Jump to content

షాకింగ్: ఏ మీట నొక్కినా ఆ పార్టీకే ఓటు: నిజమేనన్న ఈసీ

KING007

Recommended Posts

షాకింగ్: ఏ మీట నొక్కినా ఆ పార్టీకే ఓటు: నిజమేనన్న ఈసీ
23-10-2019 16:29:19
 
637074459821086823.jpg
ముంబై: ‘‘మీరు ఏ బటన్ నొక్కినా సరే.. ఓటు మా పార్టీకే పడుతుంది’’ అంటూ పంజాబ్‌కు చెందిన ఓ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నిన్నమొన్నటి వరకు నెట్టింట్లో హల్‌చల్ చేశాయి. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ, ఆయన వ్యాఖ్యలు నిజమేనన్నట్లుగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ సంఘటన జరిగింది. ఈవీఎంలో ఉన్న ఏ గుర్తుపై నొక్కినా ఓటు ఒక పార్టీ గుర్తుకే పడుతోంది. అయితే ఈ విషయాన్ని స్థానిక ఎన్నికల అధికారులు కూడా అంగీకరించడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని సతారా జిల్లాలో వెలుగు చూసిందీ సంఘటన.
 
అక్టోబర్ 21, సతారా జిల్లా కోరేగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నెవ్లేవాడి గ్రామం. పోలింగ్ ప్రారంభమై అప్పటికి చాలా సమయమే అయింది. సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో ఓటర్ల నుంచి ఒక ఫిర్యాదు వచ్చింది. ఏ బటన్ నొక్కినా ఓటు ఒక పార్టీ గుర్తుకే వెళ్తోందని పోలింగ్ బూత్ అధికారులకు ఓటర్లు ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన అనంతరం వీవీపీప్యాట్‌లో ఒక పార్టీ గుర్తున ఓటరు స్లిప్పు కనిపించిందని తెలిపారు. అప్పటికే దాదాపు 200 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
అయితే మొదట ఈ ఆరోపణలను అధికారులు పట్టించుకోలేదు. అయితే ఓటు వేసిన ప్రతి వ్యక్తి ఇదే విషయమై ఫిర్యాదు చేస్తుండడంతో ఈవీఎం మిషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం, ఓటర్ల ఫిర్యాదు నిజమేనని, ఏ గుర్తును నొక్కినా ఓటు ఒక పార్టీ గుర్తుకే పడుతుందని అధికారులు అంగీకరించారు. జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెప్పి, వెంటనే మరొక మిషన్‌తో పోలింగ్ నిర్వహించారు.
 
కోరేగావ్ నియోజకవర్గంతో పాటు సతారా పార్లమెంట్‌ నియోకవర్గానికి పోలింగ్ జరిగింది. ఎన్సీపీ ఎంపీ ఉదయన్‌రంజీ, తన ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీతో పాటే సతారా లోక్‌సభకు ఉప ఎన్నిక జరిగింది.
Link to comment
Share on other sites

Madanapalli daggara oka village motham TDP .. Bootadham lo petti vetikina 5 families kuda undavanta YSRCP party vi. aa oori nunchi vachina EVMs lo only 1 vote vachindanta. ilaanti chalana sitraalu saanaane unnayi mana AP lo jarigina elections lo kuda

Link to comment
Share on other sites

11 minutes ago, JVC said:

Ma village lo TDP vallu theeragga kurchuni lekkalu vesukunnaru anta.. TDP ki 1500 votes majority ravalsina chota around 250 votes ee bachao antunnaru.. 

Link to comment
Share on other sites

EC is compromised! INC is much smaller evil. The damage this MoSha duo has done to country will only be unearthed if a non BJP govt comes to power. May be, it’s even not possible, as any other party that comes to power will still manipulate the system to retain power. 

Its not EC, it’s our democracy that is forced to compromise!!!

Link to comment
Share on other sites

On 10/23/2019 at 8:24 PM, sskmaestro said:

EC is compromised! INC is much smaller evil. The damage this MoSha duo has done to country will only be unearthed if a non BJP govt comes to power. May be, it’s even not possible, as any other party that comes to power will still manipulate the system to retain power. 

Its not EC, it’s our democracy that is forced to compromise!!!

+1

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...