Jump to content

EODB Rank


RamaSiddhu J

Recommended Posts

విజయవాడ: పెట్టుబడిదారులెవ్వరూ రాష్ట్రంపై ఆసక్తి చూపడం లేదనేది నీతి ఆయోగ్‌ ర్యాంకులతో మరోసారి నిరూపితమైందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. నవకల్పనలకు సంబంధించి నీతిఆయోగ్‌ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ పదో ర్యాంకుకు పడిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో కర్ణాటక మొదటి ర్యాంకు సాధిస్తే ఏపీ చిట్టచివరి ర్యాంకుకు పరిమితమైపోయిందన్నారు. దీనిద్వారా జగన్‌ హయాంలో ఎలాంటి పెట్టుబడులు, ప్రైవేటు ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి లేదన్నది మరోసారి స్పష్టమైందన్నారు. 

తలసరి ఆదాయం రూ.17వేలకు పడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా యనమల గుర్తు చేశారు. తెదేపా హయాంలో సులభతర వాణిజ్యంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి ఎన్నో పెట్టుబడులు, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించామని గుర్తు చేశారు. ఆర్థిక ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులతో జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రభ కనుమరుగవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

 
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...