Jump to content

Finally KCR ki kuda


GOLI SODA

Recommended Posts

కేంద్రానికి దొరికిన గులాబీ తిమింగలం ..._రహస్య జీఓల విలువ_

*రూ. 6 లక్షల కోట్లు*

◆ 1,04,171లలో 43,462 గల్లంతు

◆ బిగుస్తున్న ఉచ్చు

◆ హైకోర్టు నోటీసులు

◆ భాజపాకు దొరికిన అస్త్రం

*_ఒకొక్క విషయం బయటపడుతోంది. కలవరపెడుతోంది. కళ్ళుమూస్తే దారుణాలు ఎక్కడ బయటకు పొక్కుతాయోనని అధినేతలకు భయాలు.. ఆరేళ్ళు గుట్టుగా చేశారు. చేయించారు. దోచేశారు.. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం గుంభనంగా వీటిని దాచేసింది. అంతా 'కరెక్ట్' అయితే రహస్యం ఎందుకు..? ఎందుకో..? ఎవరి కోసం..? ఎక్కడో 'తేడా' కొడుతోంది. సరిగ్గా సరైన సమయానికి భాజాపాకు బలమైన అస్త్రం దొరికింది. ప్రజాప్రతినిధులకు రెగ్యులరైజ్ చేసిన భూ విషయాలకు సంబంధించినవి... కలెక్టర్ కార్యాలయాల నిర్మాణాలకు సబంధించిన, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన జీఓలు... ఇలా ఒక్కటేమిటి... ఏకంగా 43,462 జీఓలు...'గులాబీ దళపతులు' తమకు తోచిన రీతిలో తమ వాళ్ళకోసం తెగబడ్డారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన తరు ణం రానే వచ్చింది. ఇదే అదునుగా కొందరు హైకోర్టు గుమ్మం తట్టారు. ఇక గుట్టుగా ఉంచాల్సింది ఏం లేదు. ఉండదు. శాఖల వారీగా విడుదలైన జీఓలు కూడా గల్లంతైన జాబితాలో ఉన్నాయి. ఇందులో లాభపడ్డ వారి గుండెల్లో కొంత గులుబు నెలకొంది. 'ఆదాబ్ హైదరాబాద్' అందిస్తున్న ప్రత్యేక కథనం._*

*ఆరేళ్ళు... అత్యంత రహస్యం:*

'గత ఆరు సంవత్సరాలుగా గుట్టుగా వ్యవహారం సాగింది' అనే కంటే "సాగించారు.... సాగిస్తున్నారు... ఇంకా వీలైతే సగర్వంగా సాగించేవారు" అంటే చాలా బాగుంటుంది. జూన్ 2వతేదీ, 2014 నుండి ఆగష్టు 15వ తేదీ, 2019 మధ్యన ఈ తతంగం అత్యంత రహస్యంగా నడిచింది. సుమారు 1.04 లక్షల జీఓలు జారీ అయ్యాయి. ఇందులో 43,462 జీఓలు కన్పించకుండా పోయాయి.

*శాఖల వారీగా..📷:*

జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (జిఏడి)లో 17,061 జీఓలు జారీ అయ్యాయి. అందులో 9,053 జీఓలు కన్పించకుండా పోయాయి. హోం శాఖలో 7,945 లో జీఓలు జారీ అయ్యాయి. అందులో 5,371 జీఓలు అదృశ్యమయ్యాయి. ఆర్ధిక శాఖలో 11,995 జీఓలు ప్రభుత్వం జారీ చేసింది. అందులో 5,150 జీఓలు ప్రభుత్వ అంతర్జాలంలో లేవు. పంచాయితీరాజ్ శాఖలో 4,071 జీఓలు జారీ అయ్యాయి. అందులో 2,249 జీఓలు పత్తా లేకుండా పోయాయి.

*ఈ లెక్కలు మాత్రం పక్కా..📷:*

సెల్ ఫోన్ బిల్లుల చెల్లింపులు, వాటర్ క్యాన్ల కోసం ఖర్చు చేసిన డబ్బుల విషయానికి సంబంధించిన జీఓలను పక్కగా ప్రభుత్వ అంతర్జాలంలో క్రమం తప్పకుండా అప్ అప్ లోడ్ చేయడం గమనార్హం. ఉదాహరణకు 2014 జూలై 9వ తేదీన జీఓ నెంబర్ 15 విడుదల చేశారు. అందులో రూ.128లు ఫోన్ బిల్లు చెల్లించేందుకు నిధుల విడుదల చేసిన జీవో ఉంది. ఇదే తరహలో 743 జీఓ ద్వారా రూ.359లను బిఎస్ఎన్ఎల్ బిల్లు పక్కాగా చెల్లించినట్టు ఉంది.

*విలువ.. రూ.6లక్షల కోట్లు...📷:*

గత ఆరేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం 1,04,171 జీవోలు విడుదల చేస్తే.. 6లక్షల కోట్ల విలువైన 43,462 జీఓలు దాచి పెట్టింది. ఇందులో ప్రభుత్వం చాలా తెలివిగా....ప్రధానంగా తక్కువ నిధుల జీఓలను ప్రజల ముందుంచింది. అధిక నిధులు జీఓలను దాచారు. పారదర్శక పాలనే లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం జీఓలను ఎందుకు దాస్తున్నారు.

కలెక్టర్ కార్యాలయాల నిర్మాణానికి విడుదల చేసిన జీఓలు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన జీఓలు సైతం అదృశ్యమైన వాటిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా, వైరాలో ఓప్రాజెక్ట్‌కు సంబంధించిన జీఓ ఇంతవరకు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 95శాతం జీఓలు ప్రజలకు అందుబాటులో ఉండేవి. 35శాతం జీవోలను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.

*తెలంగాణ సర్కార్ కు హైకోర్టు నోటీసులు:*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 43,462 జీవోలు అదృశ్యం కావడంపై హైకోర్టు బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు చీప్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లో ప్రభుత్వం స్పందించాలని నోటీసులు ఇచ్చింది. హైద్రాబాద్ ఎల్బీనగర్ కు చెందిన పేరాల శేఖర్ రావు జీఓలు మాయం కావడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.

Link to comment
Share on other sites

కేసీఆర్ కి బిగిస్తున్న ఉచ్చు
TRS పార్టీని ఇరుకున పెట్టే అంశాలపై ఫోకస్ చేస్తూ వస్తున్న BJP  అబుదాబి కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న LULU GROUPS  తో KCR  KTR & KAVITHA కు  ఆర్ధికపరమైన సత్సంబంధాలు ఉన్నాయని కేంద్రం ప్రభుత్వం గుర్తించినట్టు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

అబుదాబి UAE కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్న LULU GROUPS అధినేత MA YOUSIF ALI కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని భావించారని,
ఆలోచన వచ్చిందే తడవుగా తన ప్రతినిధులను హైదరాబాదుకు పంపించి తమ కంపెనీల ఏర్పాటు ఏర్పాటు కోసం హైదరాబాదులో భూములు కావాలని, కొన్ని ప్రాంతాలను కూడా సూచించినట్టు తెలిసింది.
అందులో భాగంగా ప్రస్తుత సచివాలయం ఉన్న స్థలం తాము ఏర్పాటు చేయాలనుకున్న షాపింగ్ మాల్ కు అనుకూలంగా ఉంటుందని ఎలాగైనా ఆ స్థలాన్ని తమకు అప్పగించేలా చూడాలని కోరినట్టు సమాచారం.ప్రస్తుత సచివాలయాన్ని లులు గ్రూప్స్ సంస్థకు కట్టబెట్టేందుకే వాస్తు దోషం పేరుతో రక్షణ శాఖ అధీనంలో ఉన్న బైసన్ పోల్ లో నూతన సచివాలయ నిర్మాణం చేయాలని కేసీఆర్ సంకల్పించారనేది బయట జరుగుతున్న చర్చ.

లులు గ్రూప్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాన్ని మార్చే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా? లేక ఇంకేదైనా డీల్ జరిగిందా అనే కోణాల్లో కేంద్ర ప్రభుత్వం విచారిస్తున్నట్టు తెలుస్తుంది.

2017లో కేరళలో జరిగిన లులు గ్రూప్స్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ కుమార్తె వివాహానికి సకుటుంబ సపరివార సమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లారు, తనతోపాటు ప్రభుత్వంలోని మంత్రులను వెంటబెట్టుకొని వెళ్లడం అప్పట్లో చర్చంశనీయమైంది.

ఆ పెళ్లి సందర్భంలో ఇరుపక్షాల మధ్య జరిగిన చర్చలో ప్రస్తుతం ఉన్న సచివాలయం స్థలాన్ని లులు గ్రూప్స్ సంస్థ అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించేందుకు ఆ స్థలాన్ని అప్పగించేందుకు కేసీఆర్ ఒప్పుకున్నట్టు దానికి ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు ఆ సంస్థ అధినేత ఆఫర్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ..!

సీఎం కేసీఆర్ కేరళ వెళ్ళినప్పుడు కుటుంబసభ్యులతో మంత్రులను వెంట తీసుకెళ్లడం కూడా వ్యూహంలో భాగంగా జరిగినట్టు సమాచారం, ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో బడా వ్యాపారవేత్త కూతురి పెళ్ళికి రెండు రోజుల టూర్ వెళ్తే అందరికి అనుమానం వస్తుందనే ఉద్దేశంతో మంత్రులను వెంటబెట్టుకుని వెళ్లినట్లు ఆ పెళ్ళికి వెళ్లిన ఓ మాజీ ఎంపీ తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది.
గత ఐదేళ్ళలో కేటీఆర్, కవిత దుబాయ్ కి ఎన్నిసార్లు వెళ్లారు, ఎవరెవరిని కలిసారు అనే కోణాల్లో కేంద్రం విచారణ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

మొన్న మైహోం అధినేత, మెగా గ్రూప్ ఇళ్లపై కార్యాలయాలపై ఐటి దాడులు జరిగిన నాటి నుండి కేసీఆర్ కుటుంబంలో భయాందోళనలు మొదలయ్యాయని ఇప్పుడు లులు గ్రూప్స్ వ్యవహారం బయటికి రాబోతుందనే చర్చ జరుగుతుంది. .
ఇప్పటికే డచ్ విల్లా భూములపై కూడా కేంద్రం ఫోకస్ చేసినట్టు సమాచారం.
జరుగుతున్న పరిణామాలన్ని గమనిస్తుంటే కేసీఆర్ కుటుంబం చుట్టు బలమైన ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...