Jump to content

దేశం’లో.. చౌ‘దారి’ చెల్లాచెదురు?


Eswar09

Recommended Posts

 

టిడిపికి కమ్మ వర్గం ఝలక్

అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు, మాజీలు?

లోకేష్ ధర్నాలో కనిపించని సొంత వర్గం నేతలు

సుజనా వైపు కమ్మ నేతల చూపు?

ఇతర వర్గాల నేతల ముందు తలవంపులు

పార్టీకి దన్నుగా బీసీ, రెడ్డి, మాదిగ నేతలు

సీమలో రెడ్డినేతలే ఆసరా

కమ్మపార్టీ ముద్రతో ఇప్పటికే ఓటమి

ఇప్పుడు వారే వెళ్లిపోతున్న వైనం

కులముద్ర చెరిగితేనే భవిష్యత్తు

మాదిగకు వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్


కమ్మ సామాజికవర్గానికి వ్యాపార, వ్యవహారదక్షత గల కులంగా పేరుంది. పౌరోహిత్యంతో సహా ఆ వర్గం లేని రంగమంటూ లేదు. గత రెండు దశాబ్దాల నుంచి అది సర్వాంతర్యామి. క్లింటన్ నుంచి ట్రంప్ విజయం వరకూ వారిదే కీలకపాత్ర. కష్టపడే తత్వం, ఎవరితో శత్రుత్వం పెట్టుకోని స్వభావం, ప్రతిదీ వ్యాపార కోణంలో చూసే నైజం, లాభనష్టాలను ముందుగానే అంచనావేసే మేధస్సు, నాయకత్వ లక్షణాలు, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన ముందుచూపు కమ్మ వర్గానికే సొంతం. జల నాగరికత గురించి బాగా తెలిసిన సామాజికవర్గం. నీళ్లు కూడా లేని భూముల్లో మూడు పంటలు పండించే కర్షక కష్టజీవి. మహబూబ్‌నగర్, అనంతపురం వంటి ఎడారి జిల్లాలు, నిజామాబాద్ వంటి సారవంతమైన జిల్లా భూములను బంగారంగా మార్చడం ఒక్క కమ్మ సామాజికవర్గానికే సాధ్యం. తెలుగుదేశం పార్టీకి ఆ సామాజికవర్గం సంప్రదాయ ఓటు బ్యాంకు.ప్రధాన ఆర్ధిక వనరు. ఒక రకంగా కమ్మ సామాజికవర్గమే టిడిపికి బలం, బలహీనత.అప్పుడు అధికారం రావడానికయినా, ఇటీవల ఓడిపోవడానికయినా కారణం అదే.ఇప్పుడు అధికారం పోయిన తర్వాత, ఇతర పార్టీల్లోకి వలసలు ప్రారంభించిందీ అదే వర్గం కావడం విశేషం.

 

టిడిపికి కమ్మ వర్గం ఝలక్

అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు, మాజీలు?

లోకేష్ ధర్నాలో కనిపించని సొంత వర్గం నేతలు

సుజనా వైపు కమ్మ నేతల చూపు?

ఇతర వర్గాల నేతల ముందు తలవంపులు

పార్టీకి దన్నుగా బీసీ, రెడ్డి, మాదిగ నేతలు

సీమలో రెడ్డినేతలే ఆసరా

కమ్మపార్టీ ముద్రతో ఇప్పటికే ఓటమి

ఇప్పుడు వారే వెళ్లిపోతున్న వైనం

కులముద్ర చెరిగితేనే భవిష్యత్తు

మాదిగకు వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్

( మార్తి సుబ్రహ్మణ్యం)

 
ch-8-disply-pic-300x185.jpgకమ్మ సామాజికవర్గానికి వ్యాపార, వ్యవహారదక్షత గల కులంగా పేరుంది. పౌరోహిత్యంతో సహా ఆ వర్గం లేని రంగమంటూ లేదు. గత రెండు దశాబ్దాల నుంచి అది సర్వాంతర్యామి. క్లింటన్ నుంచి ట్రంప్ విజయం వరకూ వారిదే కీలకపాత్ర. కష్టపడే తత్వం, ఎవరితో శత్రుత్వం పెట్టుకోని స్వభావం, ప్రతిదీ వ్యాపార కోణంలో చూసే నైజం, లాభనష్టాలను ముందుగానే అంచనావేసే మేధస్సు, నాయకత్వ లక్షణాలు, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన ముందుచూపు కమ్మ వర్గానికే సొంతం. జల నాగరికత గురించి బాగా తెలిసిన సామాజికవర్గం. నీళ్లు కూడా లేని భూముల్లో మూడు పంటలు పండించే కర్షక కష్టజీవి. మహబూబ్‌నగర్, అనంతపురం వంటి ఎడారి జిల్లాలు, నిజామాబాద్ వంటి సారవంతమైన జిల్లా భూములను బంగారంగా మార్చడం ఒక్క కమ్మ సామాజికవర్గానికే సాధ్యం. తెలుగుదేశం పార్టీకి ఆ సామాజికవర్గం సంప్రదాయ ఓటు బ్యాంకు.ప్రధాన ఆర్ధిక వనరు. ఒక రకంగా కమ్మ సామాజికవర్గమే టిడిపికి బలం, బలహీనత.అప్పుడు అధికారం రావడానికయినా, ఇటీవల ఓడిపోవడానికయినా కారణం అదే.ఇప్పుడు అధికారం పోయిన తర్వాత, ఇతర పార్టీల్లోకి వలసలు ప్రారంభించిందీ అదే వర్గం కావడం విశేషం.

అధికారంలో ఉండగా అన్ని పదవులు అనుభవించి, అధినేత చుట్టూ కనిపించిన కమ్మ వర్గీయులే, అధికారం పోయిన తర్వాత నిష్ర్కమిస్తున్న వైనం చూసి మిగిలిన సామాజికవర్గాలు విస్తుపోతున్నాయి. ఫలితంగా తలపట్టుకోవలసిన దుస్థితి నాయకత్వానిది. ఇతర వర్గాలు చూసే ‘ప్రశ్నలాంటి చూపు’లకు జవాబివ్వలేని దయనీయం. సొంత సామాజికవర్గమే పార్టీకి కష్టకాలంలో చేయిస్తుంటే, బిసి, రెడ్డి, మాదిగ వర్గాలు చేయి పట్టుకుని నడుస్తున్న మరో వైచిత్రి. కులం ముద్ర గత ఎన్నికల్లో టిడిపి కొంప ముంచింది. ఓటమి తర్వాత కూడా ముంచుతోంది. ఇతర వర్గాలను దూరం చేసింది. సొంత సామాజికవర్గంలో ఇంకా ఎంతమంది మాయమవుతారో తెలియని అయోమయం. అందులో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎంతమంది ఉన్నారో అర్ధం కాని గందరగోళం. ఉదయాన్నే అధినేత, ఆయన పుత్రుడితో మాట్లాడిన నేతల్లో, సాయంత్రానికి ఎంమంది ఉంటారు? ఎంతమంది ఇంకో పార్టీలో చేరతారో అర్ధం గాని దయనీయం. ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రస్తుత చిత్రం. 

రాష్ట్ర రాజకీయాలను కొత్త దారి పట్టించిన తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టయిన కమ్మ సామాజికవర్గం, ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వానికి వరస వెంట వరస షాకులివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఉన్న 23 మంది శాసనసభ్యుల్లో 11 మంది కమ్మ వర్గం వారుండగా, అందులో వల్లభనేని వంశీ తాజాగా చంద్రబాబుపై తిరుగుబాటుబావుటా ఎగురవేశారు. మరికొందరు వ్యాపార సమస్యల దృష్ట్యా సమయం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. వీరిలో తాజాగా పార్టీ నుంచి నిష్క్రమించిన వంశీ.. చంద్రబాబు, లోకేష్, రాజేంద్రప్రసాద్ వంటి నేతలను పరుష పదజాలంతో తూర్పారపట్టడం సంచలనం సృష్టించింది. ఇక అంతకంటే ముందు తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, బెజవాడలో పట్టున్న ఆయన సన్నిహితుడు కడియాల బుచ్చిబాబు వినమ్రంగా సీఎం జగన్‌తో వైసీపీ కండువా కప్పించుకున్నారు. గత రెండు వారాల క్రితమే లోకేష్ సహా టిడిపిలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వారసులతో అవినాష్ ఒక విందు సమావేశం నిర్వహించడం విశేషం. టిడిపి అధికారంలో ఉండగా, బిజెపి-వైసీపీపై భారీ ఫ్లెక్సీలతో విరుచుకుపడి అందరినీ ఆకర్షించిన బెజవాడకు చెందిన మరో కమ్మ వర్గ నేత కాట్రగడ్డ బాబు కూడా నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవినేని అవినాష్ తన నిష్ర్కమణ సమయంలో పెద్దగా నోరు విప్పకపోయినా, వంశీ మాత్రం వ్యక్తిగతంగా బాబు-లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి చేయడం చర్చనీయాంశమయింది. వీరంతా కమ్మ సామాజికవర్గానికే చెందిన వారు కావడం విశేషం.

కృష్ణా జిల్లాలో కమ్మ సామాజికవర్గం టిడిపికి బలమైన మద్దతుదారన్నది బహిరంగమే. అలాంటి వర్గమే నిష్క్రమణ పర్వాన్ని ప్రారంభించడంతో టిడిపి నాయకత్వం ఖంగుతినాల్సి వచ్చింది.కృష్ణా జిల్లాకు చెందిన ఎంపి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తొలి దశలో టిడిపి నుంచి నిష్క్రమించగా, రెండో దశలో అది ఎమ్మెల్యే వంశీతో మొదలుకావడం విశేషం. ఇప్పటివరకూ కృష్ణా జిల్లా నుంచి వెళ్లిన సుజనా చౌదరి, వంశీ, దేవినేని అవినాష్ ముగ్గురూ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే కావడం ప్రస్తావనార్హం. అయితే సుజనా చౌదరి బిజెపిలో చేరగా, అవినాష్ వైసీపీలో చేరారు. వంశీ అడుగులు కూడా అటే పడనున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. సుజనా చౌదరి స్థాయి పెద్దది కావడంతోపాటు, ఆయన గతంలో పార్టీ నేతలతో అంతర్గతంగా సత్సంబంధాలు నెరిపారు. తన స్థాయిలో పూర్తయ్యే సమస్యలను పరిష్కరించేవారు. దానితో ఆయనకంటూ ఒక సొంత వర్గం ఏర్పడింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో దేశ, విదేశాల్లోని కమ్మ, కమ్మేతర పారిశ్రామికవేత్తల నుంచి భారీ స్థాయిలో నిధులు సమీకరించి, టిడిపి విజయంలో కీలకపాత్ర పోషించారన్నది బహిరంగ రహస్యం. బిజెపితో యుద్ధం మంచిదికాదని, కేంద్రం నుంచి నిష్ర్కమణకు కొన్ని నెలలు వేచిచూద్దామని సుజనా చెప్పిన హితువును బాబు ఖాతరు చేయకపోవడంతో, టిడిపి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. పైగా ఢిల్లీలో ఆయనకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహించడం, రెండోసారి రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో చివరి వరకూ ఆందోళనకు గురిచేయడంతోపాటు, లోకేష్‌తో వచ్చిన విబేధాలు సుజనా చౌదరి నిష్క్రమణకు దారి తీశాయి. అయితే ఆయన తన నిష్క్రమణ సందర్భంగా హుందాగా వ్యవహరించారు. బాబును వ్యక్తిగతంగా విమర్శించకుండా, విధానపరమైన లోపాలను మాత్రమే ఎత్తిచూపారు. ఆ తర్వాత కూడా అదే విధానం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సుజనాతో టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటున్నారు. సరైన సమయంలో వారంతా బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అటు తెలంగాణకు చెందిన మరో ఎంపి గరికపాటి మోహన్‌రావుది ప్రత్యేక పరిస్థితి. కులపరంగా కమ్మ వర్గానికి చెందినప్పటికీ, అన్ని వర్గాలతో సన్నిహితంగా వ్యవహరించే గరికపాటికి.. బాబుకు అత్యంత విధేయులు, విశ్వసనీయుల్లో ఒకరుగా, ఆర్గనైజర్‌గా గరికపాటికి పేరుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌లోని కమ్మ సామాజికవర్గంలో మంచి పట్టుంది. వైశ్రాయ్ సంక్షోభంతో గరికపాటి సమర్థత తెరపైకి వచ్చింది. ముక్కుసూటిగా వ్యవహరించి, సాధ్యమైనంత వరకూ సహాయం చేసే తత్వం ఉన్న గరికపాటి కూడా, టిడిపి నుంచి నిష్క్రమించడం టిడిపిని ఖంగుతినిపించింది. తెలంగాణలో పార్టీని నాయకత్వమే సమాధి చేయడం, అసమర్ధులకు నాయకత్వం అప్పగించడం, ఇక ఆ ప్రాంతంలో టిడిపికి భవిష్యత్తు లేకపోవడంతో.. ఆరు జిల్లాలకు చెందిన టిడిపి ప్రముఖులతో కలసి, బిజెపిలో చేరడం ఆ పార్టీకి ప్లస్‌పాయింటయింది. దానితో టిఆర్‌ఎస్‌లో చేరగా, మిగిలిన పోయిన తెలంగాణ తమ్ముళ్లు రెండో దశలో గరికపాటితో కలసి పూర్తి స్థాయిలో బిజెపిలో చేరినట్టయింది. దీనితో బిజెపి నాయకత్వం తెలంగాణలో గరికపాటికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇటీవలే పార్టీ చీఫ్ అమిత్‌షాతో ఆయన భేటీ అయి, తెలంగాణలో భారీ బహిరంగసభల నిర్వహణపై చర్చించారు. అందులో భాగంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, ప్రతి జిల్లాలో ఒక భారీ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. టిడిపిలో ఉండగా భారీ సభలు, వేదికలను ఆర్గనైజ్ చేసిన నేతగా పేరున్న గరికపాటి సేవలను, బిజెపి ఆరకంగా వినియోగించుకుంటోంది. ఇక ఏపీలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖలోని టిడిపి నేతలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు, కమ్మ సామాజికవర్గ నేతలతో ఆయనకు ఉన్న వ్యక్తిగత సంబంధాలను దృష్టిలో ఉంచుకున్న నాయకత్వం, గరికపాటి సేవలను ఆంధ్రాలోనూ వినియోగించాలని కోరినట్లు సమాచారం.

హైదరాబాద్ టిడిపిలో కమ్మ ప్రముఖులంతా ఇప్పటికే టిఆర్‌ఎస్, బిజెపిలో చేరగా కాట్రగడ్డ ప్రసూన, సత్యనారాయణ వంటి కొద్దిమాత్రమే మిగిలారు. తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, మాగంటి గోపీనాధ్, గాంధీ, నామా నాగేశ్వరరావు వంటి వారంతా ఏనాడో తెరాసలో చేరిపోయారు. చివరకు చంద్రబాబు తొలిదశ రాజకీయాల్లో, అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొమ్మినేని వికాస్ కూడా నిష్క్రమించడం మరో విశేషం. చంద్రబాబు అస్పష్ట, గందరగోళ రాజకీయ విధానాల కారణంగా గత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం తెరాస వైపే మొగ్గు చూపగా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకే జైకొట్టింది.ఆరకంగా తెలంగాణ గుండెకాయ వంటి హైదరాబాద్-రంగారెడ్డి, కమ్మ వర్గం ఎక్కువగా ఉండే నిజామాబాద్‌లో సొంత సామాజికవర్గం పార్టీకి దూరమయింది.ఇక ఏపీలో కూడా కమ్మ వర్గ నాయకులు ఒక్కొక్కరుగా నిష్క్రమస్తున్న వైనం, పార్టీ నాయకత్వానికి సహజంగానే ఆందోళన కలిగిస్తోంది. వ్యాపార కోణంలో మరో నలుగురు కమ్మ వర్గ ఎమ్మెల్యేలు కూడా నిష్ర్కమించేందుకు సిద్ధంగా ఉన్నారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల ఇసుక కొరతకు నిరసనగా లోకేష్ గుంటూరులో నిర్వహించిన ధర్నాకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, యరపతినేని హాజరుకాకపోవడం, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు వచ్చి వెళ్లిపోవడం, తాజాగా పొన్నూరు నియోజకవర్గంలో లోకేష్ పర్యటనకు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కనిపించకపోవడం చర్చనీయాంశమయింది.కమ్మ వర్గానికే చెందిన గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఇటీవలే బిజెపిలో చేరారు. అధికారంలో ఉండగా కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన సీఎల్ వెంకట్రావుదీ అదే దారి. 

అదేవిధంగా పార్టీ అధికారంలో ఉండగా మీడియా, సినిమా సహా, మిగిలిన రంగాల్లో నాయకత్వం ఏరికోరి నియమించుకున్న కమ్మ వర్గ ప్రముఖులు, ఈ ఐదునెలల్లో భూతద్దం వేసి వెతికినా కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. రాజకీయవేత్తలను కాకుండా ధనవంతులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, అవకాశవాదులను ప్రోత్సహించడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. పార్టీ కార్యాలయంలోనూ ఆ వర్గం పెత్తనం ఇంకా తగ్గలేదని, నిజానికి మార్పు సంకేతాలు అక్కడి నుంచే ప్రారంభం కావాలన్న వ్యాఖ్యలు మాజీ మంత్రుల స్థాయి నుంచి వినిపిస్తున్నాయి. గతంలో శ్రీనివాసయాదవ్ స్థానంలో కృష్ణాయాదవ్, ఐవైఆర్ కృష్ణారావు స్థానంలో ఆనందసూర్యను ప్రత్యామ్నాయంగా నియమించిన నాయకత్వం.. వంశీ, అవినాష్ వెళ్లిపోతారని తెలిసినా వారికి ప్రత్యామ్నాయంగా మరొకరిని ప్రకటించకపోవడంతో.. నాయకత్వం ఒక్కో వర్గం విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తోందన్న విమర్శలకు గురవుతోంది.అయితే.. సొంత సామాజికవర్గమే షాకులిచ్చి వెళ్లిపోతున్న నేపథ్యంలో, బిసి, రెడ్డి, మాదిగ వర్గ నేతలు మాత్రం పార్టీకి దన్నుగా నిలవడం విశేషం. పార్టీ అధికారంలో ఉండగా నెల్లూరు జిల్లాలో పార్టీ సైనికుడయిన సోమిరెడ్డిని పక్కకుపెట్టి, నారాయణకు పెత్తనం ఇచ్చింది. వ్యాపారస్తుడైన నారాయణ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా తీసేవారు కాదు. ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాస్‌దీ అదే నిర్లక్ష్యం. కానీ వారిద్దరికీ నాయకత్వం పెద్ద పీట వేసింది. అయితే నారాయణ ఎక్కడా కనిపించడం లేదు. గంటా బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఫలితంగా నెల్లూరు మళ్లీ పార్టీకి సోమిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రనే దిక్కయ్యారు. సోమిరెడ్డిని ఏనాడూ ఐదేళ్లు పూర్తి స్థాయి మంత్రిగా ఉంచిన దాఖలాలు లేవు. కాగా రాయలసీమలో రెడ్డి వర్గమే టిడిపికి ఇప్పటికీ దన్నుగా నిలవడం విశేషం.

గత రాజ్యసభ ఎన్నికల సందర్భంగా సీటు ఆశించి భంగపడిన మాదిగ వర్గ నేత వర్ల రామయ్య, ఏకంగా జిల్లా మార్చి పోటీ చేయించిన మరో మాదిగ వర్గ నేత జవహర్, ఇటీవలి ఎన్నికల్లో కోరుకున్న సీటు అడిగినా దక్కించుకోలేకపోయిన ఇంకో మాదిగ వర్గ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్, గత ఎన్నికల్లో సీటు దక్కని బిసి నేత పంచుమర్తి అనురాధ, బీసీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతోపాటు.. బిసి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, కాపు నేత చినరాజప్ప, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వంటి కమ్మేతర నాయకులే ఇప్పుడు దిక్కయిన పరిస్థితి. వీరిలో ఒకరిద్దరు తప్ప, మిగిలిన వారిది ఒక్కో వ్యధ. అయినా వారంతా ఈ క్లిష్ట పరిస్థితిలో గత పరాభవాలు దిగమింగి, వైసీపీ నుంచి ఒత్తిళ్లను తట్టుకుని పార్టీకి దన్నుగా నిలబడటమే గొప్ప అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సొంత కులంChandrababu-Naidu-300x200.jpg వారే కష్ట సమయంలో వెళ్లిపోతుంటే, ఇతర వర్గాల వారే ధైర్యంగా నిలబడుతున్న నేపథ్యంలో.. పార్టీ నాయకత్వం తన కుల సమీకరణ విధానాన్ని మార్చుకుని, ఇతర వర్గాలకు పట్టం కడితే తప్ప టిడిపికి భవిష్యత్తు లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అందులో భాగంగా మాదిగకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్న సూచన వ్యక్తమవుతోంది. ఇప్పటికే బిసి నేత కళా వెంకట్రావుకు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన నాయకత్వం, మాదిగకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ద్వారా, మాదిగలకు చేరువకావచ్చంటున్నారు. గత ఎన్నికల ముందు మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటుచేయాలన్న సూచనను బాబు పెడ చెవిన పెడితే.. జగన్ సీఎం అయిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటుచేయడాన్ని మాదిగ నేతలు గుర్తు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, rama123 said:

Reddy mudra leda ycp ki

Reddy caste has more acceptability in society than any other caste. that is a fact

Jaggad vachhaka vaallaki kooda kula gajji peaks vellindhi kani in general reddy caste andariki kalupukupotharu ane naanudi undi before independence nunche. They are mostly ruling caste and still their domination continues where ever their presence is there. Adhikara darpam unna avasaraaniki sahayam chestharu ane peru kooda vaallaki undi

 

Link to comment
Share on other sites

17 minutes ago, TDP_2019 said:

Reddy caste has more acceptability in society than any other caste. that is a fact

Jaggad vachhaka vaallaki kooda kula gajji peaks vellindhi kani in general reddy caste andariki kalupukupotharu ane naanudi undi before independence nunche. They are mostly ruling caste and still their domination continues where ever their presence is there. Adhikara darpam unna avasaraaniki sahayam chestharu ane peru kooda vaallaki undi

 

👍

Link to comment
Share on other sites

తాజాగా పొన్నూరు నియోజకవర్గంలో లోకేష్ పర్యటనకు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కనిపించకపోవడంచర్చనీయాంశమయింది.

aayana ayyappa mala lo vunnadu... Lokesh vachindi chanipoina valla intiki... mala lo vundi akkadaki vellakudadu ani raledu... 

Link to comment
Share on other sites

1 hour ago, Gunner said:

తాజాగా పొన్నూరు నియోజకవర్గంలో లోకేష్ పర్యటనకు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కనిపించకపోవడంచర్చనీయాంశమయింది.

aayana ayyappa mala lo vunnadu... Lokesh vachindi chanipoina valla intiki... mala lo vundi akkadaki vellakudadu ani raledu... 

Oh I see...thanks Gajanna....ekkado chadivaa....pakka chupulu chustunnadu ani.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...