Jump to content

Padma Missing


rama123

Recommended Posts

గుంటూరు: మంగళగిరి మండలం యర్రబాలేనికి చెందిన యలమంచిలి పద్మ అనే మహిళా రైతు అదృశ్యమైంది. గత నెల 26న రాజధానిపై స్పష్టత కోసం యర్రబాలెంలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రైతులతో కలసి పద్మ నిరసన ప్రదర్శనలో పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆమె మంత్రి కోడాలి నానిపై తీవ్ర హెచ్చరికలు చేసింది. పద్మ మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి పద్మ కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Link to comment
Share on other sites

కొడాలి నాని గురించి మాట్లాడిన ఎర్రబాలెం పద్మజ ను అరెస్టు చేసి కంచికచర్ల పోలీసు స్టేషన్ కు తరలించారు..

రాళ్లు చెప్పులు వేయడం నిరసన లో భాగం అని స్వయానా డీజీపీ గారే చెప్పారు. మరి వాక్ స్వాతంత్ర్యము హక్కు ఉపయోగించుకుంటే ఎందుకు అరెస్ట్ చేశారు.
మంత్రి నాని మాట్లాడింది కరెక్ట్ అయితే ఈ మహిళ మాట్లాడింది కరెక్ట్ అవ్వాలి. ఈమె మాట్లాడింది తప్పు అయితే మంత్రి నాని ది కూడా తప్పే కదా.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...