goldenstar Posted October 8, 2019 Share Posted October 8, 2019 https://www.eenadu.net/crime/newsdetails/3/2019/10/08/119023319/Kerala-lady-serial-killer-a-psychopath-suspects Link to comment Share on other sites More sharing options...
Ntrforever Posted October 8, 2019 Share Posted October 8, 2019 క్రూరత్వమా? ఇదెలా సాధ్యం? ఈ వ్యక్తికి సైకో లక్షణాలు ఉన్నాయా? సినిమాలో చూపే విధంగా స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో ఆమె బాధ పడుతోందా? కేరళలో సంచలనం రేపిన వరుస సైనేడ్ హత్యల నిందితురాలు జాలీ కేసును విచారిస్తున్న పోలీసులు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు. 14 సంవత్సరాల వ్యవధిలో ఆరుగురు కుటుంబ సభ్యులను హత్య చేయడం వెనుక ఉన్న మహిళ ఒక సాధారణ వ్యక్తిగా కాకుండా సీరియల్ కిల్లర్ కావడానికే ఎక్కువ అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ వైపు గృహిణిగా, సీరియల్ కిల్లర్‌గా కనిపిస్తున్న ఆమెకు స్ల్పిట్ పర్సనాలిటీ ఉందని భావిస్తున్నట్లు డీజీపీ లోక్‌నాథ్ బెహరా పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం తినే ఆహారంలో సైనేడ్ కలిపి జాలీ ఆ ఆరుగురు కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకుందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో ఆమె స్నేహితులు, దగ్గరి బంధువులు మాత్రం ఆమె అమాయకురాలని, ఆమెను ఈ కేసులో కావాలనే ఇరికించారని ఆరోపిస్తుండడం గమనార్హం. దీంతో ఒక మనిషిలో భిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉండడంపై పోలీసులు సైకో అనాలసిస్ పరీక్ష నిర్వహించడానికి సిద్ధమౌతున్నారు. ‘అమాయకంగా కనిపిస్తున్న ఓ మామూలు గృహిణి, ఒక సీరియల్ కిల్లర్ అని ప్రాథమిక ఆధారాలు తెలుపుతున్న ఈ కేసు చాలా సంక్లిష్టమైనది. విచారణ సరైన కోణంలో కొనసాగాలంటే, మంచి సైకాలజిస్ట్‌ల సాయం తప్పనిసరి. ఆమె మానసిక స్థితి తెలుసుకోవడం అవసరం’ అని కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు జాలీ కుమారుడు 21 ఏళ్ల రెమో థామస్ ఈ కేసు గురించి మాట్లాడుతూ.. ఈ హత్యలన్నీ తన తల్లే చేసిందంటే నమ్మలేకపోతున్నాని చెబుతున్నాడు. కానీ ఆధారాలు ఆమె దోషి అని నిరూపిస్తున్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోవడం మంచిదని అభిప్రాయపడడం కొసమెరుపు Link to comment Share on other sites More sharing options...
KING007 Posted October 8, 2019 Share Posted October 8, 2019 RGV ki inko movie ki story set ayinatte.... Link to comment Share on other sites More sharing options...
supertdp Posted October 9, 2019 Share Posted October 9, 2019 Vammo aa background voice venalemu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.