Jump to content

Incident at Shadnagar


Raaz@NBK

Recommended Posts

  • Replies 121
  • Created
  • Last Reply

sad incident. these kind of vultures exist everywhere. please take some precautions. use reliable cab service or public transport wherever it is possible. government needs to run  mini_buses/buses during odd times. family member needs to pickup or drop near bus stop.

in this case situation is entirely out of her control. when puncture happened she could have called 100 as distress call . police near to  that lady might come or police might send some trustworthy people or give some directions. 

 

Link to comment
Share on other sites

హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకు ముందు.. తన సోదరితో ఫోన్‌లో మాట్లాడుతూ పదే పదే భయమేస్తోందే.. భయమేస్తోందే.. అంటూ కంటతడి పెట్టింది.
 
 
 
చెల్లితో ప్రియాంకరెడ్డి చివరిగా ఫోన్ కాల్ సంభాషణ:
 
 
ప్రియాంక: ఏమే.. నా బండి ఆగిపోయిందే. ఇప్పుడే వచ్చింది.
సోదరి: సరే..
ప్రియాంక: కొంచెం సేపు మాట్లాడు.
సోదరి: ఎందుకు.. ఏమైంది?.
ప్రియాంక: మాట్లాడవే.. తర్వాత చెబుతా.
సోదరి: అక్కడ యాక్సిడెంట్ అయిందా?
ప్రియాంక: నాకు చాలా టెన్షన్‌గా ఉందే.
సోదరి: గచ్చిబౌలిలో యాక్సిడెంట్ అయిందా?
ప్రియాంక: ఏంటీ... అర్థం కాలేదు.
సోదరి: యాక్సిడెంట్ అయిందా? అని అడిగా.
ప్రియాంక: లేదు.
సోదరి: మరీ..!
ప్రియాంక: అక్కడ బైక్ పెట్టిపోతా కదా?. అయితే బండి అక్కడ పెట్టి నిలబడ్డా.. అయితే టోల్‌ప్లాజ్ సిబ్బంది వచ్చి.. మేడమ్ ఇక్కడ బండి పెట్టొద్దు.. ఇంతకుముందే పోలీసోళ్లు వచ్చి పట్టికెళ్లిపోయారని చెప్పారు. అయితే తిరిగి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఇంకో రోడ్డు ఉంటుంది కదా?. అక్కడ పెట్టి వెళ్లాను. తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికీ టైర్ పంక్చరైంది.
సోదరి: అయితే బైక్ వదిలేసి వచ్చేయ్.
ప్రియాంక: వదిలేసి రావాలా?, వదిలేసి వస్తే.. పొద్దున ఎవరు తీసుకొస్తారే.
సోదరి: పొద్దున అంటే ఎవరినైనా తీసుకెళ్లి తెచ్చుకోవాలి.
ప్రియాంక: ఎవర్ని తీసుకెళ్లాలే.
సోదరి: మెకానిక్‌ని?
ప్రియాంక: మెకానిక్‌నా?
సోదరి: అవును మరీ?
ప్రియాంక: పంక్చర్ అయితే కొంచెం దూరం కూడా పోదా?
సోదరి: చూడాలే.. కొంచెం దూరం వస్తుందేమో?.. ఏ టైర్?
ప్రియాంక: వెనుకాల టైర్?
సోదరి: నాకు తెలియదు కదా? అక్కయా.
ప్రియాంక: ఆ..
సోదరి: నాకు తెలియదు కదా?
ప్రియాంక: అయితే చెబుతా విను.. ఇక్కడ ఒక లారీ ఉందే.. అందులో జనాలున్నారు. అందులో ఒకాయన నేను పంక్చర్ వేయిస్తానని తీసుకుపోయాడు.
సోదరి: మరి తీసుకురాలేదా?
ప్రియాంక: తీసుకొచ్చాడు. షాపు క్లోజ్ అయిందని తీసుకొచ్చాడు. ఇంకో షాపుకు తీసుకెళ్తానని పోయాడు.. నాకు భయమేస్తోందే.
సోదరి: మళ్లీ తీసుకు రాలేదా?
ప్రియాంక: పిల్లోడు పోయాడు.. భయమేస్తోందే?
సోదరి: అక్కడ.. ఎవరూ లేరా?
ప్రియాంక: వెహికిల్స్ ఉన్నాయి. టోల్‌ ఉంటుంది కదా? ఆడా.. వాళ్లేమో.. నేను వెళ్తానంటే.. వద్దంటున్నారు. దెయ్యాల్లా వెంటపడ్డారు. మేడం వద్దు.. మధ్యలో ఆగిపోతుందన్నారు. భయమేస్తోందే పాప.
సోదరి: ఏమౌవుతుంది. అక్కడే అంటే టోల్‌ఫ్లాజా దగ్గరా?
ప్రియాంక: వాళ్లేమో బయటనే నిలబడ్డారు.
సోదరి: ఎవరు?
ప్రియాంక: లారీ వాళ్లు.
సోదరి: టోల్‌గేట్ ఉంటుంది కదా?. అక్కడకెళ్లి నిలబడు.
ప్రియాంక: అక్కడికా?.. పాప మాట్లాడవే.. నాకు భయమేస్తోంది.
సోదరి: ఏం ఫర్వాలేదు. టోల్‌ఫ్లాజా దగ్గరకు వెళ్లు.
ప్రియాంక: ఆ..
సోదరి: టోల్‌ బూతుందా?, అక్కడికెళ్లు.
ప్రియాంక: వీళ్లేంటే.. సడన్‌గా ఎవరూ కనిపించట్లేదు. కనిపించాడే.. దెయ్యాల్లా ఈడే ఉన్నాడే. బండి స్టార్ చేశానే.. పోతుందే.. అప్పుడే కిందికొచ్చి.. మేడమ్. మేడమ్ టైర్ పంక్చర్ అయిందంటున్నాడే. బస్టాండ్ దగ్గర వరకూ వెళ్లదా?, బస్టాండ్ దగ్గర షాపు ఉంటుందే. కానీ వీళ్లేమో.. మేడమ్ మేము చేపించుకుని వస్తామంటున్నారే. ఓ పిల్లగాడ్ని పంపించాడే. ఆ పిల్లగాడు పోయాడు.. వట్టిగానే వచ్చిండు. మళ్లీ ఇంకో షాపు ఉందని చెబుతున్నాడు. లేటవుతుంది.. నేను వెళ్తానంటే.. లేదు మేడమ్.. మధ్యలో ఆగిపోతే ఇబ్బంది పడతారంటున్నాడే. దెయ్యాల్లో నా వెంట పడ్డారే.
సోదరి: మరి మధ్యలో ఆగిపోతే ఇబ్బందే కదా?
ప్రియాంక: ఏమోనే నాకు చాలా భయమేస్తోందే.
సోదరి: టోల్ బూత్ దగ్గరకు వెళ్లి నిలబడవే.
ప్రియాంక: టోల్ బూత్ దగ్గరకు వెళ్లి ఏం నిలబడలే.. అందరి ముందు.. అక్కడ నిలబడితే అందరూ నన్నే చూస్తారే.
సోదరి: చూస్తూనే ఉండని.. జనాలు ఉంటారు కదా?.
ప్రియాంక: చాలా భయమేస్తోందే. వాళ్లను చూస్తుంటే భయమేస్తోంది.
సోదరి: టోల్‌బూత్ దగ్గరకు వెళ్లి.. అక్కడ నిలబడమన్నాను కదా?
ప్రియాంక: ఏడుపొస్తోంది.
సోదరి: అంత లేటుగా వెళ్లడం అవసరమా?
ప్రియాంక: లేదుగా.. అది కాదు తల్లీ... భయమేస్తోందే పాప. దెయ్యంలా ఉన్నాడే. ఇక్కడ నిలబడాలనే లేదు.
సోదరి: వెళ్లూ.. టోల్‌బూత్ దగ్గరకు...
ప్రియాంక: ఆ..
సోదరి: టోల్‌బూత్ దగ్గరకు వెళ్లి నిలబడు.
ప్రియాంక: అక్కడికి పోతే.. వచ్చే పోయే వారంతా నన్నే చూస్తారే. కొంచెం సేపు మాట్లాడవే పాప. బైకొచ్చేదాకా టెన్షన్ అవుతుందే.
సోదరి: బైకొచ్చేదాకా మాట్లాడుతూ కూర్చోవాలా?
ప్రియాంక: 5 నిమిషాలకే ఇలా చేస్తావేంటే.. దెయ్యం పిల్ల నీవు. రోడ్డు మీద ఒక్కదానినుంటే...
సోదరి: ఎగబడి.. ఇంత అర్ధరాత్రి పోవడం అవసరమా? మరీ.
ప్రియాంక: ఒక పనైపోతుంది కదా?.. పాప.
సోదరి: ఇంత రాత్రి వెళ్లడం అవసరమా?, రేపు పోకూడదా?
ప్రియాంక: రేపు ఆఫీస్‌లో మీటింగ్ ఉందని చెప్పారు మాకూ.
సోదరి: కొంచెం సేపైనా తర్వాత మళ్లీ చేస్తాను లే.
ప్రియాంక: సండే... మండే టెంపుల్‌కి తీసుకుపోతున్నారు. అసలు కుదరడమే లేదు. వాళ్లను చూస్తుంటే చాలా భయమేస్తోందే. భయంగా ఉందే. ఏం పిల్లగాడో ఇంకా రాలేదు.
సోదరి: సరిలే మరి.. కొంచెం సేపైనా తర్వాత ఫోన్ చేస్తాను లే.
ప్రియాంక: ఫోన్‌లో ప్రియాంక ఏడుస్తూనే ఉంది. లేదు పాప.
సోదరి: సరిలే.. కొంచెం సేపైనా తర్వాత చేస్తాలే. ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్లీ చేస్తాను లే.
ప్రియాంక: ఊ.... ఫోన్ కట్ అయింది.
 
 

ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT

 

ADVERTISEMENT

తాజావార్తలు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
mailicon.png digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...