended Posts

  • అసెంబ్లీ సాక్షిగా ఎన్‌కౌంటర్‌కు సమర్థనా?
  • హాజీపూర్‌, జడ్చర్ల నిందితులనూ
  • ఎన్‌కౌంటర్‌ చేయాలని చెప్పగలరా?
  • ఆర్థిక నేరాల్లో సత్వర విచారణ చేస్తారా?
  • జగన్‌కు మందకృష్ణ సూటి ప్రశ్నలు
మంగళగిరి, డిసెంబరు 11: తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ తమ సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఆగమేఘాల మీద స్పందిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగితే ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బుధవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ‘‘నిందితులను న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని శాసనసభ సాక్షిగా జగన్‌ సమర్థించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్‌... ఆ హత్యలను సమర్థించడమే కాకుండా, కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పడం శోచనీయం.
 హాజీపూర్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, మృతదేహాలను బావిలో పడవేసిన శ్రీనివాస రెడ్డిని, జడ్చర్లలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కొట్టి చంపిన నవీన్‌ రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని సూచించే సాహసం జగన్‌ చేయగలరా? ఒక రెడ్డిని చంపిన నలుగుర్ని ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు... నలుగురు మహిళలను చంపిన మరో రెడ్డికి అదే శిక్ష ఎందుకు వేయరు?’’ అని మంద కృష్ణ ప్రశ్నించారు. దిశ సామాజిక వర్గం నేపథ్యంలో... ఆయా రాజకీయ పార్టీలలోని రెడ్డి సామాజికవర్గం పెద్దల ఒత్తిడి, పోలీసు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో నలుగురి ఎన్‌కౌంటర్‌ జరిగిందని ఆరోపించారు. వైఎస్‌ హయాంలో 11 మంది గిరిజన మహిళలపై పోలీసు శాఖకు చెందిన వారు అత్యాచారాలకు పాల్పడి హత్యలు చేశారని చెప్పారు.
 
 ఆయేషామీరా తల్లిదండ్రుల ఆవేదన ఇప్పటికీ అరణ్య రోదనగానే మిగిలిందని పేర్కొన్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో తల్లి కూతుళ్లను హత్య చేసి తగులబెట్టారన్నారు. ఈ మూడు కేసుల్లో కేసీఆర్‌ పాలసీని జగన్‌ అమలు చేసి నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం, లేక ఉరి తీయడం చేయగలరా అని ప్రశ్నించారు. ‘‘ఆర్థిక నేరగాళ్లపై తక్షణమే న్యాయ విచారణ జరిపించేందుకు జగన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయగలదా? కేంద్రం చట్టం చేస్తే సమర్థించే దమ్ము ఉందా?’’ అని ప్రశ్నించారు.
 
Link to comment
Share on other sites

Correct ey kadha...

Disha incident lo police chesina pani corectt ey...no doubts..

Why this is not happening with other caste or community girls or women???

Finance/economic criminals like Jagan REDDY should also be punished...public money motham dochukunaaru kadha...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...