Jump to content

సాఫ్ట్ హిందుత్వ వద్దు ఆత్మగౌరవమే ముద్దు


krantionline29

Recommended Posts

గత కొంతకాలంగా తెలుగుదేశం హిందూ మాట వాదం అందుకోవాలని కొందరు వాదిస్తున్నారు.

అసలు ఉండగా నకిలీని ప్రజలు నమ్మరు. 

 మూల సిద్ధాంతాలైన తెలుగువాడి ఆత్మ గౌరవం, పేద వాడికి కూడు గూడు నిద్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లాంటి వాటిని నమ్ముకోవటం మంచిది.
 

Detailed analysis : 

https://telugudigestsite.blogspot.com/2019/11/blog-post_17.html

 

Link to comment
Share on other sites


గత కొంతకాలంగా తెలుగుదేశం హిందూ మతవాదం అందుకోవాలని కొందరు వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రిష్టియన్ కావటంతో హిందుత్వ నినాదం తెలుగుదేశం పార్టీకి రాజయకీయంగా లాభం చేస్తుంది అని వారి వాదన. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా క్రిష్టియన్ అయిన వైవి సుబ్బారెడ్డి నియమించడం, తిరుమలలో అన్యమత ప్రచారం, గ్రామ సచివాలయంలో క్క్రైస్తవ ప్రార్థనలు లాంటి విషయాలు ఈ మధ్యన వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.

ఒక మతం మనోభావాలను కించపరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు నిరసన వ్యక్తం చేయటంలో తప్పు లేదు. అయితే హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుని జగన్ మోహన్ రెడ్డి ని ఇరకాటం లో పెట్టాలి అనే వాదనలో అంతగా పసలేదు. హిందుత్వ వాదానికి ప్రతినిధిగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఉంది. వారు జగన్ పై ఈ అస్త్రాన్ని వాడటానికి ఇప్పటికే పని మొదలు పెట్టారు. ఇపుడు తెలుగుదేశం పార్టీ ఈ వాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళితే అది పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తుంది తప్ప తెలుగుదేశానికి వచ్చే ఉపయోగం లేదు.

2019 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గుళ్ళ చుట్టూ తిరిగి తన జంధ్యాన్ని ప్రదర్శించి సాఫ్ట్ హిందుత్వ అనే ప్రయోగం చేశారు. అయితే ఆ ప్రయత్నం ఆయనకి ఫలితాన్ని ఇవ్వలేదు. అదే విధంగా 2009 ఎన్నికల కోసం చంద్రబాబు తెలంగాణ వాదాన్ని అందుకున్నారు. అయితే తెలంగాణ వాదం విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి నే ఛాంపియన్గా నిలిచింది. ఆఖరికి తెలంగాణలో తెలుగుదేశం ఉనికే ప్రస్నార్ధకంగా మారింది.

అసలు ఉండగా నకిలీని ప్రజలు నమ్మరు. కనుక తెలుగుదేశం సాఫ్ట్ హిందుత్వ లాంటి ప్రయోగాలు చేయకుండా తమ మూల సిద్ధాంతాలైన తెలుగువాడి ఆత్మ గౌరవం, పేద వాడికి కూడు గూడు నిద్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లాంటి వాటిని నమ్ముకోవటం మంచిది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...