Jump to content

Ayodhya Verdict


Yaswanth526

Recommended Posts

  • Replies 101
  • Created
  • Last Reply

Utkarsh Anand‏ @utkarsh_aanand

Inappropriate for SC to entwr into area of theology, true test is faith and belief of worshippers of mosque, says SC in #AyodhyaJudgment

Suit by Nirmohi Akhara is barred by limitation, rules #SupremeCourt in #AyodhyaJudgment.

#NirmohiAkhara is a shebait, holds #SupremeCourt in #AyodhyaJudgment.

Link to comment
Share on other sites

Suuni Waqf Board's suit is maintainable but they can't assert right to adverse possession: SC in #AyodhyaJudgment

Mere evidence of existence of a pre-dated structure can't be teb sole basis to give the title today, says SC on suit by Sri Ram Lala Virajman.

On the other hand, there was no cessation of namaz or abandonment of structure by the Muslims, never completely lost the possession of the disputed property: #SupremeCourt in #AyodhyaJudgment

 

Link to comment
Share on other sites

అయోధ్య : ఓ సుదీర్ఘ న్యాయ వివాదం
09-11-2019 01:53:07
 
 
637088846998424345.jpg
  • 1885లోనే తొలిసారిగా కోర్టు కేసు
  • అలహాబాద్‌ హైకోర్టు తీర్పుతో మలుపు
  • కక్షిదారులకు సమాన వాటా ఇచ్చిన బెంచ్‌
  • భూవివాదంగానే పరిగణిస్తున్న సుప్రీం
 
న్యూఢిల్లీ: నిజానికి 1822లోనే ఫైజాబాద్‌ కోర్టు అధికారి హఫీజుల్లా దీన్ని ఓ వివాదంగా ఓ కేసులో పేర్కొన్నారు. కానీ తొలి వ్యాజ్యం మాత్రం 1857లో పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మొహమ్మద్‌ అస్ఘర్‌ దీన్ని వేశారు. అయోధ్య నగరం మధ్యలో ఉన్న హనుమాన్‌ గఢీ మహంత్‌ బాబ్రీ మసీదు తూర్పు ప్రాంతాన్ని బలవంతంగా లాక్కున్నారని ఆయన అందులో ఆరోపించారు. హనుమాన్‌ గఢీలోనే వైష్ణవ బైరాగులనేక మంది ఉండేవారు. ఈ కేసుపై ప్రతిగా వారూ ఓ కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం రాముడు పుట్టిన చోటు అని పేర్కొంటూ, వైష్ణవ సంప్రదాయాలను అనుసరించే ధార్మిక సంస్థగా తమకు దానిపై చట్టపరంగా హక్కు ఉందని చెబుతూ 1857లో - ఈ సాధువులకు చెందిన ‘నిర్మోహీ అఖాడా’ కేసు వేసింది. ఈ రెండింటినీ విన్నాక బ్రిటిష్‌ ప్రభుత్వం అక్కడ మధ్యలో ఓ గోడ కట్టించి, హిందువులంతా తూర్పు వైపు నుంచీ, ముస్లింలు ఉత్తరం వైపు గేటు నుంచి ప్రవేశించాలని ఆదేశించింది. 1860-84 మధ్య అనేక కేసులు దాఖలయ్యాయి. అవన్నీ మసీదు భూమిపై ఇరువర్గాలు దాఖలు చేసినవి. కానీ అతి ముఖ్యమైన కేసు మాత్రం 1885లో పడింది. రామ జన్మస్థానానికి తానే మహంత్‌నని ప్రకటించుకుంటూ- మసీదు ఆవరణలో- రామ్‌ చాబుత్రా వద్ద రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రఘువర్‌ దాస్‌ అనే ఓ ధార్మిక నేత ఓ కేసు వేశారు. కానీ దీన్ని కోర్టు 1986లో కొట్టేసింది. అయితే హిందువులు రామజన్మభూమిగా బాబ్రీమసీదు ప్రాంతాన్ని ిస్థిరపరిచేందుకు ఇది దోహదపడింది. అక్కడ నుంచీ 1923దాకా అనేక వ్యాజ్యాలు నడిచాయి.
 
1949... విగ్రహ స్థాపన
1949 అర్థరాత్రి బాబ్రీ మసీదులోపల- కొందరు వ్యక్తులు బలవంతంగా సీతా రామలక్ష్మణుల విగ్రహాలను పెట్టారన్న వివాదం- దేశ చరిత్రలోనే అతి పెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న తొలి వేకువలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. బాబ్రీ మసీదు అనేది వివాదాస్పద ప్రాంతమనీ పేర్కొంటూ- యథాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ ఫైజాబాద్‌ కోర్టు 1949 డిసెంబరు 29న కీలకమైన తీర్పునిచ్చింది. ప్రధాన గేటుకు తాళం వేశారు. ముస్లింలకు లోపలికి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. హిందూ విగ్రహాలకు పూజల నిమిత్తం ఓ నలుగురు పూజారులను అనుమతిచ్చారు. ఓ సైడు గేటు వెలుపలి నుంచి హిందువులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. హిందూ మహాసభ కార్యకర్త గోపాల్‌ సింగ్‌ విశారద్‌ 1950 జనవరి 16న ఓ కేసు వేశారు. ‘‘అక్కడున్న విగ్రహాలు ఎప్పటికీ తొలగించరాదు. ఎటువంటి అడ్డంకులూ లేకుండా పూజలు చేసుకోనివ్వాలి... ’’ అన్నది ఆ కేసు. అది రాముడు పుట్టినచోటనీ తమకు దాన్ని అప్పగించేయాలని నిర్మోహీ అఖాడా 1959లో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. వీటన్నింటినీ చూశాక 1961 డిసెంబరు 18న సున్నీ వక్ఫ్‌ బోర్డు రంగప్రవేశం చేసింది. బాబ్రీ మసీదును బాబర్‌ కట్టించాడనీ, అది తమకే చెందుతుందనీ వాదించి అప్పగించాలని కోరింది.
 
అలహాబాద్‌ హైకోర్టు ‘సమన్యాయం’
వాదనలన్నీ సమగ్రంగా విన్నాక 2010 జూలై 26న అలహాబాద్‌ హైకోర్టు త్రిసభ్య బెంచ్‌ తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకూ సమంగా కేటాయిస్తూ సమన్యాయం చేస్తున్నట్లు జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌, జస్టిస్‌ డీవీ శర్మ, జస్టిస్‌ ఎస్‌యూ ఖాన్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. కేంద్ర గుమ్మటం కింద- విగ్రహాలున్న చోటును రామ్‌లాలాకు వదిలివేయాలని పేర్కొంది. రామ్‌ చబుత్రా, సీతా రసోయి మధ్య ఉన్న చోటును నిర్మోహీ అఖాడాకు, ఇతర గుమ్మటాల కింది ప్రాంతాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించింది. అయితే ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదును బాబర్‌ చక్రవర్తి కట్టాడన్న విషయంలో జడ్జీలు విభేదించారు. ఇద్దరు హిందూ జడ్జీలూ ఆలయాన్ని కూల్చి కట్టినట్లుగా పురావస్తు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొనగా- ఇది నిజం కాదనీ, ఏ ఆలయాన్నీ కూల్చి కట్టిన దాఖలాలు లేవని ముస్లిం జడ్జి ఎస్‌యూ ఖాన్‌ అభిప్రాయపడ్డారు.
 
 
1986 నుంచి మారిన సీను
1949లో ఫైజాబాద్‌ జడ్జి తీర్పు దరిమిలా వేసిన తాళాలు తెరవాలని 1986లో ఆదేశాలు వెలువడ్డాయి. అయోధ్య వివాదానికి సంబంధించిన కేసులన్నీ అలహాబాద్‌ హైకోర్టు- లఖ్‌నవూ బెంచ్‌కు బదిలీ అయ్యాయి. గోపాల్‌సింగ్‌ విశారద్‌ వేసినది మొదటి కేసుగా, రామచంద్రదాస్‌ పరమహం్‌సది రెండో కేసుగా (దీన్ని ఆ తరువాత ఉపసంహరించారు), నిర్మోహీ అఖాడాది మూడో కేసుగా, సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డుది నాలుగో కేసుగా పరిగణించారు. 1989లో దేవుడిని (రామ్‌లాలా) సైతం కక్షిదారుగా చేశారు. బాల రాముడికి తాను స్నేహితుడనని పేర్కొంటూ, రామ్‌లాలా విరాజమాన్‌ను ఓ పార్టీగా చేస్తూ దేవకీనందన్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి వేసిన కేసును కోర్టు పరిగణించింది.
 
 
సుప్రీంకు మారిన సీను
అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఏ పక్షాన్నీ సంతృప్తి పరచలేదు. 2011 నుంచీ దీనిపై అప్పీళ్లు దాఖలయ్యాయి. మొత్తం 14 మంది ఈ తీర్పును సవాలు చేయడంతో తీర్పు అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2017-19 మధ్య నుంచీ కేసు విచారణ ఊపందుకుంది. ఇది భూవివాదమేనని స్పష్టం చేస్తూ వివిధాంశాలపై అప్పటి సీజే దీపక్‌ మిశ్రా తుది విచారణకు మార్గం వేశారు. ఆయన తరువాత బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ‘మేమే తేల్చేస్తాం’ అని ప్రకటించి- దీనికి ఓ చరమగీతం పాడాలన్న కృతనిశ్చయాన్ని కనబర్చారు. తదనుగుణంగానే ఐదుగురు జడ్జీలతో ఓ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసి 40 రోజుల పాటు ఏకధాటిగా విచారణ జరిపారు. అది ముగిసిన 22 రోజులకే తీర్పు వెలువరించనుండడం విశేషం.
 
 
బాబ్రీ నేలమట్టంతో మలుపు
1990ల్లో రామజన్మభూమి వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబరు 6న లక్షలమంది కరసేవకులు బాబ్రీమసీదును నేలమట్టం చేశారు. ఇది ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. మసీదు విధ్వంసానికి దారితీసిన కారణాలపై జస్టిస్‌ మన్మోహన్‌సింగ్‌ లిబర్హాన్‌ కమిషన్‌ వేశారు. రాజకీయ వివాదాలు పక్కనపెడితే.. 1992-2002 మధ్య అలహాబాద్‌ హైకోర్టులో వాదనలు చురుగ్గానే సాగాయి. మసీదు కింద ఆలయం ఉండేదా.. అన్న విషయాన్ని తేల్చాల్సిందిగా 2002లో అలహాబాద్‌ హైకోర్టు పురావస్తు శాఖను ఆదేశించింది. 2003లోనే ఏఎ్‌సఐ తన నివేదిక ఇచ్చినా ఆ తరువాత ఏడేళ్లపాటు కేసు అలా సాగుతూనే వచ్చింది.
Link to comment
Share on other sites

ఎవరి వాదన ఏమిటి?
09-11-2019 01:55:35
 
 
637088613392310505.jpg
అయోధ్య కేసు విచారణను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న పూర్తి చేసింది. వివాదాస్పద స్థలం మొత్తం విస్తీర్ణం.. 2.77 ఎకరాలు. ఈ భూమిపై దశాబ్దాల నాటి వివాదంలో హిందూ, ముస్లిం పక్షాల వాదనలు సాగాయి. హిందూ పక్షంలో నిర్మోహి అఖాడా, భగవాన్‌ శ్రీరామ్‌ లాలా విరాజ్‌మాన్‌, అఖిల భారత హిందూ మహాసభ, రామ జన్మభూమి న్యాస్‌ తదితరులు కక్షిదారులు.. ముస్లిం పక్షంలో సెంట్రల్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు, మహమ్మద్‌ ఇక్బాల్‌ అన్సారీ, దివంగత ఎం.సిద్దిఖ్‌ తరఫున అతని వారసుడు, సెంట్రల్‌ షియా వక్ఫ్‌ బోర్డు తదితరులు కక్షిదారులు.
 
 
హిందూ పక్షం వాదన
అయోధ్యలో వివాదాస్పద భూమి మొత్తం శ్రీరాముడి జన్మస్థానం. ఇది కోట్లాది హిందువుల విశ్వాసం. పురాణాల్లోనూ ఉంది. ఈ విశ్వాసమే సాక్ష్యం. ఆ స్థలం మొత్తం దేవుడికే చెందుతుంది. రామజన్మభూమి అనేది చట్టపరంగానూ నిలుస్తుంది. ఇది దేవుడి ప్రతిరూపమై ఆరాధనా క్షేత్రమైంది. అక్కడ మహిమాన్వితుడైన పరాత్పరుడు ఉంటాడని అందరి నమ్మకం. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. వివాదాస్పద స్థలంలో ఆలయం ఉండేదని 2003లో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) నివేదిక కూడా ఇచ్చింది. అక్కడ మసీదు నిర్మించినప్పటికీ రామ జన్మభూమి తన దైవత్వాన్ని కోల్పోలేదు. ఆలయాన్ని కూల్చివేసినా దాని పవిత్రత అలాగే ఉంటుంది. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించి ఉండవచ్చు. అంతమాత్రాన ఆ స్థలం తమదే అనే హక్కు వారికి ఉండదు. బాబ్రీ మసీదు నిర్మాణం లోపల మనుషులు, జంతువుల విగ్రహాలు కనిపించాయి. విగ్రహారాధన ఇస్లాం విశ్వాసానికి వ్యతిరేకం.
 
 
ముస్లిం పక్షం వాదన
వివాదాస్పద స్థలంలో ఏదైనా ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారా అనే అంశంపై పురావస్తు శాఖ నివేదిక అసమగ్రంగా ఉంది. తుది విశ్లేషణ ఎవరు చేశారు, నివేదికను ఎవరు రూపొందించారో తెలియదు. దానిపై సంతకం కూడా లేదు. అయోధ్య శ్రీరాముడి జన్మస్థానం కావొచ్చు. కాదనం. కానీ వివాదాస్పద స్థలంలోనే రాముడు పుట్టాడన్నదానికి ఆధారాల్లేవు. అక్కడ ఉన్నది బాబర్‌ హయాంలో నిర్మించిన బాబ్రీ మసీదు మాత్రమే! ప్రధాన గుమ్మటం కింద హిందువులు ప్రార్థనలు చేసినట్లు ఆధారాలు లేవు. బయటి ఆవరణలోని రామ్‌ చబుత్రాలోనే ఎప్పుడూ పూజలు జరిగాయి. ఆ స్థలం 1949 వరకు ముస్లింల ఆధీనంలోనే ఉంది. అప్పటి వరకు ప్రార్థనలు జరిగాయి. 1949 డిసెంబరు 22-23న ఓ అర్థరాత్రి వేళ ప్రధాన గుమ్మటం కింద విగ్రహాలు పెట్టారు. పురాణాలు, ఇతిహాసాలు, దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల కథనాల ఆధారంగా నిర్ణయాలు జరగరాదు. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పాలి. మసీదును కూల్చేశారన్నది ఇటీవలి చరిత్ర. దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...