Jump to content
Sign in to follow this  
koushik_k

కేసీఆర్‌ చాణక్య నీతి!

Recommended Posts

కార్మికులకు సెప్టెంబరునెల జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులేదని చెప్పిన ప్రభుత్వమే ఒకే ఒక్క రోజులో జీతాలు చెల్లించింది. తన మాట లెక్క చేయకుండా సమ్మెకు వెళ్లిన కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారనీ, ఆర్టీసీని మూసివేస్తామనీ, కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకునే పరిస్థితి లేదనీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చేసిన ప్రకటనలతో దిగులు చెందిన కొంతమంది కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అంటే వారి చావులకు కేసీఆర్‌ ప్రకటనలే కారణమని చెప్పకుండా ఉండగలమా? అలాంటప్పుడు కేసీఆర్‌ శిక్షార్హుడే కదా? తప్పుడు అఫిడవిట్లతో హైకోర్టును తప్పుదారి పట్టించడం కూడా నేరమే అవుతుంది కదా! ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించలేదు. అయినా ఆయనను ఎవరూ తప్పుబట్టలేని పరిస్థితి ఏర్పడటానికి సమస్యకు ఆయన ఇచ్చిన ఫినిషింగ్‌ టచ్‌ కారణం! 
 
గతంలో వరంగల్‌లో యాసిడ్‌ దాడికి పాల్పడినవారిని ఎన్‌కౌంటర్‌ చేసిన చరిత్ర ఉన్న సజ్జనార్‌ పర్యవేక్షణలోనే ఇప్పుడు దిశ నిందితులు కూడా ఎన్‌కౌంటర్‌ అయ్యారు. దీంతో ‘సాహో సజ్జనార్‌’ అంటూ ఆయనను ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతించి ఉండకపోతే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగి ఉండేది కాదు. చాణక్య రాజనీతిని ఒంటబట్టించుకున్న కేసీఆర్‌.. ప్రజలలో భావోద్వేగాలను గమనించి ఎన్‌కౌంటర్‌కు అనుమతించడం ద్వారా శభాష్‌ అనిపించుకున్నారు. ఈ సంఘటనపై నిన్నటివరకు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిపక్షాలు కూడా జరిగింది ఏమిటో తెలిసినా ఎన్‌కౌంటర్‌ను సమర్థించక తప్పలేదు. అందుకే అప్పుడప్పుడు మాత్రమే ప్రజల భావోద్వేగాలను సంతృప్తిపరచాలని చాణక్యుడు చెప్పాడు.  
 
 అప్పుడప్పుడు ప్రజల భావోద్వేగాలను సంతృప్తిపరుస్తుండటం ప్రజలకు ప్రభుత్వాల పట్ల భక్తిని పెంచుతుంది.. ఇది చాణుక్యుడి రాజనీతి! తనను అవమానించిన ధననందుడు అనే రాజును ధిక్కరించి ఆయన సామ్రాజ్యాన్ని కూల్చివేసి చంద్రగుప్తుణ్ని రాజుగా చేసిన మహా మేధావి చాణక్యుడు. చాణక్యుడికే రాజనీతిని బోధించే సత్తా ఉన్న నేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు! ప్రజలలో భావోద్వేగాలు పెచ్చరిల్లే వరకు మౌనంగా ఉండి చివరకు పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆరితేరిన నేతగా కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారు. దీంతో అప్పటివరకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చే ప్రతిపక్షాలు.. కేసీఆర్‌ ఇచ్చే ఫినిషింగ్‌ టచ్‌తో చివరలో చతికిలబడుతున్నాయి. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనే కాకుండా దిశ ఉదంతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాణక్య నీతినే ప్రదర్శించారు. చట్టాలను గౌరవించాలనుకునేవారికి వాయిస్‌ లేకుండా చేశారు. అత్యాచారానికి, ఆపై హత్యకు గురైన దిశ కుటుంబాన్ని సంఘటన జరిగి వారం రోజులైనా పరామర్శించకపోవడంపై జాతీయ మీడియా కూడా కేసీఆర్‌ను తప్పుబట్టింది. అయినా నోరు విప్పని కేసీఆర్‌ పది రోజులకు ఇచ్చిన ఫినిషింగ్‌ టచ్‌ ద్వారా జేజేలు అందుకున్నారు. దిశపై దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారని శుక్రవారం ఉదయమే వార్త గుప్పుమంది. దీంతో ఆసేతుహిమాచలం పులకించింది. శభాష్‌ అంటూ తెలంగాణ పోలీసులను అభినందించింది. 
 
చట్టాలు చేసే ఎంపీలు కూడా చట్టవిరుద్ధంగా జరిగినట్టు అనుమానిస్తున్న ఎన్‌కౌంటర్‌కు మద్దతుగా మాట్లాడారు. సినీ తారలు, ఇతర ప్రముఖులు కూడా తెలంగాణ పోలీసులను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. న్యాయ ప్రక్రియతో సంబంధం లేకుండా ‘తక్షణ న్యాయం’ అనే విధానాన్ని తెలంగాణ పోలీసులు అమలు చేసినా ‘అది తప్పు’.. అనే సాహసం ఎవరూ చేయలేకపోయారు. కారణం ప్రజలలో భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుకోవడమే! నాడు నిర్భయ.. నేడు దిశ వంటి సంఘటనలు జరిగినప్పుడు ఎన్‌కౌంటర్‌ చేసి చంపేయడమే సరైన పరిష్కారం అనే భావన దేశమంతటా వ్యాపించడానికి వ్యవస్థల వైఫల్యమే కారణం! నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష విధించినా ఇంతవరకు అమలు చేయలేదు. దీనికి కారణం న్యాయ ప్రక్రియలో మనం అనుసరిస్తున్న సాగదీత విధానమే! మరణశిక్ష పడినవారికి క్షమాభిక్ష కోరుకునే వెసులుబాటు ఉండటం, సదరు పిటిషన్లపై సత్వరం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల శిక్ష అమలులో జాప్యం జరుగుతోంది. 
 
ఫలితంగా ప్రజలలో అసహనం ప్రబలుతోంది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం వల్ల దేశంలో అత్యాచారాలు జరగవా? అంటే చెప్పలేని పరిస్థితి! నిర్భయ సంఘటన తర్వాత మళ్లీ దిశ ఉదంతం జరిగే వరకు దేశంలో ఎంతో మంది బాలికలు, యువతులు, మహిళలు అత్యాచారాలు, హత్యలకు గురయ్యారు. అయితే కొందరి విషయంలోనే సమాజం నుంచి స్పందన వస్తుండటానికి కారణం ఏమిటంటే.. అదొక సమాధానం దొరకని ప్రశ్న! ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒక దళిత యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు. అయినా సమాజం నుంచి స్పందన రాలేదు. దీనిపై దళిత సంఘాలు మనసు కష్టపెట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో గతంలో అత్యాచారానికి గురైన యువతిపై రెండు రోజుల క్రితమే పెట్రోల్‌ పోసి తగులబెట్టి చంపారు. ఈ దారుణానికి ఒడిగట్టింది కూడా అత్యాచారం చేసిన నిందితులే! అయినా సమాజంలో స్పందన లేదు. మొట్టమొదటిసారిగా దక్షిణాదిన జరిగిన దిశ సంఘటనపై ఉత్తరాదిన కూడా భారీ స్పందన వచ్చింది.
 
దక్షిణాదికి చెందిన వారికి ఇది ఊరటనిచ్చే అంశమే! ఇప్పుడు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయానికి వద్దాం. నిందితులు పోలీసులపై తిరగబడ్డారని పోలీసులు చెబుతున్న కథనాన్ని ఎన్‌కౌంటర్‌ను సమర్థించినవారు కూడా నమ్మడం లేదు. తక్షణ న్యాయం అన్న సూత్రాన్ని పోలీసులు అమలుచేశారని భావిస్తున్నవారి సంఖ్య ఎక్కువ. అయినా ప్రజల నుంచి అనూహ్య రీతిలో పోలీసులకు అభినందనలు వెల్లువెత్తాయి. గతంలో వరంగల్‌లో యాసిడ్‌ దాడికి పాల్పడినవారిని ఎన్‌కౌంటర్‌ చేసిన చరిత్ర ఉన్న సజ్జనార్‌ పర్యవేక్షణలోనే ఇప్పుడు దిశ నిందితులు కూడా ఎన్‌కౌంటర్‌ అయ్యారు. దీంతో ‘సాహో సజ్జనార్‌’ అంటూ ఆయనను ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతించి ఉండకపోతే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగి ఉండేది కాదు. చాణక్య రాజనీతిని ఒంటబట్టించుకున్న కేసీఆర్‌.. ప్రజలలో భావోద్వేగాలను గమనించి ఎన్‌కౌంటర్‌కు అనుమతించడం ద్వారా శభాష్‌ అనిపించుకున్నారు. 
 
ఈ సంఘటనపై నిన్నటివరకు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిపక్షాలు కూడా జరిగింది ఏమిటో తెలిసినా ఎన్‌కౌంటర్‌ను సమర్థించక తప్పలేదు. అందుకే అప్పుడప్పుడు మాత్రమే ప్రజల భావోద్వేగాలను సంతృప్తిపరచాలని చాణక్యుడు చెప్పాడు. ప్రజలలో భావోద్వేగాలు ఏర్పడిన ప్రతిసారీ ఇదే తక్షణ న్యాయం అమలుచేసినా వికటిస్తుంది. అందుకే సంఘటన జరిగి వారం రోజులు దాటినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మౌనంగానే ఉన్నారు. దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడం కేసీఆర్‌కు పెద్ద విషయం ఏమీ కాదు. అలా చేసి ఉంటే ఆయన సమక్షంలోనే దిశ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తంచేసి ఉండేవారు. అందుకే పరామర్శలు అనే తాత్కాలిక ఉపశమనాల జోలికి కేసీఆర్‌ వెళ్లరు. ప్రజల భావోద్వేగాలను ఎప్పుడు సంతృప్తిపరచాలో ఆయనకు బాగా తెలుసు! ఈ ఎన్‌కౌంటర్‌ ద్వారా నిన్నటివరకు తనను విమర్శించిన వారి నోరు మూయించడంతోపాటు దిశ కుటుంబ సభ్యుల నుంచి కూడా ముఖ్యమంత్రి అభినందనలు అందుకున్నారు. 
 
అంతకుముందు నయీం విషయంలో కూడా కేసీఆర్‌ ఇదే విధంగా వ్యవహరించారు. నక్సలైట్‌ ఉద్యమంతో విభేదించి బయటికొచ్చిన నయీం గ్యాంగ్‌స్టర్‌గా అవతరించాడు. ప్రారంభంలో నక్సలైట్లను మట్టుబెట్టడానికై పోలీసులు కూడా నయీంను వాడుకున్నారు. దీంతో పోలీస్‌ వ్యవస్థ తన జేబులో ఉందని భావించిన నయీం రెచ్చిపోయాడు. తన ఆదేశాలను ధిక్కరించిన వారందరినీ నయీం చిత్రహింసలు పెట్టాడు. కొందరిని హత్య చేశాడు. చివరకు పోలీసులకే సవాల్‌గా మారాడు. చంద్రబాబు హయాంలో మొదలైన నయీం దందాలు.. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వ్యవస్థీకృతం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక నయీంపై దృష్టి కేంద్రీకరించారు. అనువైన సమయం చూసుకుని నయీంను ఎన్‌కౌంటర్‌ చేయించారు. దీంతో ‘సాహో కేసీఆర్‌’ అంటూ అప్పట్లో ఆయనను అందరూ అభినందించారు. 
 
రాజకీయ వ్యవస్థను కూడా శాసించే స్థాయికి ఎదిగిన నయీంకు ఎన్‌కౌంటర్‌తో ముగింపు పలికిన ఘనత కేసీఆర్‌కు దక్కింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. పోలీసులను పోటీలు పడి మరీ పొగిడారు. దిశపై దారుణం జరిగిన రోజు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యుల పట్ల ఇదే పోలీసులు అమర్యాదకరంగా వ్యవహరించారు. ఫిర్యాదుపై సకాలంలో స్పందించి ఉంటే దిశపై అఘాయిత్యం జరిగి ఉండేది కాదేమో! ఆమెతోపాటు నిన్న ఎన్‌కౌంటర్‌లో మరణించినవారు కూడా బతికి ఉండేవారేమో! ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌ ద్వారా ఆ వైఫల్యం మరుగునపడిపోయింది. పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రజలందరూ మరచిపోయారు. నయీం విషయంలో కూడా పోలీసు శాఖ చేసిన తప్పు మరుగునపడింది. నిజానికి ఇలాంటి ఎన్‌కౌంటర్లు గతంలో జరిగి ఉంటే మానవ హక్కుల సంఘాల నుంచి ప్రతిఘటన వచ్చేది. 
 
శుక్రవారంనాడు అలాంటి పరిస్థితి కనిపించలేదు. హైకోర్టును ఆశ్రయించినవారు కూడా గుట్టుగానే వ్యవహరించారు. ఎందుకంటే ప్రజలలో భావోద్వేగాలు పరాకాష్ఠకు చేరాయి. ఎన్‌కౌంటర్‌పై తమ అభ్యంతరాలను వ్యక్తంచేయడానికి ఎవరూ సాహసించలేని పరిస్థితి! గుత్తా జ్వాల ఒక్కరే తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించారు. ఆమె అన్నట్టుగా ఈ ఎన్‌కౌంటర్‌తో దేశంలో అత్యాచారాలు ఆగిపోతాయని చెప్పలేని పరిస్థితి. నిర్భయ చట్టం చేసిన తర్వాత కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వరంగల్‌లో యాసిడ్‌ దాడికి పాల్పడినవారిని ఎన్‌కౌంటర్‌ చేసిన తర్వాత కూడా యాసిడ్‌ దాడులు ఆగిపోలేదు. నిజానికి దిశపై అఘాయిత్యానికి పాల్పడింది ‘ఆ నలుగురే’ అని పోలీసులు చెప్పడం మినహా.. వారే దోషులు అనడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. 
 
న్యాయ సమీక్షలో గానీ ఇలాంటి సందేహాలు నివృత్తి కావు. న్యాయ ప్రక్రియ ద్వారా పడాల్సిన శిక్షలను పోలీసులు అమలుచేయడం సమర్థనీయం కాదన్న వాదన కూడా ఉంది. అయితే బాధితులకు ఉపశమనం కలిగేలా నిందితులకు వెనువెంటనే శిక్షలు విధించి అమలుచేయడంలో ప్రస్తుత వ్యవస్థకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు గానీ, ఒక్క నిర్దోషిని కూడా శిక్షించకూడదన్న విధానాన్ని పాటిస్తున్నందున న్యాయ ప్రక్రియ ఏళ్లు గడిచినా ముగియడం లేదు. దీంతో ప్రజలలో అసహనం గూడుకట్టుకుంటోంది. ఫలితంగా తక్షణ శిక్షలు కావాలని సమాజం కోరుకుంటోంది. కానీ, తక్షణ న్యాయం అన్నది సాధ్యంకాదని, ప్రతీకార న్యాయాన్ని అమలు చేస్తే న్యాయ ప్రక్రియకు అర్థమే ఉండదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే శనివారం నాడు చేసిన వ్యాఖ్యలు గమనించాలి. 
 
నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసే అధికారం పోలీసులకు ఇవ్వడం వల్ల అనర్థాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లకు తలొగ్గి నిర్దోషులను కూడా దోషులుగా చిత్రించే అవకాశమూ లేకపోలేదు. చట్టాలు చేసే ఎంపీలు కూడా శుక్రవారంనాడు భావోద్వేగంతోనే పార్లమెంటులో ప్రసంగించారు. ప్రజల భావోద్వేగాలను సంతృప్తిపరచడం ప్రజాప్రతినిధులు, పాలకులకు అవసరమే కావచ్చును గానీ.. మున్ముందు అయినా న్యాయ ప్రక్రియ వేగవంతం కావడానికి ఏమి చేయాలో ఆలోచించడం మంచిది. ఆటవిక న్యాయం అన్ని వేళలా మంచిది కాదు.
 
ఆ శభాష్‌ వెనుక..
ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరించిన తీరు విషయానికి వద్దాం. నిజానికి ఈ సమస్యకు శుభం కార్డు వేయడంలో కేసీఆర్‌ అనుసరించిన విధానం అత్యంత అభ్యంతరకరంగా ఉంది. అయితే ఈ విషయంలో కూడా చాణక్య నీతినే కేసీఆర్‌ అనుసరించడం వల్ల ఆయనను బాహాటంగా ఎవరూ తప్పుబట్టలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు హైకోర్టు కూడా.. లంకాదహనం తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్టుగా ఉంది అని వ్యాఖ్యానించింది. అంటే జరగాల్సిన అనర్థం జరిగిన తర్వాత సమస్య పరిష్కారం అయ్యిందని హైకోర్టు అభిప్రాయపడిందని భావించాలి. 
 
కార్మికుల డిమాండ్లను సానుభూతితో పరిష్కరించాలనీ, తక్షణ ఉపశమనం కింద 40 కోట్లు విడుదల చేయాలనీ హైకోర్టు సూచించినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. హైకోర్టు సూచించినట్టుగా 40 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని ఏకంగా అఫిడవిట్‌ సైతం దాఖలు చేశారు. హైకోర్టులో వ్యాజ్యం ముగిసి కార్మిక సంఘాలు సమ్మె విరమించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపిక చేసిన ఆర్టీసీ ఉద్యోగులను పిలిపించుకుని, వారికి భోజనం పెట్టి మరీ అడిగినవే కాకుండా.. అడగని వరాలు కూడా ప్రకటించారు. కార్మికులకు సెప్టెంబరునెల జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులేదని చెప్పిన ప్రభుత్వమే ఒకే ఒక్క రోజులో జీతాలు చెల్లించింది. 
 
తన మాట లెక్క చేయకుండా సమ్మెకు వెళ్లిన కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారనీ, ఆర్టీసీని మూసివేస్తామనీ, కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకునే పరిస్థితి లేదనీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చేసిన ప్రకటనలతో దిగులు చెందిన కొంతమంది కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అంటే వారి చావులకు కేసీఆర్‌ ప్రకటనలే కారణమని చెప్పకుండా ఉండగలమా? అలాంటప్పుడు కేసీఆర్‌ శిక్షార్హుడే కదా? తప్పుడు అఫిడవిట్లతో హైకోర్టును తప్పుదారి పట్టించడం కూడా నేరమే అవుతుంది కదా! ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించలేదు. అయినా ఆయనను ఎవరూ తప్పు బట్టలేని పరిస్థితి ఏర్పడటానికి సమస్యకు ఆయన ఇచ్చిన ఫినిషింగ్‌ టచ్‌ కారణం! ‘విధుల్లో చేర్చుకోండి మహాప్రభో..’ అని కార్మికులు వేడుకునే పరిస్థితి వచ్చేవరకు వేచి ఉండి, అప్పుడు కేసీఆర్‌ తన చాణక్యనీతిని ప్రదర్శించారు.
 
కార్మికులకు భోజనం పెట్టి వందల కోట్ల వరాలు కురిపించి జేజేలు అందుకున్నారు. దీంతో కార్మికులే కాకుండా ప్రజలు కూడా 55 రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను మరిచిపోయి ‘శభాష్‌ కేసీఆర్‌’ అని ప్రశంసించారు. అప్పటివరకు
కేసీఆర్‌ను దుర్మార్గుడని తిట్టిపోసినవారు సైతం మెచ్చుకున్నారు. యథావిధిగా ప్రతిపక్షాలు అచేతనంగా మిగిలిపోయాయి. కేసీఆర్‌ అడుగులు ఎటువైపు పడతాయో గమనించకుండా ఎగిరెగిరి చివరకు చతికిలబడటం తెలంగాణలో ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది. రెండు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికుల సమ్మెను కేసీఆర్‌ ముదరనిచ్చారు. ఇందులో మొదటిది తనను ధిక్కరించిన యూనియన్‌ నాయకులకు మనుగడ లేకుండా చేయడం. రెండవది అసాధారణ రీతిలో బస్సు చార్జీలను పెంచినా ప్రజల నుంచీ, ప్రతిపక్షాల నుంచీ వ్యతిరేకత రాకుండా చేసుకోవడం. 
 
ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ప్రచారం చేయడం ద్వారా ప్రజలను నమ్మించడంలో కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారు. ఈ కారణంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చార్జీలు పెంచినా.. కనీస ప్రతిఘటన కూడా ఎదురవ్వలేదు. ప్రతిపక్షాలకు కూడా చార్జీల పెంపును తప్పుబట్టలేని స్థితి కల్పించారు. సమ్మె ప్రారంభమైనప్పుడు గానీ, హైకోర్టు చర్చలు జరపాలని సూచించినప్పుడు గానీ యూనియన్‌ నాయకులను పిలిపించి ఇప్పుడు ప్రకటించిన వరాలనే ఇచ్చివుంటే క్రెడిట్‌ కార్మిక సంఘాలకు వెళ్లేది. ముఖ్యమంత్రిని ఇప్పటిలా గుర్తుంచుకునేవారు కాదు. అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే.. అలా చేసి ఉంటే చార్జీలను ఇంత భారీగా పెంచుకునే వెసులుబాటు వచ్చేది కాదు. చివరకు చేతికి మట్టి అంటకుండా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వరాల భారాన్ని ప్రజల నెత్తినే వేశారు. 
 
ఇప్పటికైనా కేసీఆర్‌ను గ్రేట్‌ అనకుండా ఎవరైనా ఎలా ఉండగలరు? కేసీఆర్‌ ఎత్తుగడలను పసిగట్టలేని వారు మాత్రం బోల్తా పడుతూనే ఉంటారు. సమ్మెకు ఇచ్చిన ముగింపును ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కార్మిక ఉద్యమాలలో ఆరితేరిన కమ్యూనిస్టులు కూడా స్వాగతించే పరిస్థితి కల్పించడం ద్వారా ‘సరిలేరు నాకెవ్వరు..’ అని కేసీఆర్‌ రుజువు చేసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నట్టుగా కేసీఆర్‌ మౌనం వెనుక ఏదో పరమార్థం దాగి ఉంటుంది. జాతీయ స్థాయిలో అపర చాణుక్యుడుగా గుర్తింపు పొందిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా ఒక సందర్భంలో కేసీఆర్‌ తెలివి తేటలను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కేసీఆర్‌ చర్యలన్నీ ప్రారంభంలో అరాచకంగా కనిపిస్తాయి. చివరకు ప్రత్యర్థులకు దిక్కుతోచని పరిస్థితి కల్పిస్తాయి. 
 
నిజానికి శుక్రవారంనాడు జరిగిన ఎన్‌కౌంటర్‌కు లభించిన మద్దతు వల్ల పాలకుల్లో నియంతృత్వ పోకడలు మరింత పెరిగే ప్రమాదముంది. కానీ భావోద్వేగాలు ఉన్నచోట విచక్షణ ఉండదు. కేసీఆర్‌ చర్యలన్నీ అంతిమంగా రాజకీయంగా సత్ఫలితాలను ఇవ్వడం వల్ల మంత్రులు సైతం నోరెత్తలేని పరిస్థితి! శుక్రవారంనాటి ఎన్‌కౌంటర్‌ పట్ల కొంతమంది మంత్రులకు మనసులో అభ్యంతరాలు ఉన్నప్పటికీ బయట నెలకొన్న వాతావరణాన్ని బట్టి మౌనాన్ని ఆశ్రయించక తప్పలేదు. ‘‘మా వెలమలలో సాధారణంగా ఎవరికీ ఈ రకం తెలివితేటలు ఉండటాన్ని నేను చూడలేదు. కేసీఆర్‌ను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది’’ అని ఒక వెలమ ప్రముఖుడు ముచ్చట పడ్డారు. ఎవరికి అంగీకారం అయినా కాకపోయినా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనే కాకుండా దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయించడం ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు కీర్తిప్రతిష్ఠలే తెచ్చిపెట్టింది. 
 
దురదృష్టం ఏమిటంటే.. ఇటువంటి సందర్భాలలో చట్టాలు కూడా తెల్లమొహం వేయక తప్పడంలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు వారిరువురి ముందు నిలబడలేకపోతున్నాయి. వేలాది పుస్తకాలను పఠించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. చాణక్యుడి రాజనీతి శాస్త్రాన్ని ఔపోసన పట్టకుండా ఎందుకుంటారు? తెలంగాణ సమాజం గురించి పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్‌కు చాణక్య నీతిని ఎప్పుడు ప్రదర్శించాలో కూడా బాగా తెలుసు! ఈ కారణంగానే ఎప్పటికప్పుడు తన ప్రత్యర్థులను దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నారు. మీడియా కూడా ప్రజలలో నెలకొన్న భావోద్వేగాలకు విరుద్ధంగా వ్యవహరించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే శుక్రవారంనాటి ఎన్‌కౌంటర్‌ను ఎవరికివారు శక్తివంచన లేకుండా శ్లాఘించారు. ఈ పరిణామాలు సమాజానికి మంచివా? కాదా? అన్నది కాలమే నిర్ణయించాలి! 

 

Share this post


Link to post
Share on other sites

చాణక్యుడికే రాజనీతిని బోధించే సత్తా ఉన్న నేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు!

 

దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడం కేసీఆర్‌కు పెద్ద విషయం ఏమీ కాదు. అలా చేసి ఉంటే ఆయన సమక్షంలోనే దిశ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తంచేసి ఉండేవారు. అందుకే పరామర్శలు అనే తాత్కాలిక ఉపశమనాల జోలికి కేసీఆర్‌ వెళ్లరు. ప్రజల భావోద్వేగాలను ఎప్పుడు సంతృప్తిపరచాలో ఆయనకు బాగా తెలుసు! ఈ ఎన్‌కౌంటర్‌ ద్వారా నిన్నటివరకు తనను విమర్శించిన వారి నోరు మూయించడంతోపాటు దిశ కుటుంబ సభ్యుల నుంచి కూడా ముఖ్యమంత్రి అభినందనలు అందుకున్నారు

Share this post


Link to post
Share on other sites

idi chadivi KCR munaga chettu ekki full bottle koduthu untadu. 😂

asalu vishayam enti ante RTC ni merge seyaledu. 10000 Cr appulu + yearly additional ga 10000 Cr salary bill add avuthundi budget lo. ippatike xxxxx naakuthunnaru funds kosam. inka adi bharinchaledu. Deeniki thodu privatisation cheddamanna central govt high court lo 35% ownership claim undi central ki ani affidavit ichindi. inka privatasation seyyali ante parliament lo bill kaavali ani seppindi. inka emi eekaleka silent ga thaaguthu unnadu. public kuda vexed with Govt. employees already. So they did not extend hand to RTC. inka RTC vallu emi sesedi leka aapesaru. 

next chaavu intiki KCR velladu as per swamiji josyam. last time kondagattu bus accident time lo 60 members chanipothe kuda vellaledu. same reason. Hari krishna chanipothe paramarsinchindi kukatpally elections lo Andhra valla ni ice seyyadaniki. 

 

Edited by Vihari

Share this post


Link to post
Share on other sites
3 minutes ago, Vihari said:

idi chadivi KCR munaga chettu ekki full bottle koduthu untadu. 😂

asalu vishayam enti ante RTC ni merge seyaledu. 10000 Cr appulu + yearly additional ga 10000 Cr salary bill add avuthundi budget lo. ippatike xxxxx naakuthunnaru funds kosam. inka adi bharinchaledu.

next chaavu intiki KCR velladu as per swamiji josyam. last time kondagattu bus accident time lo 60 members chanipothe kuda vellaledu. same reason. Hari krishna chanipothe paramarsinchindi kukatpally elections lo Andhra valla ni ice seyyadaniki. 

 

Haha.  Kcr only politics ktr only development 

Share this post


Link to post
Share on other sites
6 minutes ago, koushik_k said:

Haha.  Kcr only politics ktr only development 

naa. both are drunkards. what they know is how to twist sentiment and blame everyone as anti TG. opposition ni full police case latho torture petti financial ga weak sesi voice raise seyakunda sesthunnaru. kodangal lo Reventh odipoyaka inka Vere ee political leaders ki kuda KCR ki against ga fight seyyali anna motivation ledu. So KCR gaadu full honeymoon enjoying. 

Share this post


Link to post
Share on other sites
29 minutes ago, koushik_k said:

Right e.  Own party petti CM avvalante padatai Mari.   Mandini munchi party lakkoni unte 50 yrs ki ayyevademo 

Aa mandini munchina vaadide monnati daaka naaki sudden ga plate ela tippav bayya

Share this post


Link to post
Share on other sites
10 minutes ago, thalaiva_NTR said:

Aa mandini munchina vaadide monnati daaka naaki sudden ga plate ela tippav bayya

:roflmao::roflmao:

Ee Mukku mass leader kuda monnati varaku naakindi ade mandini munchinodidhe ga

Papam aavesam lo marchipoyadu emo le😂

Share this post


Link to post
Share on other sites
4 minutes ago, Hero123 said:

Intha evadu chadhuvuthadu.. rendu mukkaloo cheppandi

Kcr savala meeda naduchukuntu politics lo paiki vachadu ani antunnadu 

Manshula chavulani ela use chesukovalo kcr ni choosi nerchukovali antunnadu

Edited by gnk@vja

Share this post


Link to post
Share on other sites
6 minutes ago, gnk@vja said:

Kcr savala meeda naduchukuntu politics lo paiki vachadu ani antunnadu 

Manshula chavulani ela use chesukovalo kcr ni choosi nerchukovali antunnadu

Idhi roju thread starter chevvulu moosi vaayagoduthunnadu gaaa.. malli article endhuku

Share this post


Link to post
Share on other sites

Repu mee intlo vallaki ilage jarigi vallu kuda ilage encounter ithe nee response ilane untadha brother...

Dappu kottochu thappuledhu kani koncham gnanam tho kottu mechukuntam....

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×