Jump to content

రివర్శ్ లో చేసిన జగన్ పనికి అభినందనలతో


Cyclist

Recommended Posts

రివర్శ్ లో చేసిన జగన్ పనికి అభినందనలతో

జనవరి పైన అన్న అమ్మ ఒడి డబ్బు ఇస్తాడు. భద్రంగా దాచి పెట్టుకోండి, స్కూళ్లకు సెలవులు ఇచ్చి తెర్చే వరకు. అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు సరిగా చెప్పకపోతే, ప్రైవేటు పాఠశాలల్లో చేర్చండి, జగన్ కు కృతజ్ఞత చెబుతూ.

పిల్లలు లేకుండా ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తే మనకేం నష్టం.

ప్రైవేటు పాఠశాలల్లో పెరిగే రద్దీకి తగ్గట్టు, ఫీజులు పెంచతారు. పిల్లలు బాగా చదువుకొంటుంటే వాటికి వెనకాడకండి. వారి భవిష్యత్తు ముఖ్యం.

ఆంధ్రా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుండా పోవచ్చు భవిష్యత్తులో. అప్పుడు ప్రభుత్వం అమ్మోడి అమ్మఒడికి అంత ఇవ్వలేమని చేతులు ఎత్తేయదని గ్యారంటీ ఏమీ లేదు.

అప్పటికి ప్రభుత్వ పాఠశాలలు ఎలాగూ వుండవు. అప్పుడు పవన్ కల్యాణ్, చంద్రబాబు, వెంకయ్య నాయుడు పిల్లల్లా మనం కూడా ప్రైవేటులోనే, వారికి సమానంగా, ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నామని గర్విస్తూ ఆనందిద్దాం. రివర్శ్ లో చేసిన జగన్ పనికి అభినందనలతో, చివరగా ఇంగ్లీష్ లో ఓ మాట చిల్… యా. #చాకిరేవు.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...