Jump to content
Sign in to follow this  
koushik_k

అన్నా అంటూనే సున్నం!.. ఎల్వీకి అవమానకర ఉద్వాసన

Recommended Posts

  • ఆరు నెలల్లోనే హీరో నుంచి జీరోకు ఎల్వీ
  • వివాదాస్పద జీవోలతో చెలరేగిన ప్రవీణ్‌
  • తన పేషీ అధికారికి షోకాజ్‌తో సీఎం ఆగ్రహం
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎల్వీ సుబ్రమణ్యం! ఒకప్పుడు పెద్దగా ప్రాచుర్యంలో లేని పేరది! కానీ... ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఒక్కసారిగా ఎల్వీ పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌... ‘నాకు అధికారం కొత్త. నేను తీసుకునే నిర్ణయాల్లో లోటుపాట్లు కనిపిస్తే... ఎల్వీ సుబ్రమణ్యం అన్న, డీజీపీ గౌతం అన్న గైడ్‌ చేస్తారు. అన్నలు అందరం కలిసి పని చేద్దాం’’ అని చెప్పినప్పుడు... ఎల్వీ సుబ్రమణ్యంతోపాటు మొత్తం ఐఏఎ్‌సలు పొంగిపోయారు. ‘అధికారులను అన్నా అని పిలిచే సీఎం’ అనుకుని మురిసిపోయారు. కానీ... ఆరు నెలల కిందట ‘హీరో’ అయిన ఎల్వీ ఇప్పుడు ‘జీరో’ అయ్యారు. ‘అన్నా’ అని అప్పుడు పిలిచి... ఇప్పుడు సీఎస్‌ పదవి నుంచి తప్పించి ‘సున్నా’ చేసేశారు. ఆరు నెలల కిందట సీఎస్‌గా ఎల్వీ నియామకం ఒక సంచలనం! ఇప్పుడు... ఆయన
 
తొలగింపూ అంతే సంచలనం!
ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిందే తడవుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆయన్ను తప్పించి తనకు తానే ఎల్వీని చీఫ్‌ సెక్రటరీగా నియమించింది. ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సహజంగానే ఆయననే కొనసాగించారు. ‘చంద్రబాబు నన్ను నిష్కారణంగా పక్కనపెట్టేశారు. జగన్‌ ఆదరించారు’ అనే భావనతో ఎల్వీ కూడా అప్పట్లో అతి-ఉత్సాహంగా పని చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చందబ్రాబును పూర్తిగా విస్మరించడం, ఎన్నికల అధికారి బాధ్యతలను తానే దగ్గరుండి పర్యవేక్షించడం, కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేయడం వంటి చర్యల ద్వారా సర్వం తానై వ్యవహరించారు. అప్పటి సీఎంతో బహిరంగంగానే విభేదించి వార్తల్లోకి ఎక్కారు. తాను కోరుకున్న ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో ఇంక తిరుగులేదనుకున్నారు. కానీ, తానొకటి తలిస్తే జగన్‌ మరొకటి తలిచారు. ఎల్వీని నిర్దాక్షిణ్యంగా, నిర్మొహమాటంగా పదవి నుంచి తొలగించారు. ఏ మాత్రం పని, ప్రాధాన్యత లేని మానవ వనరుల ఆర్థికసంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా నియమించారు.
 
ప్రవీణ్‌ ప్రకాశ్‌తో ‘క్లైమాక్స్‌’!
తన పేషీ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు ఎల్వీ సుబ్రమణ్యం నోటీసు ఇవ్వడంపై సీఎం జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రతిపాదనలను కేబినెట్‌ ముందుంచమని నేనే ఆదేశించాను. ప్రవీణ్‌ ప్రకాశ్‌ దానిని పాటించారు. ఆ కారణంతో షోకాజ్‌ నోటీసు ఇవ్వడమేమిటి?’’ అని జగన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ఈ ప్రతిపాదనలను ప్రవీణ్‌ ప్రకాశ్‌ సీఎస్‌కు పంపి... కేబినెట్‌ ముందుంచాలని కోరారు. అయితే, నిబంధనల ప్రకారం తొలుత ఆర్థికశాఖ అనుమతి తీసుకుని ఫైల్‌ రీసర్కులేట్‌ చేయాలని సీఎస్‌ దాన్ని వెనక్కి పంపారు. ‘నేను చెప్పిన తర్వాత కూడా ఫైలు అటూ ఇటూ తిప్పుతారా’ అంటూ అంటూ జగన్‌ ఆగ్రహించారని... ఎల్వీపై వేటుకు అదే కారణమని చెబుతున్నారు.
 
అయితే... మొత్తం వివాదానికి ఇది ‘క్లైమాక్స్‌’ మాత్రమే. దీని వెనుక కొంత కథ నడిచింది. ఎన్నికలప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేయడం, తనకు సంబంధించిన కేసుల్లో ఎల్వీకూడా ఒకప్పుడు నిందితుడిగా ఉండటం వంటి కారణాలతో మొదట్లో ఎల్వీపై జగన్‌ కొంత సానుకూలత చూపినప్పటికీ క్రమేపీ ఆయన్ను దూరం పెట్టేశారు. నేరుగా తొలగించడం ఇష్టంలేక పొగబెట్టేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ పొగ పేరే ప్రవీణ్‌ ప్రకాశ్‌! ఢిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ను తన ముఖ్యకార్యదర్శిగా నియమించుకున్న సీఎం జగన్‌... సీఎస్‌కు చెక్‌ పెట్టేందుకు ఆయనను అస్త్రంగా వాడుకున్నారు. సాధారణంగా సీఎం పేషీ అధికారులు ఇతర విభాగాలకు అధిపతులుగా ఉండరు. కానీ... ప్రవీణ్‌ ప్రకాశ్‌ను తన ముఖ్య కార్యదర్శిగా కొనసాగిస్తూనే జీఏడీ పొలిటికల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కూడా నియమించారు. పొలిటికల్‌ సెక్రటరీకి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి.
 
సాధారణ పరిపాలనా శాఖ వ్యవహారాల్లో సీఎస్‌ తర్వాత పొలిటికల్‌ సెక్రటరీకే ప్రాధాన్యత ఉంటుంది. చీఫ్‌ సెక్రటరీ నియామకం, తొలగింపు ముఖ్యమంత్రి అధికారమే అయినప్పటికీ... జీవోలు ఇవ్వాల్సింది పొలిటికల్‌ సెక్రటరీనే. అందుకే వ్యూహాత్మకంగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ను ఆ పోస్టులో నియమించారు. ఆ వెంటనే సీఎం సూచనల మేరకే ప్రవీణ్‌ ప్రకాశ్‌ కొన్ని జీవోలు జారీ చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. తను చెప్పినట్లు సీఎస్‌ వినటం లేదన్న నిర్ణయానికి వచ్చిన సీఎం... బిజినెస్‌ రూల్స్‌లో మార్పులు చేయించి సీఎస్‌ కీలక అధికారాలను పొలిటికల్‌ సెక్రటరీకి బదలాయింపు చేశారు. దీంతో ఆగ్రహించిన సీఎస్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇదే అదనుగా భావించి సీఎస్‌పై ముఖ్యమంత్రి బదిలీ వేటు వేశారు.
 
అవమానకర ఉద్వాసన...
ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఏ చీఫ్‌ సెక్రటరీకి ఇలాంటి అవమానకరమైన ఉద్వాసన జరగలేదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనందరావు, స్వామినాథన్‌ అనే ఇద్దరు చీఫ్‌ సెక్రటరీలను తొలగించారు. పని విషయంలో అత్యంత నెమ్మదిగా వ్యవహరించడం, నెగిటివ్‌ మనస్తత్వం ఉండడం వంటి వివిధ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ... ఇద్దరినీ హూందాగానే తప్పించారు. తొలుత ఆనందరావును తప్పించినపుడు చంద్రబాబు అనేకమంది సీనియర్లతో సంప్రదింపులు జరిపారు. తన పేషీ ఇన్‌చార్జిగా ఉన్న ఎస్వీ ప్రసాద్‌ను ఆనందరావు వద్దకు పంపి పరిస్థితులు వివరించి, ఆయన్ను ఒప్పించారు. స్వామినాథన్‌ విషయంలో కూడా ఆయనతో మాట్లాడిన తర్వాతే బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు.
 
కానీ... ఎల్వీ విషయంలో అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఎల్వీ ఆదివారం హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి అతిథిగా హాజరై రాత్రికి అక్కడే ఉండిపోయారు. సోమవారం ఉదయానికి బహుశా సమాచారం అందిందో ఏమోకానీ... అమరావతి రాకుండా అక్కడే ఉండిపోయారు. మధ్యాహ్నానికే బదిలీ వేటు పడింది. ఎల్వీ బదిలీకి ముందు సీఎం పేషీలోనూ కొంత చర్చ జరిగినట్లు తెలిసింది. ‘‘సీఎ్‌సను ఇలా బదిలీ చేయడం సరికాదు. అధికార యంత్రాంగానికి తప్పుడు సంకేతాలు వెళతాయి’’ అని సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ... ముఖ్యమంత్రి వినలేదని సమాచారం. ‘నాకేమీ చెప్పొద్దు’ అని స్పష్టం చేసినట్లు తెలిసింది.
 
బాస్‌... సీఎస్‌!
కొన్ని ప్రత్యేక అధికారాలుంటాయి.. అధికార వర్గాల వెల్లడి
ప్రధాన నిర్ణయాలు ముఖ్యమంత్రి, మంత్రి మండలి తీసుకున్నప్పటికీ... అధికార యంత్రాంగంపై అజమాయిషీకి సంబంధించి సీఎ్‌సకు కొన్ని అధికారాలుంటాయి. దిగువ స్థాయి అధికారులు తప్పిదాలకు పాల్పడుతున్నప్పుడు వారిని హెచ్చరించడం, మందలించడం, అవసరమైన మేరకు నోటీసులు ఇవ్వడంలో సీఎస్‌ తన విచక్షణా అధికారాన్ని ఉపయోగించుకోవచ్చని... సస్పెన్షన్‌ వంటి తీవ్ర చర్యలకు మాత్రం సీఎం అనుమతి అవసరం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓ జిల్లా కలెక్టర్‌ను తక్షణం హైదరాబాద్‌కు పిలిపించమని తన డిప్యూటీ సెక్రటరీ లక్ష్మీ నారాయణకు సూచించారు అప్పటికే రాత్రి పొద్దుపోవడంతో లక్ష్మీనారాయణ ఆ కలెక్టర్‌కు ఫోన్‌చేసి... ‘సీఎం గారు రమ్మంటున్నారు. ఉదయానికల్లా రండి’ అని చెప్పేశారు. వాస్తవానికి ఏ కలెక్టర్‌ అయినా తన హెడ్‌క్వార్టర్‌ దాటి వెళ్లాలంటే చీఫ్‌ సెక్రటరీ అనుమతి తప్పనిసరి. ముఖ్యమంత్రి నేరుగా రమ్మన్నా సరే సీఎస్‌ నుంచి రాత పూర్వక అనుమతి తీసుకున్నాకే కలెక్టర్లు కదలాలి. అయితే, స్వయంగా సీఎం పేషీ అధికారి రమ్మనడంతో ఆ కలెక్టర్‌ హుటాహుటిన హైదరాబాద్‌ వచ్చారు. ఆ తర్వాత సీఎ్‌సకు సమాచారమిచ్చారు. అప్పటి చీఫ్‌ సెక్రటరీ కాకి మాధవరావు దీన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. ‘‘నిబంధనల ప్రకారం చీఫ్‌ సెక్రటరీ ద్వారానే కలెక్టర్‌ను పిలిపించాలి. కానీ, మీరు నేరుగా పిలిచి పొరపాటు చేశారు. సీఎం రమ్మన్నా కూడా నా ద్వారా పిలిపించి ఉండాల్సింది’’ అని లక్ష్మీనారాయణకు లేఖ రాశారు. దీంతో కంగారుపడిన లక్ష్మీ నారాయణ నేరుగా సీఎస్‌ దగ్గరకు వెళ్లి సారీ చెప్పారు. ‘‘అప్పటికే ఆలస్యం కావడంతో కలెక్టర్‌కు నేరుగా చెప్పాల్సి వచ్చింది. అది పొరపాటే. ఇంకెప్పుడూ ఇలా జరగదు’’ అని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇదొక్కటే కాదు... ఏ అధికారి అయినా చీఫ్‌ సెక్రటరీకి సబ్‌ ఆర్డినేట్‌గా వ్యవహరించాలి తప్ప... సీఎం దగ్గరో, మరొకరి దగ్గరో పనిచేస్తున్నామనే భావనతో ఉన్నత స్థాయి అధికారిని ధిక్కరిస్తూ వ్యవహరించడం పరిపాలనా విధానం కాదని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

Share this post

Link to post
Share on other sites
12 minutes ago, hari2999 said:

Ippudu padu mass raja  raja..kaja.. ani anali kani ilanti posts neeku suit kavu le lite teesuko

Inthaki candidate dorikada gannavaram ki. Deposit guaranteed ena ?  Padukonna ox ni lepi kick cheyinchukonnadanta evaro.  Ala undi e comment 
 
anti posts veste jagan mass leader kakunda pothada?  Vadu tappu Lu cheyada? 

As a party leader I like jagan. He will go any extent for his cadre and loyalists.    

jagan valla ap Loss ayndi anedi me point of view 

cbn gelavakapovatam valla jagan gelichadu ap loss ayndi anedi na view.  Daniki anugunamga na posts untai. 

Share this post

Link to post
Share on other sites
5 minutes ago, TDP_2019 said:

lite le. LV gadiki sympathy koooda akkarledu. let him rot

Agreed.  Kani bjp must take this seriously.  Tirumala lo non Hindus ni restrict cheyamannanduke e revenge which is not correct kada bro 

Share this post

Link to post
Share on other sites
3 hours ago, koushik_k said:

Inthaki candidate dorikada gannavaram ki. Deposit guaranteed ena ?  Padukonna ox ni lepi kick cheyinchukonnadanta evaro.  Ala undi e comment 
 
anti posts veste jagan mass leader kakunda pothada?  Vadu tappu Lu cheyada? 

As a party leader I like jagan. He will go any extent for his cadre and loyalists.    

jagan valla ap Loss ayndi anedi me point of view 

cbn gelavakapovatam valla jagan gelichadu ap loss ayndi anedi na view.  Daniki anugunamga na posts untai. 

Gannavaram lo tdp ki kukkani nilapeetina deposit vastundi. Gurthupettuko kukkani nilapettina ardam ainda

Share this post

Link to post
Share on other sites
6 minutes ago, hari2999 said:

Gannavaram lo tdp ki kukkani nilapeetina deposit vastundi. Gurthupettuko kukkani nilapettina ardam ainda

Bro time endhuku waste chesukuntunnaru alanti post ki reply ichi.  Ignore list lo pettandi.. Valani qoute chesi maku aa post kanipinchetattu cheyakandi.. 

Share this post

Link to post
Share on other sites
1 hour ago, Raaz@NBK said:

Bro time endhuku waste chesukuntunnaru alanti post ki reply ichi.  Ignore list lo pettandi.. Valani qoute chesi maku aa post kanipinchetattu cheyakandi.. 

Sure brother nenu lite teesukundam anna vundalekapotunna will try sure

Share this post

Link to post
Share on other sites
46 minutes ago, hari2999 said:

Sure brother nenu lite teesukundam anna vundalekapotunna will try sure

Alaane vuntundi Bro, paytm mahima 

Enni - ve post lu pedithe anni... Dabbulu anta 

Manam ignore cheyyatame

Share this post

Link to post
Share on other sites
8 hours ago, koushik_k said:

Inthaki candidate dorikada gannavaram ki. Deposit guaranteed ena ?  Padukonna ox ni lepi kick cheyinchukonnadanta evaro.  Ala undi e comment 
 
anti posts veste jagan mass leader kakunda pothada?  Vadu tappu Lu cheyada? 

As a party leader I like jagan. He will go any extent for his cadre and loyalists.    

jagan valla ap Loss ayndi anedi me point of view 

cbn gelavakapovatam valla jagan gelichadu ap loss ayndi anedi na view.  Daniki anugunamga na posts untai. 

ayite ippudu nuvvu kuda Raa Jaa Kaa Jaa antu tune anduko

Share this post

Link to post
Share on other sites
8 hours ago, koushik_k said:

cbn gelavakapovatam valla jagan gelichadu ap loss ayndi anedi na view.  Daniki anugunamga na posts untai. 

ila koda alochistara? edavataniki aneka karanalu ante idenemo

Share this post

Link to post
Share on other sites
11 hours ago, koushik_k said:

Inthaki candidate dorikada gannavaram ki. Deposit guaranteed ena ?  Padukonna ox ni lepi kick cheyinchukonnadanta evaro.  Ala undi e comment 
 
anti posts veste jagan mass leader kakunda pothada?  Vadu tappu Lu cheyada? 

As a party leader I like jagan. He will go any extent for his cadre and loyalists.    

jagan valla ap Loss ayndi anedi me point of view 

cbn gelavakapovatam valla jagan gelichadu ap loss ayndi anedi na view.  Daniki anugunamga na posts untai. 

As Hari bro said Gannavaram kuukka ni nunchobettina deposit vasthundhi.

Share this post

Link to post
Share on other sites
14 hours ago, koushik_k said:

Inthaki candidate dorikada gannavaram ki. Deposit guaranteed ena ?  Padukonna ox ni lepi kick cheyinchukonnadanta evaro.  Ala undi e comment 
 
anti posts veste jagan mass leader kakunda pothada?  Vadu tappu Lu cheyada? 

As a party leader I like jagan. He will go any extent for his cadre and loyalists.    

jagan valla ap Loss ayndi anedi me point of view 

cbn gelavakapovatam valla jagan gelichadu ap loss ayndi anedi na view.  Daniki anugunamga na posts untai. 

LV topic lo gannavaram sodhenti ... oorke vagatam tappa

Share this post

Link to post
Share on other sites
14 hours ago, koushik_k said:

cbn gelavakapovatam valla jagan gelichadu ap loss ayndi anedi na view.  Daniki anugunamga na posts untai. 

ahem... ahem ..

Share this post

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×