Jump to content

Kerala lady killer


goldenstar

Recommended Posts

క్రూరత్వమా? ఇదెలా సాధ్యం? ఈ వ్యక్తికి సైకో లక్షణాలు ఉన్నాయా? సినిమాలో చూపే విధంగా స్ప్లిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో ఆమె బాధ పడుతోందా? కేరళలో సంచలనం రేపిన వరుస సైనేడ్‌ హత్యల నిందితురాలు జాలీ కేసును విచారిస్తున్న పోలీసులు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు. 

14 సంవత్సరాల వ్యవధిలో ఆరుగురు కుటుంబ సభ్యులను హత్య చేయడం వెనుక ఉన్న మహిళ ఒక సాధారణ వ్యక్తిగా కాకుండా సీరియల్‌ కిల్లర్‌ కావడానికే ఎక్కువ అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ వైపు గృహిణిగా, సీరియల్‌ కిల్లర్‌గా కనిపిస్తున్న ఆమెకు స్ల్పిట్‌ పర్సనాలిటీ ఉందని భావిస్తున్నట్లు డీజీపీ లోక్‌నాథ్‌ బెహరా పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం తినే ఆహారంలో సైనేడ్‌ కలిపి జాలీ ఆ ఆరుగురు కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకుందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో ఆమె స్నేహితులు, దగ్గరి బంధువులు మాత్రం ఆమె అమాయకురాలని, ఆమెను ఈ కేసులో కావాలనే ఇరికించారని ఆరోపిస్తుండడం గమనార్హం.

దీంతో ఒక మనిషిలో భిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉండడంపై పోలీసులు సైకో అనాలసిస్‌ పరీక్ష నిర్వహించడానికి సిద్ధమౌతున్నారు.  ‘అమాయకంగా కనిపిస్తున్న ఓ మామూలు గృహిణి, ఒక సీరియల్‌ కిల్లర్‌ అని ప్రాథమిక ఆధారాలు తెలుపుతున్న ఈ కేసు చాలా సంక్లిష్టమైనది. విచారణ సరైన కోణంలో కొనసాగాలంటే, మంచి సైకాలజిస్ట్‌ల సాయం తప్పనిసరి. ఆమె మానసిక స్థితి తెలుసుకోవడం అవసరం’ అని కేరళ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు జాలీ కుమారుడు 21 ఏళ్ల రెమో థామస్‌ ఈ కేసు గురించి మాట్లాడుతూ.. ఈ హత్యలన్నీ తన తల్లే చేసిందంటే నమ్మలేకపోతున్నాని చెబుతున్నాడు. కానీ ఆధారాలు ఆమె దోషి అని నిరూపిస్తున్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోవడం మంచిదని అభిప్రాయపడడం కొసమెరుపు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...