Jump to content

ఫడణవీస్‌ డ్రామా ఆడారట..!


KING007

Recommended Posts

ఫడణవీస్‌ డ్రామా ఆడారట..!

భాజపా నేత అనంత్‌ కుమార్‌ హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

ఫడణవీస్‌ డ్రామా ఆడారట..!

బెంగళూరు: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలుత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దేవేంద్ర ఫడణవీస్‌ తన ప్రభుత్వానికి మెజార్టీ లేదని అంగీకరించి 80గంటల్లోగా రాజీనామా చేశారు. అయితే మెజార్టీ లేదన్న విషయం పార్టీకి ముందే తెలుసట. అయినా ఒక పని కోసం ఫడణవీస్‌తో డ్రామా ఆడించారట. ఇది చెప్పింది ఎవరో కాదు.. ఆ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే. ఇంతకీ ఆ పని ఏంటో ఆయన మాటల్లోనే..‘‘మీకందిరికీ తెలుసు మహారాష్ట్రలో మా పార్టీకి చెందిన దేవేంద్ర ఫడణవీస్‌ 80 గంటల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న విషయం. ఆయన ఎందుకు ఈ డ్రామా ఆడారు? మాకు(భాజపా) తెలియదా.. మెజార్టీ లేకున్నా ఆయన సీఎం అయ్యారని. అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.40వేల కోట్లు దుర్వినియోగం కావొద్దని ఫడణవీస్‌ భావించారు. ఒకవేళ కాంగ్రెస్‌-ఎన్‌సీపీ-శివసేన కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి కోసం కేటాయించిన ఆ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆయనకి తెలుసు. అందుకే అక్కడ ఒక డ్రామా ఆడాలని నిర్ణయించుకున్నారు. ఫడణవీస్‌ సీఎం అయిన 15గంటల్లో ఆ రూ.40వేల కోట్లను కేంద్రానికి తిప్పి పంపారు’’ అని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర రాజకీయాలు నెలరోజుల పాటు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించాయి. ఎన్‌సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్‌పవార్‌ నాలుగు రోజులు తిరగకముందే సొంతగూటికి చేరుకున్నారు. కమలదళంలో మెజారిటీ ఆశలు రేపిన ఆయన అనూహ్య రాజీనామాతో భాజపా 80 గంటల ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దేవేంద్ర ఫడణవీస్‌ అంతలోనే దిగిపోవలసి వచ్చింది. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ‘మహా వికాస్‌ ఆఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి.. విశ్వాసపరీక్షలో నెగ్గారు.

Link to comment
Share on other sites

On 12/2/2019 at 12:58 AM, niceguy said:

కేంద్రం నుంచి వచ్చిన రూ.40వేల కోట్లు దుర్వినియోగం కావొద్దని ఫడణవీస్‌ భావించారు.

bra_13a.gif

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...