Jump to content

AP CS LV Subbi transferred


rajanani

Recommended Posts

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారు. ఆయనను బాపట్లలో ఉన్న మానవ వనరుల విభాగం ఇన్‌స్టిట్యూట్‌కు బదిలీ చేశారు. ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే తన విధులను భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్‌కు అప్పగించి.. వెంటనే వెళ్లి తన విధుల్లో చేరాలని జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ రేసులో నీలం సహానీ, సునీల్ శర్మ ఉన్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత కేబినెట్‌లో ‘వైఎస్ఆర్ అవార్డు’ పేరుతో ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అయితే, దానికి సంబంధించిన ఫైల్ మీద ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. కానీ, ఆ పనిచేయకుండా ప్రవీణ్ ప్రకాష్ నేరుగా కేబినెట్‌లో ప్రవేశపెట్టినట్టు సమాచారం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎల్వీ సుబ్రమణ్యం.. ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆగ్రహంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసినట్టు సమాచారం.

AP-CS-LV-Subramanyam-Transferred.jpeg

Link to comment
Share on other sites

Eenadu 
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయన్ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి (పొలిటికల్‌) ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తక్షణమే రిలీవ్‌ అయి.. సీసీఎల్‌ఏకి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. మరో ఐదు నెలల సర్వీసు ఉండగానే ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేయడం గమనార్హం. 

బిజినెస్‌ రూల్స్‌ మార్పిడి విషయంలో సీఎం కార్యాలయ కార్యదర్శి, జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలోనే ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ జరిగినట్టు తెలుస్తోంది. గత వారంలో ప్రవీణ్‌ప్రకాశ్‌ బిజినెస్‌ రూల్స్‌ వ్యవహారంలో వివాదాస్పద జీవో ఒకటి విడుదల చేయడంతో దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని కోరుతూ గత నెల 31న సీఎస్‌ కార్యాలయం ప్రవీణ్‌ప్రకాశ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్టు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో ప్రవీణ్‌ప్రకాశ్‌ వివరణ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన బదిలీ కావడం ప్రభుత్వ వర్గాల్లో సంచలనంగా మారింది. గడిచిన ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సీఎస్‌గానే కొనసాగుతున్నారు. ఈ బదిలీ వ్యవహారంపై ఎల్వీ సుబ్రమణ్యం ఇంకా స్పందించాల్సి ఉంది.

 

Link to comment
Share on other sites

నిరారక్షత నిర్మూలించాలనుకున్న ప్రసిద్ధి సంఘ సస్కర్త దీవిత పరమార్ధం అయిన రాజిక సౌద్యాన్యాన్ని పునర్నిర్మించడంలో విఫలమవుతున్న కారణంగా #YouAreTransferred

Link to comment
Share on other sites

1 minute ago, rajanani said:

నిరారక్షత నిర్మూలించాలనుకున్న ప్రసిద్ధి సంఘ సస్కర్త దీవిత పరమార్ధం అయిన రాజిక సౌద్యాన్యాన్ని పునర్నిర్మించడంలో విఫలమవుతున్న కారణంగా #YouAreTransferred

Lollest

Link to comment
Share on other sites

10 minutes ago, rajanani said:

నిరారక్షత నిర్మూలించాలనుకున్న ప్రసిద్ధి సంఘ సస్కర్త దీవిత పరమార్ధం అయిన రాజిక సౌద్యాన్యాన్ని పునర్నిర్మించడంలో విఫలమవుతున్న కారణంగా #YouAreTransferred

🤣🤣🤣

Link to comment
Share on other sites

14 minutes ago, rajanani said:

నిరారక్షత నిర్మూలించాలనుకున్న ప్రసిద్ధి సంఘ సస్కర్త దీవిత పరమార్ధం అయిన రాజిక సౌద్యాన్యాన్ని పునర్నిర్మించడంలో విఫలమవుతున్న కారణంగా #YouAreTransferred

Lifted from Twitter 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...