Jump to content

నిరక్షరాస్యత అని తెలుగులో పలకలేని ఆంగ్ల అక్షరాస్యత


Cyclist

Recommended Posts

ప్రస్తుతం దగ్గర దగ్గర మన ఆంధ్రాలో 30 శాతం నిరక్షరాస్యత వుంది. నిరక్షరాస్యత అని తెలుగులో పలకలేని ఆంగ్ల అక్షరాస్యత అందులో భాగం కాదు. 

ఏ మీడియం అయినా చదువుల మీద నిర్లక్ష్యంతో నిరక్షరాస్యత ఒక పార్శ్వం అయితే, ఆర్థిక పరిస్థితులతో బడి మానిపించి పనుల్లొ పెట్టడం మరో పార్శ్వం. 

మాతృ బాషలో భోదిస్తూ వున్నా నిరక్షరాస్యత నమోదవుతున్నది అన్నది కూడా నిష్టుర సత్యం.  

ఇక ఆంగ్ల మాధ్యంలో భోధిస్తే నిరక్షరాస్యత కొంత అభివృద్ధి చెందుతుంది అనేది కాదనలేని సత్యం. 

ఎన్నో బాషలు వచ్చిన ఒక పండితుని మాతృబాష కనుక్కోడానికి గట్టిగా చరిస్తే తెలుగులో అరిచాడాని అలా తెనాలి రామలింగడు చేశాడని ఓ కథ వుంది. 

అమ్మ ఒడి  నుండి బడికి వచ్చి బిక్కు బిక్కు మని కూర్చొనే పిల్లాడికి, ఆడి మాతృ బాషలో కాకుండా వేరే బాషలో చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే, ఇంతో కొంత ఆంగ్లం వస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ మిగిలిన పాఠ్యాంశాల మీద పట్టు రావడం అటుంచి అవగాహన అయినా ఏర్పడుతుందా అంటే, అవి ఉపాధ్యాయుల సహనం & నేర్పు మీద ఆధారపడి వుంటుంది. ఏ మాత్రం ఒక ఉపాధ్యాయుడు ఆషామాషీగా తీసుకొన్నా ఆ సంబంధిత తరగతి విద్యార్థులు నష్టపోతారు. 

మొదట ఆంగ్ల మీడియానికి తగ్గ అర్హత మన ఉపాధ్యాయులకు వుందా అనే ప్రశ్న కాని,  సామూహిక పరీక్ష కాని వారికి పెట్టి పరీక్షంచలేదు. 

ఉన్నఫలంగా వెంకయ్య నాయుడు, చంద్ర బాబు నాయుడు & రాజశేఖర్ రెడ్డిల పిల్లల్లా ఇంగ్లీష్ మీడియం ల లో ఆంధ్రా లో పిల్లల్ని అంత చక్కగా చదివించడం అవుతుందా? ఒక వేల అంత బాగా చదువుకోలేక పోతే, వారికిలా ఆంధ్రాలో పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను తమ వృత్తుల్లో తమ పిల్లలు నిలబడాలని కోరుకొంటారా? 

అక్షరాస్యతను అర్థం చేసుకొని అటు మల్లించడానికి కొన్ని తరాలు పట్టింది. ఇప్పటికీ లింగ బేధాలు దాటి, సమానంగా అనుకొనే మంచి స్కూల్లలోనే చదివించడం లేదు. ఆంగ్ల మాధ్యంతో అవస్థలు పడి అర్థాంతరంగా చదువులు ఆగిపోతే వారి పూచీ ఎవరిది? 

ఉపాధ్యాయులదా? ప్రభుత్వానిదా?  

పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలతో రేపటి రంగమేదుంటుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. 

పాఠ్యాంశాలు ఆకలింపుజేసుకొనేలా చేసి, ఏ సమస్యకైనా, ఏ రంగానికైనా సిద్ధపడే సమర సైనికుల్లా విద్యార్థులను తీర్చి దిద్దాలి. 

వ్యవసాయ ఆధారిత దేశంలో అప్పుడే నిత్యావసరాల ధరల మీద గగ్గోలు మొదలయ్యింది. వ్యవసాయ ఉత్పత్తులను కూడా దిగుమతులు చేసుకొనే దేశంగా అప్పుడప్పుడూ చూస్తున్నాం. దిగుమతులు పెరిగే కొద్ది దరిద్రంతో ఆకలి కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో వ్యవసాయ రంగం, ఐటీ రంగానికి మించి ఆర్జించే రంగంలా కనిపిస్తోంది. 

నీకు గిట్టుబాటు లేని పని నువ్వు చెయ్యడం లేదు. వేరే దేశానికి చేస్తున్నావు. 
నాకు గిట్టుబాటు కాని ధరకు ఈ దేశంలో నేనెందుకు అమ్మాలి అని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కువైతే, ఆ రంగం ఇచ్చే ఉపాధి ముందు ఏ రంగం నిలబడలేందు? 

మన ముందు తరాలకు తెలిసిన వ్యవసాయ రంగం మెలకువలు అర్థం చేసుకోడానికి అయినా మాతృబాషలో చదివే కొంత మిగులు వుండాలి. మన మట్టి వాతావరణం పరిస్థితులకు ఇంగ్లీషులో మాన్యువల్స్ దొరకవు. అది మన ముందు తరం నుండి మనం నేర్చుకోవాలి. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మనకే మనసుకు రాని ధరలకు పెరిగాయి. అది బయటకు వెళితే అందరూ అటు మళ్లితే ఇంగ్లీష్ చదువులతో వచ్చే జీతాలకు మూడు పూటలు తినడం కూడా కష్ట కావచ్చు. 

కానీ వైఎస్, బాబు, వెంకయ్య నాయుడుల తరాలకు ఇబ్బంది రాదు. భూమి నుండి ఏమీ లేని వారికే మీడియం మింగుడుపడక పోవచ్చు. రెండూ వుంటే ఇష్టం వున్న వారు ఇష్టం వచ్చింది చదువుకొని తమ జీవితాలను మలచుకొంటారు. ఒకటే దారి అయితే, వచ్చే సామాజిక, సాంస్కృతిక మార్పులు ఘోరంగా వుంటాయి. 

అందరికీ ఇంగ్లీషు ఉద్యోగాలు దొరకవు. అందరికీ తెలుగు ఉద్యోగాలు దొరకవు. రెండూ నేర్చుకోవడం కష్టం కాదు. కనీసం ఒకటైనా ఇష్టంగా చదివే వెసులుబాటు వుండాలి. 

డబ్బున్నోడి ఇంట ఫ్రెంచ్, చైనీస్ గట్రాలు కూడా నేర్పిస్తున్నారు. 

పేడోడికి అర్థమయ్యే బాషలో పునాది వెయ్యండి. దాని మీద వాడికి వున్న ఇష్టంతో సౌధాలు నిర్మించుకొంటారు. సౌధాలు అని పలకడం రాని ఇంగ్లీషులకు ఇది అర్థం అవుతుంది అనే ఆశకూడా లేదు. #చాకిరేవు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...