Jump to content

Drugs in Amaravathi


akhil ch

Recommended Posts

జిల్లాలో డ్రగ్స్‌ వినియోగం కలకలం రేపుతోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు అటు పోలీసులను, ఇటు తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇంతకాలం గంజాయికే పరిమితం అనుకుంటే.. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు డ్రగ్స్‌ మత్తులో మునిగి తేలుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్‌, మెడికల్‌ విద్యార్థులే ఎక్కువగా ఈ మత్తు పదార్థాలకు బానిసలవుతున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇంటర్‌ విద్యార్థులే కాక చదువుకోకుండా ఖాళీగా తిరుగుతున్న మైనర్లు కూడా మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్లు స్పష్టమవుతోంది.
 
 
గుంటూరు: ఇటీవల మంగళగిరిలోని ఓ జూనియర్‌ కళాశాలలో కొం దరు ఇంటర్‌ విద్యార్థులు ఏకంగా తరగతి గది లోనే మత్తులో తూగారన్న ఫిర్యాదు సం చలనం సృష్టించింది. విద్యార్థులు మగతగా పడుకొని ఉండటంతో అనుమానించిన లెక్చరర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిశీ లించేందుకు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ మఫ్టీలో కళా శాలలోకి రాగా విద్యార్థులు అతనిపై దాడి చే శారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంబంధిత లెక్చరర్‌పైనా దాడి చేశారు. కళాశాల అద్దాలను కూడా పగలగొట్టారు. విద్యార్థులను అదుపులోకి తీసుకోవడాన్ని నిరశిస్తూ వారి తల్లిదండ్రులు కూడా గొడవకు దిగారు. ఈ ఘటనలో పోలీ సులు ఐదుగురు విద్యార్థులు, మరో ఇరువురు తల్లిదండ్రులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఐదుగురు విద్యార్థుల రక్త నమూ నాలను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. పోలీసులు ఆ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అయి తే పోలీసులకు ఆ విద్యార్థులు మత్తు పదార్థాలు వినియో గించినట్లు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రిమాండ్‌లో జైలులో ఉన్న వి ద్యార్థుల్లో ఒకరిని పోలీసులు కస్టడీకి తీసుకోబోతున్నట్లు సమాచారం.
 
గంజాయి మత్తులో..
కొద్ది రోజుల క్రితం గుంటూరు నగరంలోని నల్లచెరువు ప్రాంతంలో మైనర్లు గంజాయి సే వించి ఆ మొత్తంలో 13 ద్విచక్రవా హనాలను, ఓ ఆటో ను దహనం చేసిన వ్యవహారం తీవ్ర కల కలం రేపింది. ఈ ఘటనలో పదిమంది మైనర్లు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరిలో పలువురు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరే కాక ఇదే ముఠాకు చెందిన మరికొందరు ఒంగోలులో చోరీకి పాల్పడుతుండగా పోలీసులు అదుపులోకి తీసు కు న్నారు. వీరంతా ఎంతోకాలంగా గంజాయి మత్తుకు బాని సలై అందులో భాగంగానే ఆయా నేరాలకు పా ల్పడినట్లు పోలీసుల విచారణలో అం గీకరించారు.
 
నైజీరియా నుంచి దిగుమతి..
నైజీరియా నుంచి జిల్లాకు డ్రగ్స్‌ దిగుమతి అవుతున్నట్లు సమాచారం. ఇటీవల విజ యవాడలో అరెస్ట్‌ చేసిన ముఠా పెద్దఎత్తున డ్రగ్స్‌ను దిగుమతి చేసి విద్యార్థులకు, నేరస్థులకు సరఫరా చేసినట్లు పో లీసుల విచారణలో తేలింది. రాజధాని సమీపంలో హాస్టల్‌ నిర్వహిస్తున్న కందుల శ్రీకాంత్‌ అనే యువకుడు డ్రగ్స్‌ దిగుమతిలో కీలక మని పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. చెన్నైలో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన శ్రీకాంత్‌ విద్యా ర్థులకు హాస్టల్‌ నిర్వహిస్తున్నారు.
సమీపంలో చదువుతున్న టాంజానియాకు చెందిన యోనాలిస్వా, షబాని అనే ఇరువురు ఈ హాస్టల్‌లోనే ఉండేవారు. దీంతో వీరితో శ్రీకాంత్‌కు పరిచయం ఏర్పడింది. అయితే వీరు సూడాన్‌ దేశానికి చెందిన మహ్మద్‌ గహెల్‌ రసూల్‌ అలియాస్‌ కబూబ్‌తో కలిసి బెంగళూరు నుంచి ఎండీఎం డ్రగ్‌ను కొనుగోలు చేసి రాజధానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరికి బెంగళూరులో నైజీరియా ముఠా డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ విధంగా శ్రీకాంత్‌ డ్రగ్స్‌ను గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన విద్యార్థులు, నేరస్థులకు విక్రయించాడు. బెంగళూరులో గ్రాము ఎండీఎం రూ.2వేల నుంచి రూ.2,500 వరకు కొనుగోలు చేసి ఇక్కడ దానిని రూ.4వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ డ్రగ్‌ అత్యంత శక్తి వంతమైందే కాక ప్రమాదకరమైందని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో మిల్లీగ్రాము తీసుకున్నా అది మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ విధంగా యువకులు ఇటువంటి డ్రగ్స్‌కు అలవాటు పడి క్రమంగా బానిసలుగా మారుతున్నారు.
 
 
చాప కింద నీరులా..
ఇటీవల నెల్లూరులో ఓ ముఠా పట్టుపడగా ఆ తరువాత విజయవాడలోనూ టాంజానియా ముఠా దొరికి పోయింది. దీన్ని బట్టి ఏపీకి కూడా పెద్దఎత్తున డ్రగ్స్‌ చాపకింద నీరులా దిగుమతి అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో నెలకొన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ ఇటీవల ఆయా ముఠాలు పోలీసులకు దొరికిపోయాయి. హైదరాబాద్‌లో గడిచిన దశాబ్ద కాలంకుపైగా పెద్ద ఎత్తున డ్రగ్స్‌ దిగుమతి, విక్రయాలు, వినియోగిస్తున్న విషయం విదితమే. నైజీరియా ముఠాలను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ ముఠాలు ఏపీలోనూ నెట్‌వర్క్‌ పెంచుకొని తమ కార్యకలాపాలను గుట్టుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
 
 
పోలీసులు అప్రమత్తం కాకుంటే ..
మనిషిపై తీవ్ర ప్రభావం చూపే డ్రగ్స్‌ సరఫరాపై పోలీసులు తక్షణం అప్రమత్తం కాకుంటే రానున్న రోజుల్లో తీవ్ర దుష్ప్రరిణామాలు ఎదురవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ముఠాల కదలికలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని అనేక కళాశాలలో విద్యార్థులు గంజాయి వినియో గిస్తున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. లేకుంటే విద్యార్థుల భవిష్యత్తు అంథకారం అవుతుందని తల్లిదండ్రులు గుర్తించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Link to comment
Share on other sites

5 hours ago, Gunner said:

Avasaram ki minchi jebu ninda dabbu isthu, pillalu emi chesthunaru anedi pattinchukonu parents ni blame cheyali... :sleep: 

80,90 kids or colleges lo cigs, alcohol Ela alavatu ayyayo ippudu drugs ala! 

Only supply chain management create ayyindi, so product is available and people are using it

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...